SHOE Measurements for Students 2020 Instructions - File 16021. Govt has taken a decision distribute Shoes to All Students Studying in Government Schools in AP. File No.SS-16021/31/2020-MIS SEC-SSA ఆర్.సి.నెం. ఎస్.ఎస్ 16021/4/2019 ఎం.ఐ.ఎస్. ఎస్.ఇ.సి.-ఎస్ఎస్ఏ తేది: 01/06/2020
విషయం: సమగ్ర శిక్షా - జగనన్న విద్యా కానుక' విద్యార్థులకు కిట్ల పంపిణీలో భాగంగా బూట్ల పంపిణీ కొరకు విద్యార్థుల పాదాల కొలతలను సేకరించి నమోదు చేయుట గురించి.
నమోదు ఇలా
విషయం: సమగ్ర శిక్షా - జగనన్న విద్యా కానుక' విద్యార్థులకు కిట్ల పంపిణీలో భాగంగా బూట్ల పంపిణీ కొరకు విద్యార్థుల పాదాల కొలతలను సేకరించి నమోదు చేయుట గురించి.
SHOE Measurements for Students 2020 Instructions - File 16021
నిర్దేశములు:- 1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్షా: ఆర్.సి.నెం. ఎస్.ఎస్ 16021/4/2019 ఎం.ఐ.ఎస్. ఎస్.ఇ.సి.-ఎస్ఎస్ఏ తేది : 18.03.2020 ఆదేశములు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2020- 21 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ యాజమాన్య పాఠశాల్లోని ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతోన్న అందరు విద్యార్థులకు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో జగనన్న విద్యా కానుక' పేరుతో స్టూడెంట్ కిట్లను సరఫరా చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
- 2. ఇందులో భాగంగా ఒక్కో స్టూడెంట్ కిట్లో మూడు జతల యూనిఫాంలు, ఒక సెట్ నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగు ఉంటాయి.
- 3. ప్రతి విద్యార్థికి బూట్లు పంపిణీ చేసే ప్రక్రియలో భాగంగా గత సంవత్సరంలో జరిగిన బూట్ల సరఫరాలో ఎదురైన ముఖ్య సమస్య 'బూట్ల సైజు సరిగా ఉండకపోవడం', తద్వారా కొందరు విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు.
- 4. ఈ సమస్యను అధిగమించడానికి విద్యార్థుల నుంచి స్వయంగా పాదకొలతలు తీసుకోవడానికి ఈ కింది సూచనలు పొందుపరచడమైనది.
బూట్ల సరఫరా కోసం విద్యార్థుల పాద కొలతలు నమోదులో పాటించాల్సిన సూచనలు
- రాష్ట్రంలోని విద్యా, సంక్షేమ శాఖలకు చెందిన ప్రభుత్వ/ మండల పరిషత్ / జిల్లా పరిషత్, మున్సిపల్ కేజీబీవీ, మోడల్ స్కూల్స్/ ఆశ్రమ, రెసిడెన్షియల్/ ఎయిడెడ్ పాఠశాల్లో ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న అమ్మాయిల, అబ్బాయిల పాదాల కొలతలను తీసుకోవాలి.
- ఇందుకోసం ప్రధానోపాధ్యాయులు/ తరగతి ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, పార్ట్ టైమ్ ఇనస్ట్రక్టర్లు, స్థానికంగా ఉన్న సిబ్బంది బాధ్యత తీసుకోవాలి.
- ఈ బాధ్యత నిర్వహించినందుకు సంబంధిత ఉపాధ్యాయునికి తగిన పారితోషికం ఇవ్వబడుతుంది.
- ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల వివరాలు అవసరం లేదు.
- విద్యార్థుల పాదాల కొలతలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేయుట.
- ఈ బాధ్యతను సీఆర్పీలకు అప్పగించడమైనది.
ముఖ్యంగా చేయవలసినవి
- విద్యార్థులపాదాల కొలతలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవలసిన అంశము.. తర్వాతి సంవత్సరానికి అనుగుణంగా (వారి పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని) పాదాల కొలత సైజును పెంచి తీసుకోవాలి.
- (:: ఉదాహరణకు ఒక విద్యార్థి పాదం ప్రస్తుత సైజు 5 ఇంచీలు ఉంటే కాస్త పెంచి 6 ఇంచీలు సైజుగా నమోదు చేయాలి.)
- ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి తమ పాఠశాల విద్యార్థులను 8.6.2020 మరియు 9.6.2020 తేదీల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాఠశాలకు రప్పించాలి.
- విద్యార్థుల పాదాల కొలతలు తీసుకునేటప్పుడు కోవిడ్- 19 ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా ఆచరిస్తూ భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, శానిటైజర్, హేండ్ వాష్ వంటివి తప్పక వినియోగించి తగు జాగ్రత్తలు వహించాలి. శానిటైజర్ వంటి వాటి కోసం పాఠశాల కాంపోజిట్ నిధులను వినియోగించుకోవాలి.
- పాఠశాలకు రాలేని, పాఠశాలకు దూరంగా ఉన్న విద్యార్ధుల, కేజీబీవీ/ మోడల్ స్కూల్స్/ ఆశ్రమ, రెసిడెన్షియల్ తదితర హాస్టల్లో చదివే బాలబాలికల పాదాల కొలతలు తీసుకోవడానికి జగనన్న గోరుముద్ద పథకం (మధ్యాహ్నభోజనం)లో భాగంగా విద్యార్థులకు డైరేషన్ (బియ్యం, చిక్కీ, గుడ్లు) అందిస్తున్న వాలంటీర్ల సాయం తీసుకొని, ఆ విద్యార్థుల పాదాల కొలతలు తీసుకునేలా సీఆర్పీలు చర్యలు తీసుకోవాలి.
విద్యార్ధుల పాదాల కొలతలన్నీ హెచ్ఎం లాగిన్లలో పొందుపరచాలి.
హెచ్ఎం లాగిన్ ఓపెన్ చేయగానే పాఠశాల, విద్యార్థుల పేర్లు, తదితర వివరాలు ఉంటాయి.- 2.54 సెంటీమీటర్లు = 1 ఇంచ్
- 5.08 సెంటీమీటర్లు = 2 ఇంచీలు
- 7.62 సెంటీమీటర్లు = 3 ఇంచీలు
- 10.16 సెంటీమీటర్లు = 4 ఇంచీలు
- 12.7 సెంటీమీటర్లు = 5 ఇంచీలు
- 15.24 సెంటీమీటర్లు = 6 ఇంచీలు
- 17.78 సెంటీమీటర్లు = 7 ఇంచీలు
- 20.32 సెంటీమీటర్లు = 8 ఇంచీలు
- 22.86 సెంటీమీటర్లు = 9 ఇంచీలు
- 125.4 సెంటీమీటర్లు = 10 ఇంచీలు
పాదాల కొలత తీసుకోవడం
- స్థానికంగా ఉన్న ఫుట్‌వేర్ దుకాణాల్లో 'పాదాల కొలత సాధనం' తీసుకొచ్చి పాదాల కొలత తీసుకోవడం.
- లేనిపక్షంలో ఒక అట్ట మీద స్కేలు/ టేపుతో కొలతలు గీసి జాగ్రత్తగా నమోదు చేయాలి.
- హెచ్ఎం లాగిన్లలో పొందుపరిచినటువంటి స్కీలో 10.6.2020 లోగా నమోదు చేయాలి.
- ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో తరగతి ఉపాధ్యాయులు పర్యవేక్షించాలి.
- ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమం సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి.
- ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీన్లో హెడ్మాష్టరు లాగిన్ ద్వారా కొలతలు నమోదు చేయాలి
- ప్రధానోపాధ్యాయులు/ సీఆర్పీలు ఈ కార్యక్రమాన్ని కచ్చితంగా జరిగేలా బాధ్యత వహించాలి.