Pustaka Nestam - Library Books in Schools - Instructions to HMS MEOs

Pustaka Nestam - Library Books in Schools - Instructions to HMS MEOs  File No.SS-15024/79/2020-SAMO-SSA మెమో. నెం. SS-15024/79/2020-SAMO-SSA - విషయం : సమగ్ర శిక్షా - పాఠశాల గ్రంథాలయ నిర్వహణ- 'పుస్తక నేస్తం' కార్యక్రమం అమలు - ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు - సూచనలు – జారీ.

Pustaka Nestam - Library Books in Schools - Instructions to HMS MEOs

ఆదేశాలు:
>
  • రాష్ట్రంలోని జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లకు, మండల విద్యాశాఖాధికారులకు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా:
  • 2. పాఠశాల గ్రంథాలయ నిర్వహణలో భాగంగా బాలసాహిత్యాన్ని పిల్లలకు అందించాలన్న ఉద్దేశంతో ప్రతి పాఠశాలకు సమగ్ర శిక్షా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి తరఫు నుంచి కథలు, సైన్సు, గణితం, విజ్ఞానం, బాలసాహిత్యం పుస్తకాలను పంపిణీ చేయనుంది.
  • 3. 2019 - 20 విద్యా సంవత్సరానికి గానూ 'భారతీయ భాషాధ్యయన కేంద్రం - మైసూరు వారి నుంచి ప్రస్తుతానికి 82 పుస్తకాలు ప్రతి పాఠశాలకు అందనున్నాయి. వాటిని విద్యార్థులతో చదివించి వారిలో పుస్తక పఠనాసక్తిని, మేధస్సును పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది.
  • 4. అయితే, కోవిడ్ - 19 మహమ్మారి సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తగు జాగ్రత్తలు పాటిస్తూ, పాఠశాల గ్రంథాలయ నిర్వహణలో భాగంగా 'పుస్తక నేస్తం' పేరిట సమగ్ర శిక్షా ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. పిల్లలకు బాలసాహిత్యాన్ని చదివించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు ఇస్తున్నాం.

ప్రధానోపాధ్యాయులకు సూచనలు

  • సమగ్ర శిక్షా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయం నుంచి ప్రతి పాఠశాలకూ పాఠశాల గ్రంథాలయ పుస్తకాలు అందుతాయి.
  • అందిన పుస్తకాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాబితా (కేటలాగు) తయారు చేసుకోవాలి. • వాటిని గ్రంథాలయ స్టాకు రిజిస్టరులో, కంప్యూటర్లో నమోదు చేసుకోవాలి.
  • పుస్తకాలు చించకుండా, మడత పెట్టకుండా జాగ్రత్తగా చదవమని పిల్లలకు చెప్పాలి.
  • పుస్తక పఠనంలో ప్రతి విద్యార్థిని, పాఠశాల తల్లిదండ్రుల కమిటీని భాగస్వామ్యం చేయాలి.
  • ఒక్కో విద్యార్థికి ఇచ్చిన పుస్తకాల జాబితాను తరగతి ఉపాధ్యాయులతో నమోదు చేయాలి.
ఉదాహరణకు:
వ.సం
పుస్తకం పేరు
పుస్తకం నంబరు
రచయిత
విద్యార్థి పేరు
తరగతి
ఇచ్చిన తేదీ
తిరిగి ఇచ్చిన తేదీ
విద్యార్ధి సంతకం

  • ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆ పుస్తకాలు అందే విధంగ చూడాలి,
  • పాఠశాల గ్రంథాలయం ఒక విజ్ఞాన భాండాగారం. విద్యార్థులకు పుస్తక పఠనం ద్వారా ఆసక్తిని,
  • అభిరుచిని పెంపొందింపజేయడం ద్వారా మేధస్సు పెరుగుతుందని పిల్లల్లో గ్రంథాలయ ఆవశ్యకతను వారి తల్లిదండ్రులకు తెలియజేయాలి.
  • ఎవరికి ఏ పుస్తకం ఇచ్చారో, తేదీ, తిరిగి తీసుకున్న తేది రాసుకోమని చెప్పాలి.
  • ప్రతి విద్యార్థికి పుస్తకం అందేలా తరగతి ఉపాధ్యాయుడు, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ బాధ్యత వహించాలి.

విద్యార్థుల భాగస్వామ్యం

  • కోవిడ్ - 19 మహమ్మారి దృష్ట్యా ప్రతి విద్యార్థి తమ తమ ఇళ్లకు పుస్తకాలు తీసుకెళ్లి చక్కగా చదివేలా
  • చేయాలి. 
  • అందులో కథ, నీతి, ఇతర విజ్ఞాన విషయాలు, బొమ్మలు వంటివి విద్యార్థులు గ్రహించాలి.
  • విద్యార్థి ఒక పుస్తకాన్ని పూర్తిగా చదివిన తర్వాత మరో విద్యార్థికి ఆ పుస్తకాన్ని ఇచ్చి ఎదుటి విద్యార్థి దగ్గర  పుస్తకాన్ని తీసుకోవాలి. 
  • ఆ విధంగా పాఠశాలలు తిరిగి తెరిచేదాకా విద్యార్ధులు తాము తీసుకున్న పుస్తకాలు తమలో తాము సర్కులేట్ చేసుకోవాలి.
  • పాఠశాలలు తిరిగి తెరిచిన తరువాత ఆ పుస్తకాలను బాధ్యతగా పాఠశాలకు అప్పగించాలి.