Maternity Leave Rules in Detail already discussed in our one of the previous Post. Here the Maternity Leave Rules are discussed in detailed in Telugu - మహిళా ఉద్యోగుల 180 రోజుల మెటర్నిటీ లీవ్ (ప్రసూతి సెలవు ) AP FR 101 ప్రకారం ప్రతీ మహిళా ఉద్యోగినికి నిబంధనలకు లోబడి 180 రోజులకు ప్రసూతి సెలవు పొందుటకు అర్హత ఉంది G.O. Ms No. 152 Fin (FRI) Dept Dated 5.2.2010
Maternity Leave Rules in Telugu - మహిళా ఉద్యోగుల 180 రోజుల మెటర్నిటీ లీవ్ (ప్రసూతి సెలవు )
డిపార్టుమెంటులు వారీగా మెటర్నిసెలవులు వర్తింపు గురించి తెలుసుకుందాం- ఈ సెలవుల గురించి ప్రస్తావన AP Fundamental Rules లో రూల్ 101 లో కలదు.
- G.O. Ms No. 152 ఫైనాన్సు (FRI) డిపార్టుమెంటు తేది 5.2.2010 ద్వారా 2010 వేతన స్కేల్ ల ప్రకారం మెటర్నిటీ సెలవు ను ప్రతీ మహిళా ఉద్యోగినికి నిబంధనలకు లోబడి 180 రోజులకు పెంచడం జరిగింది.
- అలాగే AP Social Welfare Residential Educational Institutions APSWREI లో పని చేస్తున్న మహిళా ఉద్యోగునులు అందిఅర్కి ఈ సెలవు ను వర్తింప చేస్తూ GO Ms No 50 Social Welfare Department Dated 17.5.2014 న ఉత్తర్వులు జారీ చేసింది.
- అదే విధంగా GO Ms No 17 Finance Department Dated 31.1.2019 ద్వారా కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు కుడా ఈ సెలవులను వర్తింప చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు
- అలాగే గ్రామ వార్డ్ సచివాలయాలలో పని చేస్తున్న వార్డ్ సెక్రెటరీ లు అందరికి కూడా ఈ 180 రోజుల ప్రసూతి సెలవును వర్తింప చేస్తూ GO Ms No 4 Dated 25.9.2020 న GSWS Department ఉత్తర్వులు జారీ చేసింది.
ఐతే ఇప్పుడు ఈ ప్రసూతి సెలవు పొందుటకు నిబంధనలు గురించి తెలుసుకుందాం.
- వివాహిత అయిన ప్రతీ మహిళా ఉద్యోగి పెర్మనెంట్ అయిన , టెంపరరీ అయినా కాన్పుకు 2010 వేతన స్కేల్ ల ప్రకారం 180 రోజుల ప్రసూతి సెలవు కు అర్హులు
- GO.38 Finance and Planning Dated. 18-3-1992 ప్రకారం ఈ సెలవు సజీవంగా ఉన్న ఒక బిడ్డ కలవారికి మాత్రమే వర్తిస్తుంది. అంటే ఎన్నవ కాన్పు అన్న దానితో సంబంధం లేకుండా, అప్పటికి ఒక్క బిడ్డ మాత్రమె సజీవంగా ఉన్న సందర్భంలో వారు ప్రసూతి సెలవు పొందవచ్చు.
- ఐతే GO.37 Finance and Planning Department Dated 26-2-1996 ప్రకారం Maternity Leave is allowed irrespective of the number of children born in the second confinement అని ఉంది. అనగా ఈ ఉత్తర్వులు ప్రకారం రెండవ కాన్పులో కవలలు లేదా ఎంత మంది పుట్టినా వారు ఆ కాన్పుకు ప్రసూతి సెలవుకు అర్ధులు
ఇప్పుడు మనం ఈ ప్రసూతి సెలవు వినియోగం గురించి ఉన్న నిబంధనలు తెలుసుకుందాం
- ప్రసూతి సెలవు ఎప్పటినుండి ఇవ్వవచ్చు అన్న అంశంపై చాలామందికి అనుమానాలున్నాయి. ప్రసవం జరిగిన రోజు నుంచా, లేక అంతకు ముందు నుంచి ఉద్యోగిని అభ్యర్థన మేరకు ప్రసూతి సెలవులో వెళ్ళవచ్చా అను సంశయం చాలామంది కి రావటం సహజం.
- మెటర్నిటీ లీవ్ ఎప్పటి నుండి పెట్టుకోవాలి అన్న విషయం పై జీవో లలో ఎక్కడా స్పస్తమైన ప్రస్తావన లేదు.
- G.O.Ms.No. 38 Fin & Pig Dept. dt. 13-8-1992 ప్రకారం ఇద్దరి కంటె తక్కువ సంతతికల ఉద్యోగినుల Confinement కోసం ప్రసూతి సెలవు మంజూరు చేయవచ్చు అను నియమం వుంది.
- Confinement అను పదమునకు పదకోశం (Dictionary) ప్రకారం మంచానపడి (Bedridden) , నిర్బంధం (Detention) , ప్రసవం (Delivery) అను మూడు అర్ధాలున్నాయి. కాన్పుకోసం ఆసుపత్రిలో చేరినా, కాన్పుకు ముందు అనారోగ్య పీడితురాలైనా అట్టి తేది నుంచి ప్రసూతి సెలవు మంజూరు చేయుటకు అభ్యంతరం వుండకూడదు.
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు , ప్రసూతి సమయానికి ఆరు వారాల ముందు నుండే ప్రసూతి సెలవు పెట్టుకునే అవకాశం ఉంది..
- DSE L Dis No 1941/G2/90, Dated 11.6.1990 ప్రకారం మృత శిశువు ను ప్రసవించిన లేదా ప్రసవం అనంతరం శిశువు మరణించినా ప్రసూతి సెలవు ను వినియోగించు కోవచ్చు.
ఇప్పుడు ప్రసూతి సెలవు మరియు వాటిని ఇతర సెలవులతో కలిపి వినియోగం గురించి తెలుసుకుందాం
- Subsidiary Rule 2, FR 101(a) ప్రకారం,శిశువు లేదా తల్లి ఆరోగ్య పరిస్థితి ని బట్టి వైద్య దృవపత్రం ఆధారంగా, ఇతర సెలవులతో కలిపి ప్రసూతి సెలవుకు (ముందు లేదా వెనక ) కలిపి వాడుకోవచ్చు.
- FR 101 A (b) ప్రకారం ప్రసూతి సెలవు కాలాన్ని ఉద్యోగిని ఆర్జిత సెలవు , అర్ధ జీతం సెలవుల ఖాతా నుండి తగ్గించడానికి వీలు లేదు.
- GO.463 PRIMARY & SECONDARY EDUCATION (H) DEPARTMEN Dated 4.5.1979 & మేమో 18136/SE Dated 12.1.2005 ప్రకారం విద్యా శాఖ వంటి వేసవి సెలవులు ఉండే వెకేషన్ డిపార్టుమెంటు లలో వేసవి సెలవుల మధ్య లో ప్రసవిస్తే , ప్రసవ తేది నుండి 180 రోజులు ప్రసూతి శెలవులు వాడుకోవచ్చు. అయితే వేసవిసెలవుల మధ్యలో ఈ ప్రసూతి సెలవు 180 రోజులు సెలవు పూర్తీ అయితే, రీ ఓపెనింగ్ నాడు విధులలో చేరాలి.
- అదే విధంగా కొత్తగా జన్మించిన బిడ్డ అనారోగ్య స్థితి లో ఉన్న యెడల, వైద్య దృవపత్రం పై ఇతర సెలవులతో కలిపి వాడవచ్చు. G.O.Ms.No.2391, Fin., Dt.03.10.1960. అయితే ఇవి కేవలం వైద్య దృవపత్రం మీద మాత్రమే ఈ విధంగా ఇతర సెలవులతో కలిపి వినియోగించుకోవచ్చు అన్న విషయం గమనించాలి
- అప్రయత్న గర్భస్రావం జరిగిన యెడల 6 వారాలకు మించ కుండ అబార్షన్ సెలవు కు అర్హత ఉంటుంది. ఐతే ఈ సెలవు గురించి ఇంకో వీడియో లో పూర్తిగా తెలుసుకుందాం.
ప్రసూతి సెలవు లో– జీత భత్యాలు- ఇంక్రిమెంట్లు - తదితర
- Subsidiary Rule -1 FR 101 ప్రకారం ప్రసూతి సెలవులో ఉన్న వారికి పూర్తీ జీతం చెల్లించాలి
- AP Leave Rules 1933 పరిధిలో కి వచ్చే ఉద్యోగిని లు, Rule 10 - FR 44 ప్రకారం సెలవులో వెళ్ళే నాటికి వరకు పొందుతున్న అన్ని Compensatory భత్యాలు పొందవచ్చు
- Memo. No. 49643-A2/111-FR-II-74-1 Date: 6-10-1974 పాయింట్ 1 , మరియు Lr 853/FR-2/2012 Dated 22.01.2013 లో ఆర్దిక శాఖ ఇచ్చిన వివరణ ప్రకారం ప్రసూతి సెలవు మద్యలో ఇంక్రిమెంట్ వచ్చినా కూడా సెలవులో ఇంక్రిమెంట్ ఇవ్వబడదు. ప్రసూతి సెలవు పూర్తి అయిన తరువాత విధులలో చేరిన తేది నుండి మాత్రమె ఇంక్రిమెంట్ ఇవ్వబడుతుంది.
- అనగా ఉదాహరణకి అక్టోబర్ లో ప్రసూతి సెలవులో వెళ్ళిన ఉద్యోగి కి నవంబర్ లో ఇంక్రిమెంట్ ఉన్న యెడల అది ఆ నవంబర్ లో ఇవ్వరాదు. ఈ ఇంక్రిమెంట్ తేది మారనప్పటికి, ఆ సంవత్సరానికి మానిటరీ బెనిఫిట్ మాత్రం , ఈ ప్రసూతి సెలవు పూర్తి చేసుకొని తిరిగి విధులలో ఏ తేదిన చేరితే ఆ తేది నుండి ఆ సంవత్సర ఇంక్రిమెంట్ ఇవ్వాలి.
- అలాగే ప్రసూతి సెలవులో ఉన్న వారికి సెలవు మధ్యలో Automatic Advancement Scheme వచ్చినా, వారికి కూడా ఇంక్రిమెంట్ మంజూరు కు వర్తించిన రూల్స్ లేదా నిబంధనలే వర్తిస్తాయి.
- Rc 29/C3-4/2003 Dated 25.1.2003 CSE ప్రకారం ప్రసూతి సెలవు మధ్యలో ప్రమోషన్ పొందిన వారు, సెలవు పూర్తీ అయిన తరువాత ప్రమోషన్ పోస్ట్ లో చేరవచ్చు.
- అదే విధంగా ప్రసూతి సెలవులో ఉన్న వారు సెలవు మధ్యలో బదిలీ పొందిన యెడల వారు ప్రసూతి సెలవు పూర్తీ చేసుకున్న తరువాత కొత్త స్థానంలో విధులలో చేరవచ్చును
- అలాగే ప్రబెషన్ కాలంలో కూడా ప్రసూతి సెలవు పెట్టుకొన వచ్చును. అయితే ప్రోబేషన్ కాలలో ప్రసూతి సెలవు పై వెళ్ళినచో , AP State Subordinate Service Rules ప్రకారం ఆ లీవ్ కాలమునకు ప్రొబేషన్ పొడిగించబడుతుంది .
ప్రసూతి సెలవు – మంజూరు – దరఖాస్తు వివరాలు
- ఈ ప్రసూతి సెలవు మంజూరు అధికారం, DDO లకు దఖలు పరచబడింది.
- ఐతే GO MS No 84 Education Department Dated 17.9.2012 ద్వారా విద్యా శాఖ లో ఈ సెలవులు, మండల విద్యా శాఖ పరిధి అయితే MEO లు, ఉన్నత పాఠ శాల లు అయితే ప్రధాన ఉపాధ్యాయులు మంజూరు అధికారం ఇవ్వబడినది
- మహిళా ఉద్యోగిని , తమ DDO కు వ్రాత పూర్వక అప్లికేషను, తగిన ఆధారాలతో సమర్పించి ప్రసూతి సెలవు మంజూరు చేయించుకోవాలి.
- GO Ms No 219 Finance and Planning Dated 25.6.1984 ప్రకారం ఈ ప్రసూతి సెలవు దరఖాస్తు కు కనీసం RMP సర్టిఫికేట్ అయిన జతపరచాలి.
- Maternity leave అప్లై చేయడానికి ప్రత్యేకంగా ఫార్మాట్ ఏమి లేదు, ఎప్పుడు డెలివరీ అవుతారో / అయ్యారో అని డాక్టర్ దగ్గర సర్టిఫికెట్ తీసుకొని, 6 months మెటర్నిటీ లీవ్ కావాలని అప్లై చేయాలి.
- ఇది ఫస్ట్ ఇష్యూ లేదా సెకండ్ ఇష్యూ అని తెలియచేయాలి
- 180 రోజుల సెలవులు అనంతరం, ముందుగానే DDO కు సమాచారం ఇచ్చి , విధులలో చేరాలి