6-9th Classes Bridge Course Video Lessons Schedule and Instructions .video classes are going to be telecasted from 10-06-2020 through Doordarshan (Saptagiri Channel) daily few hours from 02.00 p.m to 03.00 p.m for classes 6 & 7, and from 03.00 p.m to 04.00 pm for classes 8 and 9 on all days. Detailed Day Wise Schedule for 6-9th Classes Bridge Course Video Lessons and Instructions are given below.
6-9th Classes Bridge Course Video Lessons Schedule and Instructions
ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు ప్రాథమికోన్నత పాఠశాలలలో ప్రాథమికోన్నత (6-8)తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయుల పాత్ర:- అనుబంధం - 2 లో పేర్కొనబడిన టీవీ పాఠాల ప్రణాళికకు సంబంధించిన సమాచారాన్ని తల్లిదండ్రులకు, విద్యార్థులకు మరియు తల్లిదండ్రుల కమిటీలకు తెలియచేయాలి .
- ఆరు, ఏడు తరగతులు బోధించే అందరు ఉపాధ్యాయులు టీవీ పాఠాల్లో విద్యార్థులకొచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు 17.06.2020 నుండి ప్రతి బుధవారం పాఠశాలకు హాజరు కావాలి.
- ఆరు, ఏడు తరగతులు చదువుతున్న విద్యార్థులందరుకు ఈ అవకాశాన్నివినియోగించుకుని సందేహాలు నివృత్తి చేసుకోవాలన్న సమాచారాన్ని తెలియచేయాలి
- ఎనిమిది, తొమ్మిది తరగతులు బోధించే అందరు ఉపాధ్యాయులు టీవీ పాఠాల్లో విద్యార్థులకొచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు 19.06.2020 నుండి ప్రతి శుక్రవారం ఈ అవకాశాన్ని ఎనిమిది, తొమ్మిది తరగతుల విద్యార్థులు సందేహా నివృత్తి కొరకు ఉపయోగించుకునేలా సమాచారం ఇవ్వాలి.
- పదో తరగతి బోధించే ఉపాధ్యాయులు ప్రతి బుధవారం, శుక్రవారం పాఠశాలకు హాజరవుతారని ఆ సమయంలో విద్యార్థులు సందేహ నివృత్తి చేసుకోవాలన్న సమాచారాన్ని పదవ తరగతి విద్యార్థులకు తెలియచేయాలి.
- ఈ ఆదేశాలు ప్రతి పాఠశాలలో సంబంధిత రోజులలో స్ఫూర్తివంతంగా అమలు చేయడానికి తగిన చర్యలను అందరు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చేపట్టాలి
సాధారణ సూచనలు:
- పాఠ్యాంశాలను చక్కని అవకాశంగా సద్వినియోగపరచుకోవాలి.
- ఉపాధ్యాయులందరూ వారి హాజరును మాన్యువల్ గా నమోదు చేయవలెను.
- ఉపాధ్యాయుల కొరకు నిర్వహించే వెబినార్లు పాఠశాల సమయం తర్వాత వీక్షించాలి.
- టివీ లు మరియే ఇతర డిజిటల్ సాధనాలు అందుబాటులో లేని విద్యార్ధులకు వారు వారానికి ఒకసారి పాఠశాలకు వచ్చినప్పుడు ఆ వారానికి సంబందించిన పాఠ్యాంశాలను ఉపాధ్యాయులు వారికి వివరించి చెప్పవలెను. విద్యార్ధులు వారి వర్క్ షీట్స్ ను వారి యొక్క తల్లి / తండ్రి / సంరక్షకుడు ద్వారా గాని, వారే స్వయంగాగాని పాఠశాలకు ఉపాధ్యాయుడు హాజరైన రోజు నాడు వచ్చి ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం పొందవలెను. వీడియో తరగతుల ద్వారా విద్యార్ధులకు ఇవ్వబడిన వర్కుషీట్స్ ను వారు సరిగా చేస్తున్నారో లేదో ఉపాధ్యాయులు విధిగా పరిశీలించాలి.
- ఉపాధ్యాయులు సరిచేసిన వర్కుషీట్లను రికార్డుల రూపంలో తదుపరి తనిఖీ కొరకు నిర్వహించాలి.
- విద్యార్థులు లేదా తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ద్వారా తీసుకొచ్చిన వర్కుషీట్లను ఉపాధ్యాయులు మూల్యంకనం చేయాలి.