NEET, JEE to be held twice a year, says Javadekar National Testing Agency to conduct NEET, JEE Main twice a year; UGC-NET, other competitive exams to be computer-based. Competitive exams such as the National Eligibility-Cum-Entrance Test (NEET), Joint Entrance Examination (JEE) Main, the National Eligibility Test (UGC-NET), Common Management Admission Test (CMAT) and others will now be computer-based and conducted by the National Testing Agency, Union education minister Prakash Javadekar said on Saturday. Launching the NTA at a press conference at Shashtri Bhawan in New Delhi, Javadekar said that the syllabus, nature of questions, language alternatives and exam fees will remain the same but the mode of examination will now be a computer-based test.
The same student can take the exam two times a year and the best score will be taken into consideration said the Union HRD Minister.
The same student can take the exam two times a year and the best score will be taken into consideration said the Union HRD Minister.
NEET JEE Twice a Year Union HRD Minister NEET JEE held Twice a Year
The minister also announced that both NEET and JEE Main will be conducted twice a year. "NEET will be held in February and May, and JEE Main will be conducted in January and April. Students will have the choice to attempt both or one but the best score will be taken into account while giving admission," Javadekar said.- జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలైన నీట్, జేఈఈ(మెయిన్స్), నెట్ ప్రవేశ పరీక్షలను ఇక మీదట నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ పరీక్షలను సీబీఎస్ఈ నిర్వహిస్తోంది. జావడేకర్ ఈరోజు దిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నీట్, జేఈఈ పరీక్షలను ఇకపై ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తామని చెప్పారు. ఈ పరీక్షలకు విద్యార్థులు రెండు సార్లూ లేదంటే ఏదైనా ఒకసారి హాజరుకావొచ్చని తెలిపారు. ఎక్కువ స్కోర్ వచ్చిన పరీక్షను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. విద్యారంగంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ద్వారా పలు సంస్కరణలు తీసుకొస్తామని గతంలోనే కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే.
- ఇకపై ఈ పరీక్షలన్నింటిని సీబీఎస్ఈ స్థానంలో ఎన్టీఏ నిర్వహిస్తుందని జవదేకర్ పేర్కొన్నారు. ప్రతి ఏటా ఫిబ్రవరి, మే నెలల్లో నీట్, జనవరి, ఏప్రిల్ నెలల్లో జేఈఈ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు రెండు సార్లు నీట్ పరీక్షను రాస్తే వచ్చే బెస్ట్ స్కోర్‌ను అడ్మిషన్ల కోసం పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు.
- కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది విద్యార్థులకు లాభం చేకూరుతుంది. ఏడాదిలో ఒక ప్రయత్నంలో సీటు సాధించలేకపోయిన వారు వెంటనే మరో ప్రయత్నం చేయడం ద్వారా విజయం సాధించే అవకాశం కలుగుతుంది.
- జాతీయ అర్హత పరీక్ష(నెట్) డిసెంబరులో నిర్వహించనున్నట్లు తెలిపారు. జేఈఈ(మెయిన్స్) ప్రవేశ పరీక్షను ఏడాదిలో జనవరి, ఏప్రిల్‌లలో నిర్వహిస్తామని, నీట్ ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి, మే నెలల్లో పెడతామని వెల్లడించారు. ప్రతి పరీక్షను నాలుగు లేదా అయిదు తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ పరీక్షలను ఆన్లైన్ నిర్వహిస్తామని, విద్యార్థులు ఇళ్లలో లేదా అధికారికంగా గుర్తించిన కంప్యూటర్ సెంటర్లలో ఉచితంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చని జావడేకర్ వెల్లడించారు. త్వరలోనే అధికారికంగా గుర్తించిన కంప్యూటర్ సెంటర్ల వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. సిలబస్, ప్రశ్నల ఫార్మాట్, భాష, ఫీజుల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టంచేశారు.