Neet Exams: Neet Exams on September 12th 2021 - NTA NEET Revised Schedule Released
NEET: నీట్ (యూజీ)-2021 కొత్త తేదీ ఇదే.. సెప్టెంబర్ 12 న దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు
భౌతికదూరం నిబంధనల మేరకు ఈ పరీక్ష నిర్వహించే పట్టణాల సంఖ్యను 155 నుంచి 198కి పెంచుతున్నట్టు వెల్లడించారు. అలాగే, గతేడాది 3862గా ఉన్న పరీక్షా కేంద్రాలను కూడా పెంచనున్నట్టు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులందరికీ మాస్క్‌లు అందజేయడంతో పాటు శానిటైజర్లు అందుబాటులో ఉంచనున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
తొలుత ఆగస్టు 1న నీట్ నిర్వహిస్తామని మార్చిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించిన విషయం తెలిసిందే. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు 11 భాషల్లో పెన్ అండ్ పేపర్ పద్ధతిలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. అయితే, కరోనా ఉద్ధృతి కారణంగా పలు పరీక్షలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. నీట్ పరీక్షను ఆగస్టులో నిర్వహిస్తామని చెప్పింది. ప్రస్తుతం కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్న వేళ సెప్టెంబర్ 12న పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది.
Neet Exams: Neet Exams on September 12th 2021 - NTA NEET Revised Schedule Released
దిల్లీ: నీట్ (యూజీ) 2021 పరీక్ష తేదీలో మార్పులు చోటుచేసుకున్నాయి. దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షను తొలుత ఆగస్టు 1 నిర్వహిస్తామని ప్రకటించిన కేంద్రం ఆ షెడ్యూల్‌లో మళ్లీ మార్పులు చేసింది. తాజాగా, సెప్టెంబర్ 12న ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం సాయంత్రం ప్రకటించారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి ఈ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం సాయంత్రం 5గంటల నుంచి ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో ప్రారంభమవుతుందని తెలిపారు.భౌతికదూరం నిబంధనల మేరకు ఈ పరీక్ష నిర్వహించే పట్టణాల సంఖ్యను 155 నుంచి 198కి పెంచుతున్నట్టు వెల్లడించారు. అలాగే, గతేడాది 3862గా ఉన్న పరీక్షా కేంద్రాలను కూడా పెంచనున్నట్టు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులందరికీ మాస్క్‌లు అందజేయడంతో పాటు శానిటైజర్లు అందుబాటులో ఉంచనున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.