File No.ESE02-27021/74/2019-MDM -CSE. RC.NO.SE.02, dated 26/12/2019 పాఠశాల విద్యాశాఖ-మధ్యాహ్న భోజన పథకం, గుడ్లు,కందిపప్పు, నూనె సంబంధిత బిల్లుల చెల్లింపు వికేంద్రీకృత విధానం డిసెంబర్-2019 నుండి అమలు పరచడం గురించి పాఠశాల విద్యాశాఖ కమీషనర్ వారి తదుపరి ఉత్తర్వులు. AP MDM Eggs Oil Dal Bills Decentralized Payment from December 2019
తదనుగుణముగా జిల్లా విద్యాశాఖాధికారులు / మండల విద్యాశాఖాధికారులు / ఉపవిద్యాశాఖాధికారులు / ప్రధానోపాధ్యాయులు ఈ క్రింది చర్యలను వెంటనే అమలు పరచవలసినదిగా ఆదేశించడమైనది.
రాష్ట్రంలోని అందరు జిల్లా విద్యాశాఖాధికారులు ఈ సూచనలను అందరు ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖాధికారులు ,ఉపవిద్యాశాఖాధికారులు పాటించే విధముగా తక్షణమే చర్యలు తీసుకోవాలి . బిల్లుల చెల్లింపు కోసం అవసరమైన బడ్జెట్ కేటాయింపు కూడా అందుబాటులో ఉంచడం జరిగినది .
AP MDM Eggs Oil Dal Bills Decentralized Payment from December 2019
ఆదేశములు- మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లుల కోసం కేంద్రీకృత చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగినది . ఏ . పి . సి . ఎఫ్ . ఎస్ . ఎస్ యొక్క సహకారంతో ఈ విధానములో అన్ని బిల్లులు చెల్లింపు జరుగుతున్నది .
- వంట ఖర్చు మరియు గౌరవవేతనానికి సంబంధించిన బిల్లుల చెల్లింపు అధికారాలను జిల్లా విద్యాశాఖ అధికారులకు బదలాయించడం జరిగినది . ఈ విధానంలో బిల్లుల చెల్లింపు విజయవంతముగా జరుగుతున్నది .
- పై విధానములను నిశితముగా పరిశీలించిన పిదప కోడి గుడ్డు బిల్లుల క్లియరెన్స్ ప్రక్రియను వేగవంతం చేయడానికి , గుడ్ల సరఫరాకు సంబంధించి బిల్లుల చెల్లింపు విధానమును కూడా జిల్లా విద్యాశాఖ అధికారులకు బదలాయించుటకు నిర్ణయించడమైనది .
తదనుగుణముగా జిల్లా విద్యాశాఖాధికారులు / మండల విద్యాశాఖాధికారులు / ఉపవిద్యాశాఖాధికారులు / ప్రధానోపాధ్యాయులు ఈ క్రింది చర్యలను వెంటనే అమలు పరచవలసినదిగా ఆదేశించడమైనది.
- 1. ప్రధానోపాధ్యాయులు యమ్ . డి . యమ్ కోసం ఉద్దేశించిన మొబైల్ అనువర్తనాన్ని వెంటనే అప్లైట్ చేసుకోవాలి . డేటా ఎంట్రీ స్కూల్ యు - డైస్ కోడ్ మరియు ప్రధానోపాధ్యాయులు యొక్క అధీకృత మొబైల్ నంబర్ లో మాత్రమే సాధ్యమవుతుంది .
- 2 . హాజరు , మధ్యాహ్న భోజనం తీసుకున్న పిల్లలు , కోడి గుడ్ల వినియోగం మొదలైన వాటికి సంబంధించిన మొత్తం డేటా మధ్యాహ్న భోజనం అయిన వెంటనే నమోదు చేయాలి . గుడ్లు అందుకున్న డేటాను సరఫరాదారుల నుండి గుడ్లు అందుకున్న సమయంలో నమోదు చేయాలి
- 3 . ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ ( ఎపి సిఎఫ్ఎస్ఎస్ ) వారు మధ్యాహ్న భోజన పథకానికి ఉద్దేశించిన మొబైల్ అప్లికేషన్లో హెడ్ మాస్టర్స్ అందించిన డేటా ప్రకారం జిల్లా విద్యాశాఖాధికారి పేరిట బిల్లును తయారు చేస్తారు . అలా తయారు చేసిన బిల్లు ప్రతి నెల 5 వ తేదీలోగా డి . ఇ . ఓకు పంపబడుతుంది .
- 4 . చైల్డ్ ఇన్ఫో సమాచారం , మరియు యం డి యం ల మధ్య నమోదు గణాంకాలలో తేడా ఉన్న యెడల ప్రధానోపాధ్యాయులు చైల్డ్ - ఇన్ఫోను వెంటనే అప్డేట్ చేసుకోవాలి . తద్వారా పిల్లల సంఖ్య నమోదులో ఎటువంటి తేడాలు లేకుండా నిర్ధారించుకోవాలి .
- 5 . గుడ్ల సరఫరా , వినియోగం మరియు సరఫరాదారుల ఖాతా వివరాలను డి . ఇ . ఓ ఎప్పటికప్పుడు తనిఖీ చేసి , బిల్లులలోని పొరపాట్లను సరిచేయాలి ( వివిధ కారణాల వల్ల డేటా ఎంట్రీ సాధ్యం కాని పాఠశాలల్లో మాత్రమే ) .
- 6 . తనిఖీ చేసిన తరువాత , సరిదిద్దబడిన బిల్లులను చెల్లింపు కోసం జిల్లా ఖజానాకు వెంటనే ( ప్రతి నెల 10 వ తేదీకి ముందు ) తప్పకుండా సమర్పించాలి .
- 7 . బిల్లు మొత్తంలో ఏవైనా మార్పులు ఉంటే , ఆ మేరకు బిల్లును రూపొందించడానికి సమాచారాన్ని కమీషనర్ కు సమర్పించాలి .
- 8 . ఆధార్ నంబర్ తో అనుసంధానించబడిన సరఫరాదారుల బ్యాంక్ ఖాతా నంబర్లు మాత్రమే చెల్లింపు కోసం సి.ఎఫ్.ఎం.ఎస్ లో నమోదు చేయవలసి ఉంటుంది .
- 9 . ఉన్న సరఫరాదారుని తొలగించడం / మార్చడం వంటి అసాధారణమైన పరిస్థితులలో తప్ప ఖాతా నంబర్లలో ఎటువంటి మార్పులు చేయరాదు .
- 10 . ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ హాజరు వివరాలను మధ్యాహ్న భోజన పథకం కోసం ఉద్దేశించిన మొబైల్ అప్లికేషన్ లో తప్పనిసరిగా సమర్పించాలి . ఏ విధమైన దిద్దుబాట్లు అనుమతించబడవు .