AP SSC 10th Exams Cancelled - Press Note - AP Govt postponed the SSC/10th Exams

AP SSC 10th Exams Cancelled - Press Note - AP Govt postponed the SSC/10th Exams. AP Govt has announced that the SSC Exams going to be held in July have been cancelled.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ, పత్రికా ప్రకటన తేది 20.6.2020
2019-20వ సంవత్సరానికి పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం.

AP SSC 10th Exams Cancelled - Press Note - AP Govt postponed the SSC/10th Exams

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019-20 విద్యాసంవత్సరానికిగానూ జూలై 10 నుంచి 17 దాకా జరపవలసిన పదో తరగతి పరీక్షలను రాష్ట్రంలో అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది

18.06.2020న గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి సమక్షంలో పాఠశాల విద్యాశాఖామాత్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారితోను, పాఠశాల విద్యా శాఖ మరియు ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారులతోనూ జరిగిన సమావేశంలో సమగ్రంగా చర్చించిన తర్వాత పరీక్షల నిర్వహణ కష్టనష్టాలను జాగ్రత్తగా అంచనా వేశాక, విద్యార్థులు ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది

పదోతరగతి పరీక్షలను తప్పనిసరిగా జరపాలనే కృతనిశ్చయంతో పాఠశాల విద్యాశాఖ ఎన్నో ముందస్తు ఏర్పాట్లు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే పదో తరగతి విద్యార్థులకు గత రెండు నెలల నుండి కరోనా రోజుల్లో సప్తగిరి ఛానెల్ ద్వారా విద్యామృతం మరియు ఆకాశవాణి ద్వారా విద్యా కలశం' అనే పేరుతో పరీక్షలకు సన్నద్ధం చేయడం జరిగింది,

పదోతరగతి పరీక్షలను 11 పేపర్ల నుంచి 6 పేపర్లకు తగ్గించడంతో పాటు, సెంటర్లను పెంచడం, అదనపు సిబ్బంది నియామకం, కోవిడ్ నివారణ చర్యలు, భౌతిక దూరం వంటి ఎన్నో చర్యలు చేపట్టింది

15.6.2020 గౌరవ విద్యా శాఖామాత్యులు జిల్లా అధికారులతోనూ, ఉపాధ్యాయ సంఘాలతోను, తల్లిదండ్రుల సంఘాలతోను జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో చాలామంది తల్లిదండ్రులు పదోతరగతి పరీక్షల సందర్భంగా కరోనా పరిస్థితుల దృష్ట్యా పిల్లల ఆరోగ్య భద్రత గురించి తమ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పరీక్ష కేంద్రాల్లో ప్రభుత్వం ఎంత పకడ్బందీగా ఏర్పాట్లు చేసినప్పటికీ పరీక్షలకు వెళ్లిన సమయంలోనూ, తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో విద్యార్థులు భౌతిక దూరం పాటించడం కష్టమవుతుందనీ, దానివల్ల కరోనా సోకి వ్యాప్తి చెందే అవకాశం ఉందని వాళ్లు పేర్కొన్నారు


ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్రంలో రోజురోజుకు కేసులు పెరుగుతున్న దృష్ట్యా జూలై నాటికి మరిన్ని కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని వివిధ సర్వేలు సూచిస్తున్న దృష్ట్యా కంటైన్మెంట్ బోన్లు పెరుగుతుండటంతో పరీక్షల నిర్వహణ మరింత కష్టతరంగా ఉంటుందని గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాక రాము అత్యంత పద్ధతిలో, బాధ్యతతో పరీక్షల నిర్వహణ చేయగలిగినప్పటికి పాఠశాల పరిసరాల్లో శానిటైజేషన్, ఇతర కోవిడ్ నివారణ చర్యలు పూర్తిగా తాను ఆధీనంలో లేనందువలన తమ పూర్తి సంసిద్ధతను వ్యక్తం చేయలేమని చెప్పారు. ఇదికాక పత్రిక నిర్వహణకు పెద్ద ఎత్తున మాస్కులు, శానిటైజర్లు తదితర నివారణ సామగ్రి కూడా సమకూర్చవలసి ఉంటుందని వివరించారు

ఇప్పటికే చాలా పాఠశాలలు క్వారంటైన్ కేంద్రాలుగా పనిచేస్తుండటం వల్ల బాటిల్ పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని తెలియపరిచారు. చాలాచోట్ల అంతర జిల్లా జిల్లా స్థాయి రవాణా సౌకర్యాలు పూర్తిగా పునరుద్ధరింపబడని వల్ల దూరప్రాంతానికి చెందిన విద్యార్థులు పరీక్షలకు హాజరుకావడం, అలాగే హాస్టళ్లు, గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాస్టళ్లకు, గురుకుల పాఠశాలకు చేరుకోవడం కూడా కష్టమని తెలియజేశారు

కేవలం పదో తరగతి విద్యార్థుల కోసమే హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు తెరిచినప్పటికీ విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించడం, భోజనం తినే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం సవాళ్లుగా మారుతాయని తెలియపరిచారు

పై అంశాలన్నీ జాగరూకతతో పరిశీలించిన తర్వాత, పాఠశాల విద్యా శాఖామాత్యులు, పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియేట్ విద్యాశాఖ అధికారులు గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.

కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, రానున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పిల్లల ఆరోగ్య భద్రత ప్రధానమని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు భావించారు.

ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను ఉత్తీర్ణత చేసేలా నిర్ణయం తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పదో తరగతి పరీక్షలు రద్దు చేసి, పరీక్షలకు హాల్ టికెట్ల పొందిన విద్యార్థులు ఉత్తీర్ణత చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించారు.


ముఖ్యంగా కరోనా నేపథ్యంలో ఏ ఒక్క తల్లి కూడా తన బిడ్డ ఆరోగ్యం గురించి ఆందోళన చెందనవసరం లేకుండా విద్యార్థులందరినీ పరీక్షలు నిమిత్తం లేకుండానే ఉత్తీర్ణతలు చేయాలని ఆదేశించారు. అయితే కొన్ని ఉన్నత విద్యావకాశాలకు విద్యార్థుల మార్కులు, గ్రేడింగ్ అవసరమైన దృష్ట్యా విద్యార్థులు ఉత్తీర్ణత తో పాటు గ్రేడింగ్ కూడా ఇవ్వడానికి తగిన విధి విధానాలను రూపొందించవలసిందిగా పాఠశాల విద్యాశాఖ అధికారులను ఆదేశించడమైనది.

అలాగే, ఇంటర్మీడియేట్ మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్షలలో ఫెయిలైన విద్యార్థులు కూడా సప్లిమెంటరీ పరీక్షలు లేకుండా ఉత్తీర్ణత చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.