JVK Instructions on Change of Shoes Bags and Kits Rc No Spl/JVK/2020 Dated 16.11.2020 JVK - Change of shoes, bags and other things of kit - Instructions Proceedings Re.No.Spl/JVK/2020 Dated:16.11.2020. Rc No Spl/JVK/2020 Dated 16.11.2020 JVK Instructions on Change of Shoes Bags and Kits Problems and their Solutions in JVK Distribution
జిల్లా స్థాయి సెక్టోరియల్ అధికారులకు ఆయా జిల్లాల్లోని మండలాలను కేటాయించాలి.
మొత్తం సీఆర్పీలని ఈ కార్యక్రమంలో ఉపయోగించుకోవాలి
పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయులు, మండల స్థాయిలో మండల విద్యా శాఖాధికారి, జిల్లా స్థాయిలో జిల్లా విద్యా శాఖాధికారి ఈ ముగ్గురు పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని ఇతర అధికారులు మరియు సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పని పూర్తి చేయాలి.
- జగనన్న విద్యా కానుక- స్టూడెంట్ కిట్లులోని సైజులు సరిపోని బూట్లు, బ్యాగులు, ఇతర వస్తువులు మార్పు చేయడం కొరకు జిల్లా విద్యా శాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు మార్గదర్శకాలు జారీ
JVK Instructions on Change of Shoes Bags and Kits Rc No Spl/JVK/2020 Dated 16.11.2020
విషయం: పాఠశాల విద్యాశాఖ - జగనన్న విద్యా కానుక- స్టూడెంట్ కిట్లులోని సైజులు సరిపోని బూట్లు, బ్యాగులు, ఇతర వస్తువులు మార్పు చేయడం కొరకు జిల్లా విద్యా శాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు మార్గదర్శకాలు జారీ.
నేపథ్యం:
ఇటీవల ముఖ్యమంత్రి గారి కార్యాలయం అధికారులు నుంచి, పాఠశాల విద్యాశాఖ గారు, సమగ్ర శిక్షా రాష్ట్ర స్థాయి అధికారులు రాష్ట్రంలో పలు పాఠశాలలను తనిఖీ చేసి సమస్యలు గుర్తించారు
నేపథ్యం:
- జగనన్న విద్యాకానుక'లో భాగంగా బూట్లు పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలు:
- మొదటగా ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లల పాడాల కొలతలను తీసుకుని నమోదు చేశారు.
- ఆ కొలతల ఆధారంగా సమగ్ర శిక్షా నుంచి సప్లయిర్సుకు ఆర్డర్స్ ఇవ్వబడింది.
- అదే ఇండెంట్ (కావలసిన వస్తువుల పట్టిక) ఆధారంగా మండల స్థాయికి బూట్లను పంపిణీ చేయడం జరిగింది.
- మండల స్థాయి నుంచి పాఠశాల స్థాయి బూట్లను పంపిణీ చేయమని (ఆర్.సి.సెం.SS 16021/4/2020-MIS SEC-SSA తేది: 18.3.020) ద్వారా తెలియజేయడమైనది
- తర్వాత మిగిలిన లేదా సరిపోని బూట్లను మొదట ఆయా మండల స్థాయిలో తర్వాత జిల్లా స్థాయిలో మార్పిడి చేసుకోమని (ఆర్.సి.నెం.SS-16021/8/2020-MIS SEC-SSA తేది: 17.7.020) ద్వారా ఆదేశాలు ఇవ్వబడ్డాయి.www.apteachers.in
- పైన చెప్పిన విధంగా ముందు జాగ్రత్తతో పటలు సూచనలు చేసినప్పటికీ ఇప్పటికీ అన్ని పాఠశాలల్లో సమస్య తీవ్రంగా ఉన్న విషయం తెలిసింది.
- ఇప్పటికీ చాలా పాఠశాలలు కొంత సరుకు పిల్లలకు ఇవ్వలేదు. కానీ సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయానికి ఇచ్చిన రిపోర్టులో అన్ని ఇచ్చినట్లుగా తప్పుడు నివేదికలు పంపడం జరిగింది.
ఇటీవల ముఖ్యమంత్రి గారి కార్యాలయం అధికారులు నుంచి, పాఠశాల విద్యాశాఖ గారు, సమగ్ర శిక్షా రాష్ట్ర స్థాయి అధికారులు రాష్ట్రంలో పలు పాఠశాలలను తనిఖీ చేసి సమస్యలు గుర్తించారు
మొత్తం కార్యక్రమాన్ని ఒకసారి గమనిస్తే.
సైజులు తీసుకోవడం : విద్యార్థుల నుంచి సైజులు తీసుకోవడం, ఎయే పాఠశాలలలకు ఎన్ని బూట్లు అవసరమో తెలియజేయడం, (ఆర్ సి.నెం. SS-16021/8/2020-MIS SEC-SSA తేది: 30.5.020: 20.8..20)
నమస్య: చాలామంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సరిగా సైజులు తీసుకోలేదు. తప్పు సైజులు పంపించారు. పూర్తిస్థాయి పర్యవేక్షణ లోపం వల్ల సీఆర్పీలు ద్వారా / వాలంటీర్ల ద్వారా సైజులు తీసుకుని, అదే సైజులు ఆర్డర్ పెట్టారు
- సరుకు వచ్చిన తర్వాత మండల రిసోర్సు కేంద్రం నుంచి ముందుగా ఇండెంట్ పెట్టిన సరుకును పాఠశాల స్థాయికి తీసుకు వెళ్లాలని (ఆర్ .సి.నెం.SS-16021/4/2020-MIS SEC-SSA తేది: 14.8.020) ద్వారా ఆదేశాలు ఇవ్వబడినది.
- పిల్లలకు బూట్లు పంపిణీ చేసే క్రమంలో వారికి సైజులు సరిపోకపోయినా లేదా డ్యామేజ్ ఉన్నా వెంటనే వాపసు చేస్తే వారికి సరైన బూట్లు ఇవ్వమని (ఆర్ సి.నెం.55-16021/8/2020-MIS SEC-SSA ద్వారా ఆదేశించడం అయినది
- పిల్లలకు పంపిణీ చేసిన తర్వాత మిగిలిన సరుకును మండల రిసోర్సు కేంద్రానికి ఇవ్వమని (పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఆర్.సి.నం. 151/A&I/2020 తేది: 6.10.2020) ద్వారా ఆదేశాలు ఇవ్వబడినది
ప్రస్తుతం చేయవలసిన అత్యంత ముఖ్యమైన పనులు:
- స్టెప్ 1: పాఠశాల వారీగా ఇచ్చిన బూట్లలో అవసరమైవి, మిగిలినవి, డ్యామేజ్ ఉన్నవాటిని మండల రిసోర్సు కేంద్రానికి నవంబరు 18వ తేదీలోపు చేర్చాలి.
- స్టెప్ 2: ఇలా మండల రిసోర్సు కేంద్రానికి చేరిన బూట్లును తిరిగి అవసరం మేరకు పాఠశాలలలకు పున: పంపిణీ చేయాలి
- స్టెప్ 3 ఇంకనూ మండల రిసోర్సు కేంద్రాల్లో, మండల స్థాయిలో మిగిలిన బూట్లును తిరిగి జిల్లా స్థాయిలో అవసరమైన ఇతర అన్ని మండలాలకు పంపిణీ చేయాలి
- స్టెప్ 4: చివరిగా జిల్లా స్థాయి నుంచి ఆ జిల్లాలో ఇచ్చిన బూట్లు సరఫరా సంబంధించిన పూర్తి వివరాలు అంటే డ్యామేజ్ అయిన, మిగిలిన, ఇంకా అవసరమైన బూట్ల వివరాలను రాష్ట్ర కార్యాలయానికి పంపించాలి.
జిల్లా స్థాయి సెక్టోరియల్ అధికారులకు ఆయా జిల్లాల్లోని మండలాలను కేటాయించాలి.
మొత్తం సీఆర్పీలని ఈ కార్యక్రమంలో ఉపయోగించుకోవాలి
పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయులు, మండల స్థాయిలో మండల విద్యా శాఖాధికారి, జిల్లా స్థాయిలో జిల్లా విద్యా శాఖాధికారి ఈ ముగ్గురు పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని ఇతర అధికారులు మరియు సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పని పూర్తి చేయాలి.