AMMA VODI Vaarotsavaalu 4th to 9th Jan Detailed Day Wise Schedule

ఆర్.సి.నెం. 242/ఎ&ఐ/2019 తేది : 02.01.2020 AMMA VODI Vaarotsavaalu 4th to 9th Jan Detailed Day Wise Schedule అమ్మఒడి కార్యక్రమాన్ని 9-1-2020న చిత్తూరు పట్టణంలో గౌరవనీయ ముఖ్యమంత్రివర్యులు ప్రారంభించనున్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని 4-1-2020 నుండి 9-1-2020 దాకా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరియు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 'అమ్మఒడి వారోత్సవం' నిర్వహించడానికి నిర్ణయించడమైనది.

AMMA VODI Vaarotsavaalu 4th to 9th Jan Detailed Day Wise Schedule

  • విషయం : పాఠశాల విద్యాశాఖ-నవరత్నాలు-జగనన్న అమ్మఒడి కార్యక్రమం-1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులకు రూ. 15,000/- వార్షిక ఆర్థిక సహాయం అందించుట- 2019-20 విద్యాసంవత్సరం నుండి అమలు పరచుట విషయమై తదుపరి సూచనలు. 
నిర్దేశములు : 
  • 1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ (ప్రోగ్రాం-II) వారి ఉత్తర్వులు నెం. 179,
  • తేది : 4.11.2019
  • 2. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 16.11.2019
  • 3. ఈ కార్యా లయపు కార్యావర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 22.11.2019
  • 4. ఈ కార్యా లయపు కార్యా వర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 2.12.2019
  • 5. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 20.12.2019
  • 6. ఈ కార్యాలయపు కార్యా వర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 31.12.2019 ఆదేశములు
Details in Brief:
  • జగనన్న అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా అర్హులైన తల్లుల సంరక్షకుల జాబితాలు సిద్ధం చేసేందుకు పై సూచికలు 2 నుంచి 6లలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 
  • 2. పై ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు మరియు మండల విద్యాశాఖాధికారులు మొదటి జాబితాలో పొందుపరచిన అర్హులైన విద్యార్థుల వివరాలను 28-12-2019 నుండి 1-1-2020 దాకా గ్రామసచివాలయాల ద్వారా సోషల్ ఆడిట్ నిమిత్తం ప్రదర్శించి సదరు ఆడిట్ ద్వారా తెలియవచ్చిన అభ్యంతరాలను ఈ కార్యాలయానికి తెలియజేశారు. వారు తెలియపరచిన అభ్యంతరాల్ని పరిశీలించి సిఇఓ ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారి ద్వారా మొదటి జాబితాలో అర్హులైన తల్లుల సంరక్షకుల తుది జాబితాను 2-1-2020 నాడు అందరూ జిల్లా విద్యాశాఖాధికారులకు ఇంటర్మీడియట్
  • ప్రాంతీయ విద్యాధికారులకు, డివిజనల్ మండల మరియు విద్యాశాఖాధికారులకు, అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్లకు , పాఠశాలలకు, కళాశాలలకు మరియు గ్రామ సచివాలయాలకు/వార్డు సచివాలయాలకు పంపడమైనది. 
  • 3. సదరు జాబితాలను గ్రామసచివాలయాలలో 2-1-2020 నాడు ప్రదర్శించవలసిందిగా సంబంధిత అధికారులను ఇందుమూలముగా ఆదేశించడమైనది. 
  • 4. ఈ కార్యక్రమాన్ని 9-1-2020న చిత్తూరు పట్టణంలో గౌరవనీయ ముఖ్యమంత్రివర్యులు ప్రారంభించనున్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని 4-1-2020 నుండి 9-1-2020 దాకా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరియు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 'అమ్మఒడి వారోత్సవం' నిర్వహించడానికి నిర్ణయించడమైనది. 
  • 5. 'అమ్మఒడి వారోత్సవం' ఈ కింది విధంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరియు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో నిర్వహించవలసిందిగా ఇందు మూలముగా ఆదేశించడమైనది.

Detailed AMMA VODI VAAROTSAVAALU SCHEDULE