AMMA VODI Detailed Guidelines Schedule Rc 242/A Dated 16.11.2019

CSE has released the Detailed AMMA VODI Schedule and Guidelines vide Rc No 242/A Dated 16.11.2019. Data required for AMMA VODI Benefit. Formats required for AMMA VODI. AMMA VODI Scheme Step by Step Procedure. Rc 15000 Benefit to All Mothers with AMMA VODI. How to Apply for AMMA VODI. Certificates for AMMA VODI.

AMMA VODI Detailed Guidelines Schedule Rc 242/A Dated 16.11.2019

ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019 తేది : 16.11.2019

  • విషయం : పాఠశాల విద్యాశాఖ-నవరత్నాలు-జగనన్న అమ్మఒడి కార్యక్రమం-1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులకు రూ.15,000/- వార్షిక ఆర్థిక సహాయం అందించుట- 2019-20విద్యాసంవత్సరం నుండి అమలు పరచుట విషయమై సూచనలు. 
  • నిర్దేశములు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ (ప్రోగ్రాం-11) వారి ఉత్తర్వులు నెం. 79, తేది : 4.11.2019
ఆదేశములు
  1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ పాఠశాలల్లోనూ, ఎయిడెడ్ పాఠశాలల్లోనూ, ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లోనూ, జూనియర్ కళాశాలల్లోనూ మరియు అన్ని ప్రభుత్వ శాఖల గురుకుల పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ 1వ తరగతి నుండి ఇంటర్ మీడియట్ వరకు చదువుతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులు వారికి కుల, మత, ప్రాంత, వివక్షత లేకుండా రూ.15,000/- చొప్పున వార్షిక ఆర్థిక సహాయం అందించటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై నిర్దేశం ద్వారా ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు.
  2. 2. పై కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం “జగనన్న అమ్మఒడి" కార్యక్రమంగా ప్రకటించింది. ఈ కార్యక్రమం కింద ద్వారా లబ్ధి పొందగల తల్లులు లేదా గుర్తింపు పొందిన సంరక్షకుల అర్హతలను, వార్షిక ఆర్థిక సహాయం చెల్లింపు విధానాన్ని మరియు పర్యవేక్షణ విధానాన్ని ప్రభుత్వం పై ఉత్తర్వుల ద్వారా నిర్దేశించింది. ఆ మేరకు అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు మరియు విద్యార్థుల హాజరు, చెల్లింపు మొదలైన వి విధానాలను ఆన్‌లైన్ ద్వారా చేపట్టవలసినదిగా కూడా ఆదేశించింది.
  3. 3. ఇందుకు గాను ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులు మరియు గుర్తింపు పొందిన సంరక్షకుల్లో అర్హులైన వారి ఆధార్ కార్డు వివరాలు, బాంకు అకౌంటు నెంబరు మరియు ఐఎఫ్ఎస్ సీ కోడ్ వివరములు సేకరించవలసి ఉన్నది. ఆ వివరాలతో పాటు ఆయా అర్హత కలిగిన తల్లులు లేదా సంరక్షకుల పిల్లలు కనీసం 75% హాజరు ఉన్నదీ లేనిదీ కూడా పరిశీలించి ధృవీకరించుకోవలసి ఉంది. ఈ వివరాలను గ్రామస్థాయిలో ఏర్పాటైన గ్రామ సచివాలయం ద్వారా, గ్రామస్థులందరికి తెలియచేసి దానిలో ఆ సమాచారంలో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని సామాజిక తనిఖీ ద్వారా సరిదిద్దుకోవలసి ఉన్నది.
  4. 4. ఈ మొత్తం కార్యక్రమాన్ని ఈ ప్రక్రియ ద్వారా అమలు పరచటం కోసం రాష్ట్ర ప్రభుత్వం నవంబరు 20 నుండి డిసెంబరు 20 వరకు వైఎస్ఆర్ నవశకం పేరిట ఉద్యమస్థాయిలో అమలు జరుపటానికి నిశ్చయించింది. ఈ పథకం కింద అర్హత కలిగిన తల్లుల, సంరక్షకుల వివరాలను సేకరించటానికి, ఆ వివరాలను సామాజిక తనిఖీ ద్వారా ధృవీకరించుకోవటానికి, ఆ విధంగా ధృవీకరించుకున్న తరువాత తిరిగి ఆ సవరణలను ఆన్ లైన్ ద్వారా చేపట్టి అర్హుల జాబితాలను ప్రకటించటానికి ప్రభుత్వం టైం లైన్లను నిర్దేశించింది.
  5. 5. ప్రభుత్వం నిర్దేశించిన టైం లైన్ ప్రకారం, పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర స్థాయి నుండి గ్రామస్థాయి వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిన విధి విధానాల గురించి పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి 16.11.2019న రాష్ట్ర, జిల్లా మరియు మండల స్థాయి విద్యాశాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్పష్టమైన ఆదేశాలను జారీ చేయటం జరిగింది.
  6. 6. ఆ ఆదేశాలు ఈ కింది విధంగా ఉన్నాయి. పాఠశాల చైల్డ్ ఇన్ఫోను అప్డేట్ చేయటం 
  7. 7. రాష్ట్రంలో యూ డైస్ కోడ్ కలిగిన పాఠశాలలు 62,434 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల జాబితాలు ఆన్ లైన్ లో చైల్డ్ ఇన్ఫోలో పొందుపరచబడ్డాయి. ఈ వివరాలను ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు 17.11.2019 నుండి 19.11.2019 మధ్య కాలంలో ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి ధృవీకరించుకోవలసి ఉంటుంది. ఇందుకు అవసరమైన సూచనలను ఈ ఆదేశాలకు అనుబంధం 1-3 దాకా జతపరచడమైనది. ఆ విధంగా ధృవీకరించుకున్నప్పుడు తన పాఠశాలలో పేర్లు ఉండి మరొక పాఠశాలకు బదిలీ అయిన విద్యార్థులు ఉన్నట్లయితే వారిని తన పాఠశాల సమాచారం నుండి తొలగించి ఆ విద్యార్థులు బదిలీ అయిన పాఠశాలకు పంపించవలసి ఉంటుంది. వేరే పాఠశాల నుండి తన పాఠశాలకు బదిలీ మీద వచ్చిన విద్యార్థుల వివరాలు తన దగ్గర లేనట్లయితే ఆ వివరాలను ఆ విద్యార్థి ఆధార్ నెంబరు ద్వారా సంబంధిత పాఠశాల నుండి సంగ్రహించవలసి ఉంటుంది. ఎక్కువ మంది విద్యార్థులు ఉండే ఉన్నత పాఠశాలల్లో ఈ సమాచార సేకరణకు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది అందర్నీ ఉపయోగించుకోవలసి ఉంటుంది. అడేటెడ్ చైల్డ్ ఇన్ఫోను ఎపిసిఎఫ్ఎస్ఎస్ కు ఎపి ఆన్‌లైన్ ద్వారా అందించడం 
  8. 8. ఆ విధంగా చైల్డ్ ఇన్ఫోను 19.11.2019 సాయంత్రం 5.00 గంటల్లోగా అప్డేట్ చేసిన తరువాత ఆ సమాచారాన్ని రాష్ట్ర స్థాయిలో ఎపి ఆన్లైన్ వారు ఎపిసిఎఫ్ఎస్ఎస్ కు అందిస్తారు. ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారి ద్వారా తల్లుల లేదా సంరక్షకుల వివరాలను జతపరచటం 9. ఎపి ఆన్‌లైన్ ద్వారా తమకు అందిన చైల్డ్ ఇన్ఫోను ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారు రేషన్ కార్డుల జాబితాతో మరియు ప్రజాసాధికార సర్వే సమాచారంతో సరిపోల్చి విద్యార్థి వారీగా తెల్ల రేషన్ కార్డులో ఉన్న తల్లుల లేదా సంరక్షకుల వివరాలను సేకరించి ఆ మొత్తం సమాచారాన్ని ఎపిసిఎఫ్ఎస్ఎస్ పోర్టల్ ద్వారా ప్రకటిస్తారు. 10. ఈ కార్యక్రమం 21.11.2019 నాటికి పూర్తి చేసి ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారు ప్రతి ప్రధానోపాధ్యాయుడికి 'లాగ్ ఇన్ ఐడి' మరియు 'పాస్ వర్డ్' అందచేస్తారు. 11. ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారు ప్రధానోపాధ్యాయుడికి అందచేసే సమాచారం 3 ప్రొఫార్మాలుగా ఉంటుంది.
ప్రొఫార్మా-1 : తెల్ల రేషను కార్డు వివరాలు కలిగిన తల్లుల మరియు సంరక్షకుల వివరాలతో కూడుకున్న విద్యార్థుల జాబితా. 
ప్రొఫార్మా-2 : తెల్ల రేషను కార్డు వివరాలు లేని తల్లుల మరియు సంరక్షకుల వివరాలతో కూడుకున్న విద్యార్థుల జాబితా.
ప్రొఫార్మా-3 : ఆధార్ నెంబరు / ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబరు లేని విద్యార్థుల జాబితాను సేకరించటం - కోసం ఒక ఫార్మాటు. ఎపిసిఎఫ్ఎస్ఎస్ ద్వారా అందిన వివరాలను గ్రామ సచివాలయానికి అందించడం
  1. 12. ఎపిసిఎఫ్ఎస్ఎస్ ద్వారా తమకు అందిన మొదటి ఫార్మాట్లోని సమాచారాన్ని (ప్రీ పాపులేటెడ్ డేటా) ప్రధానోపాధ్యాయుడు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ఏవైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దుకోవాలి. ఆ తరువాత ఆ జాబితాను సంబంధిత గ్రామ సచివాలయంలోని విద్య, సంక్షేమ సహాయకుని లాగినకు 24.11.2019 నాటికి పంపవలసి ఉంటుంది.
  2. 13. ఎపిసిఎఫ్ఎస్ఎస్ ద్వారా తమకు అందిన రెండవ ఫార్మాట్ లోని విద్యార్థుల వివరాలను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ఆ తరువాత ఆ ఫార్మాట్ ను కూడా సంబంధిత గ్రామ సచివాలయంలోని విద్యా, సంక్షేమ సహాయకుని లాగిన్ కు 24.11.2019 నాటికి పంపవలసి ఉంటుంది.
  3. 14. ఇక మూడవ ఫార్మాట్లో తన దగ్గర ఉన్న విద్యార్థుల్లో ఆధార్ నెంబరు / ఆధార్ ఎన్ రోల్ మెంట్ నెంబరు లేని విద్యార్థుల వివరాలను నమోదుచేసి సంబంధిత గ్రామ సచివాలయంలోని విద్యా, సంక్షేమ సహాయకుని లాగిన్‌కు 24.11.2019 నాటికి పంపవలసి ఉంటుంది. గ్రామ సచివాలయ స్థాయిలో వివరాల సేకరణ మరియు ధృవీకరణ
  4. 15. గ్రామ సచివాలయాల్లోని విద్యా, సంక్షేమ సహాయకుడు తనకు ప్రధానోపాధ్యాయుడి ద్వారా అందిన సమాచారంలో మొదటి ఫార్మాటును ఒక ప్రింటు తీసుకుని గ్రామ సచివాలయం నోటీసు బోర్డులో 25.11.2019 నాటికి ప్రకటించాలి. ఆ ప్రకటన పైన గ్రామస్థులకు ఏదైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే వాటిని తెలియచేసుకోవడం కోసం మూడు రోజుల గడువు ఇవ్వాలి.
  5. 16. విద్యా, సంక్షేమ సహాయకుడు ప్రధానోపాధ్యాయుడి ద్వారా తనకందిన 2వ మరియు 3వ ఫార్మాట్లను సంబంధిత గ్రామ వాలంటీర్లకు అందచేయాలి. వారి ద్వారా ఆ సమాచారాన్ని ఆయా కుటుంబాలకు వివరించి తద్వారా ఆ సమాచారంలో లేని వివరాలు అనగా తల్లుల పేర్లు, తెల్ల రేషను కార్డు వివరాలు, ఆధార్ నెంబరు, బాంకు అకౌంటు నెంబరు, ఐఎఫ్ఎస్ సి కోడు నెంబరు మొదలైన వివరాలను సేకరించాలి. ఆ సమాచారంలో తెల్ల రేషను కార్డు లేని కుటుంబాల విషయంలో వారు నిరుపేద / అర్హత కలిగిన కుటుంబాలకు చెందిన వారు అవునో కాదో ఆరంల పరిశీలన (సి స్టెప్ వాలిడేషన్) ద్వారా ధృవీకరించుకోవాలి.
  6. 17. మూడవ ఫార్మాట్లో ఆధార్ నెంబరు లేని విద్యార్థుల విషయంలో కూడా తగు సమాచారాన్ని తప్పనిసరిగా సేకరించాలి.
  7. 18. ఈ విధమైన సమాచార సేకరణ గ్రామ వాలంటీర్ల ద్వారా 25.11.2019 నుండి 1.12.2019 దాకా చేపట్టవలసి ఉంటుంది.
  8. 19. ఆ విధంగా గ్రామ వాలంటీర్లు సేకరించిన సమాచారాన్ని అనగా ఆ 'హార్డ్ కాపీ'లను సంబంధిత విద్యా, సంక్షేమ సహాయకుడు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయునికి నేరుగా అందచేయాలి.
  9. 20. గ్రామ వాలంటీర్లు సేకరించిన సమాచారం స్థానిక పాఠశాలకు సంబంధించినది అయినప్పుడు ఆ సమాచారం నేరుగా స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి అందచేయాలి.