Pay Fixation Increment AP Fundamental Rules in Telugu for Employees Teachers

Important AP Fundamental Rules in Telugu for Employees Pay Fixation, Increment Rules in Telugu. Below is the brief details of the Fundamental Rules in Telugu regarding Promotion Pay Fixation, Increments. Pay Fixation Rules as per FR 22,30,31,35 details in Telugu. Pay Fixation Rules as per APFR, Increment AP Fundamental Rules in Telugu for Employees Teachers

AP Fundamental Rules in Telugu for Employees Pay Fixation, Increment Rules in Telugu


ఫండమెంటల్ రూల్సు (ఫిక్సేషన్లు-ఇంక్రిమెంట్లు)
  • ఒక ఉద్యోగి వేరొక పోస్టునందు నియమించబడినప్పుడు లేక ప్రమోషను పొందినప్పుడు ఫండమెంటల్ రూల్స్ 22,30,31,35 ననుసరించి అతని వేతన స్థిరీకరణ జరుగుతుంది. అయితే ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులిచ్చిన సందర్భంలో బాధ్యత మార్పుతో సంబంధం లేకుండగనే ఈ నిబంధనల ప్రకారము వేతన స్థిరీకరణ చేయబడుతుంది. సెలక్షన్ గ్రేడు, 6/12/18/24 సంవత్సరముల స్కేల్సు, రివైజ్డ్ పే స్కేల్సు, మొ||వానియందు ఆ విధంగానే వేతన స్థిరీకరణ చేయబడుచున్నది. అట్లే ఉద్యోగి యొక్క సర్వీసును బట్టి ఇంక్రిమెంట్లు మంజూరు చేయబడతాయి. వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు, ప్రీపోన్మెంటు, పోస్టు పోన్మెంటు మొదలుగునవి ఫండమెంటల్ రూల్పు 24, 26, 27ననుసరించి చేయబడతాయి
  • ఒక ఉద్యోగి శాశ్వత ప్రాతిపదికపై నియమింపబడి, ప్రొబేషన్ డిక్లేర్ చేయబడిన పోస్టును "సబ్ స్టాన్టివ్  పోస్టు" అంటారు. స్పెషల్ పే, పర్సనల్ పే తప్ప ఫండమెంటల్ రూల్స్ లో నిర్వచించిన అన్ని రకాల జీతమును సబ్ స్టాంటివ్ పే అంటారు. సబ్ స్టాన్టివ్ ప్రాతిపదికపై జరిగే నియామ కాల్లో 22వ రూలు ప్రకారం అఫీషియేటింగ్ నియామకాల్లో 31, 32 రూల్సు ప్రకారం పేఫిక్సేషన్ చేస్తారు.
  • ప్రమోషన్సందర్భంగా సాధారణ ఇంక్రిమెంటు యిచ్చే విధానం 26వ రూలు ప్రకారం యిస్తారుతాను పొందుతున్న స్కేలు కంటే తన కోర్కెపై తక్కువ స్కేలు తీసుకొంటున్న సందర్భంలో 35వ నిబంధన ప్రకారం ఫిక్సేషన్ చేస్తారు.

FR 22(a)(i), F.R.22(a) (ii) Promotion Pay Fixation in Telugu


F.R.22(a) (i) : అదనపు బాధ్యతలతో కూడిన పోస్టునందు నియమించబడినప్పుడు, నూతన స్కేలు నందలి 'తదుపరి పై స్టేజి' వద్ద వేతన స్థిరీకరణ జరుగును. అనగా కొత్త పోస్టు అదనపు బాధ్యతలతో కూడినదై నపుడు కొత్త స్కేలులో పై స్టేజిలో ఫిక్సేషన్ చేస్తారు. అట్టి వేతన స్థిరీకరణ జరిగిన తేదీ నుండి 12 నెలల సర్వీసు నిండిన పిదప ఇంక్రిమెంటు ఇవ్వబడుతుంది.
  • ఉదా : 21,230-63,010 స్కేలులో రూ. 25,840/- వేతనము తీసుకొనే ఉద్యోగి 28,940-78,910 స్కేలు గల పోస్టులో నియమించబడినప్పుడు అతని వేతనము రూ. 28,940గా స్థిరీకరించ బడుతుంది.

F.R.22(a) (ii) : అదనపు బాధ్యతలు లేని పోస్టునందు నియమించబడినప్పుడు, నూతన స్కేలు నందలి “దిగువస్టేజి' వద్దనే వేతన స్థిరీకరణ జరుగుతుంది. అనగా అదనపు బాధ్యతలు లేని పే స్కేలులోనికి ప్రమోషన్ చేయబడినపుడు పై స్కేలులో తాను పొందుతున్న "పే”కు సమానమైన స్టేజి లేనిచో క్రింది స్టేజిలో పే ఫిక్సేషన్ చేసి తేడాను పర్సనల్ పేగా వుంచెదరు. మాస్టరు స్కేళ్ళు అమలులోకి వచ్చిన తరువాత వేతన స్కేళ్ళలో సమాన స్టేజి ఉంటుంది. అందుచేత క్రింది స్టేజిలో వేతన స్థిరీకరణ అనే సమస్య ఉదయించదు. ప్రమోషన్ పోస్టులోని కనీస వేతనం సబ్ ప్లానిటివ్ పోస్టులో పొందుతున్న వేతనం కంటే హెచ్చుగా వున్నచో ఉద్యోగికి ప్రమోషన్ పోస్టులో కనీసం వేతనం నిర్ణయిస్తారు.
వివరణ: -
ఎ) ఒకవేళ పాత స్కేలులోని మూల వేతనమునకు సరిసమానమైన స్టేజి నూతన స్కేలులో వున్నచోఅట్టి 'సమాన స్టేజి' వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. పాత ఇంక్రిమెంటు తేదీ కొనసాగుతుంది.
  • ఉదా: 21,230-63,010 స్కేలులో రూ. 30,580/-లు వేతనం పొందుతున్న ఉద్యోగి 28, 940-78,910 స్నేలులో నియమించబడినప్పుడు అతని వేతనము రూ. 30,580ల వద్దనే స్థిరీకరించబడుతుంది.
బి) ఒకవేళ పాత స్కేలులోని మూలవేతనమునకు సమానమైన స్టేజి లేనిచో దిగువ స్టేజి వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. వేతన వ్యత్యాసము 'పర్సనల్ పే'గా నమోదు చేయబడుతుంది. పాత ఇంక్రిమెంటు తేదీ కొనసాగుతుంది. (93, 99,05, 10, 15 స్కేళ్ళలో అన్నీ సమాన స్టేజీలే వుంటాయి.

సి) పాత స్కేలులోని మూలవేతనము నూతన స్కేలు యొక్క మినిమం కంటే తక్కువగా నున్నప్పుడు అట్టి మినిమం వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. సంవత్సరం సర్వీసు తదుపరి మాత్రమే ఇంక్రిమెంటు ఇవ్వబడుతుంది.
  • ఉదా : రూ. 21,230-63,010 స్కేలులో రూ. 25,840/-లు పొందుచున్నచో, 28,940-78,910 స్కేలులో రూ. 28,940/- వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది.

F.R.22(a) (iv) : ఉద్యోగి పబ్లిక్ సర్వీస్ కమీషన్ చే ఎంపిక చేయబడిన మరొక పోస్టులో నేరుగా నియమించబడినప్పుడు పాత పోస్టులోని వేతనమునకు తక్కువ కాకుండా క్రొత్త పోస్టులోని వేతనము స్థిరీకరించబడుతుంది.

F.R.22 B: నిబంధన ననుసరించి వేతన స్థిరీకరణ రెండు విధములుగాచేయవచ్చును. వాస్తవ ప్రమోషన్ తేదీనాడైనను లేక ప్రమోషన్ పొందిన పిదప క్రింది పోస్టులోని తదుపరి ఇంక్రిమెంటుతేదీనాడైనను వేతన స్థిరీకరణ చేయవచ్చును. జిఓ.ఎంఎస్.నం. 145, తేది. 19.05.2009 ప్రకారము ఉద్యోగి ఎటువంటి ఆప్షన్ ఇవ్వకుండగనే ఉద్యోగికి ప్రయోజనకరమైన విధముగా ప్రమోషన్ తేదీ లేక తదుపరి ఇంక్రిమెంటు తేదీలలో దేనికైననూ వేతన నిర్ణయం చేయవలెను.
  • ఉదా : 21,230-63,010 స్కేలులో రూ. 28,120/-లు వేతనం పొందుతూ పదోన్నతి పొందినచో పదోన్నతి పొందిన రోజున వేతనం రూ. 28,940/-లుగా ఎస్ఆర్ 223(1) ప్రకారం నిర్ణయించి తదుపరి ఇంక్రిమెంటు తేదీ నాటికి ఒక నోషనల్ ఇంక్రిమెంటు రూ. 820/-లు కలిపి వేతనాన్నిరూ. 28,940-78,910 స్కేలులో తదుపరి స్టేజి వద్ద అనగా రూ. 30,580/-లుగా వేతన స్థిరీకరణ జరుగుతుంది.

FR 31 (2): నిబంధన ఎస్ఆర్ 22కు అనుబంధమైనది. దీని ప్రకారం సబ్ స్టాంటివ్ (క్రింది) పోస్టులో కొనసాగివుంటే ఇంక్రిమెంటు మంజూరు వలన గాని లేక ఇతర మంజూరుల వలనగాని ఆ స్కేలులోని వేతనము పెరిగినచో, అట్టి పెరుగుదల తేదీన అఫిషియేటింగ్ (పై) స్కేలులోని అతని వేతనము తదుపరి పై స్టేజి వద్ద పునస్థిరీకరణ చేయబడుతుంది. లాభకరమైనప్పుడు)
  • ఉదా : 21,230-63,010 స్కేలులో రూ. 30,580/-లు పొందుచున్న ఉద్యోగి వేతనము 28,940-78,910 స్కేలులో రూ. 31,460/-ల వద్ద స్థిరీకరణ జరుగుతుంది. అయితే పాత స్కేలులోని ఇంక్రిమెంటు వలన వేతనము రూ. 31,460/-లుగా పెరుగుతుంది. కనుక సదరు ఇంక్రిమెంటు తేదీన క్రొత్త స్కేలులో అతని వేతనము 32,340/- వద్ద పున:స్థిరీకరణ చేయబడుతుంది.

ఇంక్రిమెంటు మంజూరు F. R. 26:  నిబంధన ననుసరించి వార్షిక ఇంక్రిమెంటు మంజూరు చేయబడును. వార్షిక ఇంక్రిమెంటుమంజూరుకు - ఒక పోస్టులోని డ్యూటీ కాలము, జీత నష్టములేని సెలవు కాలము, ఫారిన్ సర్వీసు కాలము, జాయినింగ్ కాలము మొదలగునవి లెక్కించబడతాయి. అనారోగ్య కారణముపైగాని, ఉన్నత శాస్త్ర, సాంకేతిక విద్యనసభ్యసించు కారణముపైగాని పెట్టిన జీతనష్టపుసెలవు 6 నెలల కాలపరిమితికి లోబడి ఇంక్రిమెంటుకు పరిగణించబడుతుంది. అందుకుగాను సంబంధిత శాఖాధిపతి అనుమతిని పొందవలసి వుంటుంది. శిక్షా చర్యగా సస్పెండు చేయబడిన కాలము ఇంక్రిమెంటుకు లెక్కించబడదు. ప్రమోషన్సందర్భంగా సాధారణ ఇంక్రిమెంటు యిచ్చే విధానం 26వ రూలు ప్రకారం యిస్తారు


ప్రీపోన్మెంట్:  FR 27: నిబంధన ననుసరించి జూనియర్‌ కంటే సీనియర్ తక్కువ వేతనము పొందుచున్న సందర్భములో- ప్రీమెచ్యూర్ ఇంక్రిమెంట్ (ప్రీపోన్మెంట్) మంజూరు చేయబడుతుంది. ఒక పోస్టును మంజూరుచేయు అధికారియే అట్టి ఇంక్రిమెంటును మంజూరు చేయు అధికారము గలిగి యుండును. అయితే ప్రభుత్వపు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా సదరు అధికారము దఖలు పరచబడిన సందర్భములో సంబంధిత క్రింది అధికారులు కూడా అట్టి ఇంక్రిమెంటును మంజూరు చేయవచ్చును.
ప్రీపోన్మెంట్ తోపాటు స్టెప్పింగ్ అప్ కూడా యీ నిబంధన క్రిందే చేయబడుతుంది.


F R 24 : నిబంధన అనుసరించి దుష్ప్రవర్తన గల లేక అసంతృప్తికరమైన విధముగా విధులను నిర్వహించుచున్నట్టి ఉద్యోగిపై శిక్షా చర్యగా ఇంక్రిమెంటును కొంత కాలము నిలుపు చేయవచ్చును. ఇంక్రిమెంటు మంజూరు చేయు అధికారియే అట్టి నిలుపుదల చేయవచ్చును. ఈ నిలుపుదల రెండు విధములు - 
  • 1. క్యుములేటివ్ ఎఫెక్టుతో - అనగా ప్రతి సంవత్సరము నిర్ణీత కాలము వాయిదా పడుతుంది.
  • 2. క్యుములేటివ్ ఎఫెక్టు లేకుండా - అనగా ఆ ఒక్క సంవత్సరమునకు మాత్రమే నిర్ణీత కాలము వాయిదా పడుతుంది.