వాట్సాప్‌లో ట్రైన్‌ రన్నింగ్‌ స్టేటస్‌ Train Running Status in Whatsapp

వాట్సాప్‌లో ట్రైన్‌ రన్నింగ్‌ స్టేటస్‌ తెలుసుకోవడమెలా?

Train Running Status in Whatsapp


దూర ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఎక్కాల్సిన రైలు ఎక్కడుందో తెలుసుకోవాలన్నా, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌ తెలుసుకోవాలన్నా సాధారణంగా రైల్వే వెబ్‌సైట్‌ను తెరవడమో, కొన్ని థర్డ్‌ పార్టీ యాప్స్‌ ఉపయోగించడమో చేస్తుంటాం. ఇలా ప్రతిసారీ వెబ్‌సైట్‌ గానీ, యాప్‌గానీ తెరవకుండా సులభమైన పద్ధతుల్లో పొందడమెలా?.. అందుకు సులువైన మార్గం వాట్సాప్‌. నిత్యజీవితంలో భాగమైన వాట్సాప్‌ను ఉపయోగించి ఆ వివరాలను పొందాలంటే ముందుగా ఓ నంబర్‌ను మీరు సేవ్‌ చేసుకుంటే చాలు.. మీరు కోరుకున్న సమయంలో ఆ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.
  • ముందుగా అప్‌డేట్‌ చేసిన వాట్సాప్‌ను మీరు వినియోగిస్తుండాలి.
  • ట్రావెల్‌ కంపెనీ అయిన మేక్‌మై ట్రిప్‌కు చెందిన 73493 89104 నంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్‌ చేసుకోవాలి.
  • తర్వాత వాట్సాప్‌ కాంటాక్ట్స్‌లోకి వెళ్లి రీఫ్రెష్‌ చేయండి. ఆ తర్వాత మేక్‌మైట్రిప్‌ చాట్‌ విండోను తెరిచి అందులో మీరు ఎక్కాల్సిన రైలు నంబర్‌ను పంపించడం ద్వారా రైలు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళుతోంది? ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఎంత ఆలస్యంగా వెళుతోంది? వంటి తదితర వివరాలను మీరు వాట్సాప్‌లో సులువుగా పొందొచ్చు.
  •  మీ పీఎన్‌ఆర్‌ నంబర్‌ స్థితిని కూడా ఇదే పద్ధతిలో ఎంటర్‌ చేసి తెలుసుకోవచ్చు.