Jagananna Vidya Kanuka Kits Distribution Additional Guidelines as on 6th Oct Rc 151

Jagananna Vidya Kanuka Kits Distribution Latest Guidelines as on 6th Oct Rc 151 ఆర్.సి.నెం. 151// A&I/ 2020 తేది: 6-10-2020 Jagananna Vidya Kanuka Toll Free Numbers Helpline Numbers.
విషయం: 'జగనన్న విద్యా కానుక' విద్యార్థులకు కిట్లను క్షేత్ర స్థాయిలో పంపిణీ కొరకు - జిల్లా
విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లకు మార్గదర్శకాలు. 



Jagananna Vidya Kanuka Kits Distribution Additional Guidelines as on 6th Oct Rc 151

ఆదేశములు
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న 'జగనన్న విద్యా కానుక' కార్యక్రమం రేపు ప్రారంభం కాబోతుంది. ఈ పథకానికి సంబంధించి జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లకు, సీఎంవోలకు, జిల్లా సెక్టోరియల్ అధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు ఆదేశాలు.

ఇందులో ముఖ్యాంశాలు
  • 'జగనన్న విద్యా కానుక' కిట్ అందుకోవడానికి రోజుకు 50 మందికి మించకుండా! 50 మంది లోపు విద్యార్థులు వారి తల్లి/ సంరక్షకులతో సహా ఏదో ఒక రోజు పాఠశాలకు రావచ్చు.
  • ఉదాహరణకు: ఉదయం 25 మంది, మధ్యాహ్నం 25 మంది రావచ్చు. అంటే 9 నుండి 12 గంటల లోపు 25 మంది ఒక్కో తరగతికి 5 మంది చొప్పున లేదా కొన్ని తరగతులు ఉదయం, ఇంకొన్ని తరగతులు మధ్యాహ్నం పాల్గొనేలా ఆయా పాఠశాలలోని తరగతులు, విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రధానోపాధ్యాయుడు/ ఉపాధ్యాయ సిబ్బంది ప్రణాళికలు వేసుకోవాలి.
  • ఆయా పాఠశాల మొత్తం విద్యార్థుల సంఖ్యను బట్టి, పాఠశాల స్థలం బట్టి ప్రణాళిక వేసుకుని మెల్లగా కొన్ని రోజుల్లో 'స్టూడెంట్ కిట్స్' పంపిణీ పూర్తి చేయాలి.
  • గుంపులుగా కాకుండా విడివిడిగా, కొందరిని మాత్రమే అనుమతిస్తూ భౌతిక దూరం పాటిస్తూ , ప్రభుత్వ ఆదేశించిన / నిర్దేశించిన కోవిడ్ -19 నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని అమలు చేయాలి.www.apteachers.in
  • కిట్ అందుకున్న తల్లులతో బయో మెట్రిక్/ ఐరిష్ ద్వారా హాజరు వేయించాలి. ఆ సమయంలో ముందు వేలిని శానిటైజ్ చేసి, ఆరిన తర్వాత బయోమెట్రిక్ వేయించాలి.
  • బయోమెట్రిక్ విధానానికి సంబంధించిన 'యూజర్ మాన్యువల్' ఇప్పటికే అందరికీ ఇ-మెయిల్ ద్వారా పంపబడినది.
ముఖ్య గమనిక:
  • కిట్ లో ఆయా తరగతులకు చెందిన పలు రకాల అంశాలు (5 నుండి 7 వస్తువులు) ఉంటాయి.
  • వాటిలో బ్యాగు కానీ, షూ కానీ, బెలు, యూనిఫాం వంటి వాటిలో సరైన సైజు రాకపోయినా, డ్యామేజ్ కిట్ కు సంబంధించిన వస్తువులు ఏ పాఠశాలలోనైనా మరికొన్ని అవసరమైనా, మిగిలిపోయినా (ఎక్కువగా ఉన్నా) ఆ వివరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంబంధిత మండల విద్యాశాఖాధికారికి తెలియజేయాలి.మండల విద్యాశాఖాధికారులు జిల్లా అధికారులకు తెలియజేయాలి.www.apteachers.in
  • యూడైస్ కోడ్, చైల్డ్ ఇన్ఫోలో ఉన్న వివరాల ప్రకారం ప్రతి విద్యార్థికీ తప్పనిసరిగా అన్ని వస్తువులు అందజేయబడతాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు గురి కాకుండా ఈ విషయాన్ని తెలియపరచాలి.
  • జగనన్న విద్యాకానుక'కు సంబంధించిన హెల్ప్ లైన్ నంబర్లు 91212 96051, 91212 96052. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు పని దినాల్లో సంప్రదించవచ్చు.
'జగనన్న విద్యాకానుక' స్టూడెంట్ కిట్ ప్రతి విద్యార్థికి తప్పకుండా అందేలా సక్రమ చర్యలకు సిద్ధం కావాలని రాష్ట్రంలోని అందరూ జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్రశిక్షా అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు పూర్తి శ్రద్ధతో పై ఆదేశాలను అత్యంత జాగరూకతతో అమలు చేయవలసిందిగా ఇందుమూలంగా ఆదేశించడమైనది.