Rationalisation in Nov December 2021 - Transfers in Jan 2022 - FAPTO
నవంబర్, డిసెంబర్ నెలలో రేషనలైజేషన్ .... జనవరి మొదటి వారంలో ఉపాధ్యాయ బదిలీలు ..
నవంబర్ 1న మిగిలిన ఖాళీలకు ప్రమోషన్ కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశం ❓*
*అంతర్ జిల్లా బదిలీలు త్వరలో ❓
*ఈ రోజు ఫ్యాప్టో పక్షాన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ గారితో చర్చించిన అంశాలు*
ప్రస్తుతం జరుగుతున్న ప్రమోషన్స్ లో హెచ్.ఎం. ఖాళీలు అనగా 1. 11 .20 నాటి ఖాళీలతోపాటు లెఫ్ట్ ఓవర్ వేకెన్సీలు కూడా చూపాలని కోరాము.. లీగల్ ఒపీనియన్ తీసుకుని లెఫ్ట్ ఓవర్ వేకెన్సీ లు చూపుతామని, నవంబర్ 1న మిగిలిన ఖాళీలకు ప్రమోషన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు*
ప్రమోషన్స్ లో వేకెన్సీలు బ్లాక్ చేసి చూపడాన్ని గురించి FAPTO ప్రస్తావించగా నవంబర్ నెల మొదటివారంలో మరో పదోన్నతుల షెడ్యూల్ ఇస్తామని ఈ షెడ్యూల్ లో బ్లాక్ చేసీన పోస్టులనన్నిటిని చూపిస్తామని తెలిపారు*
నవంబర్, డిసెంబర్ నెలలో రేషనలైజేషన్ నిర్వహించి జనవరి మొదటి వారంలో బదిలీలు చేపడతామని తెలిపారు*
ప్రమోషన్ కి పిలిచే ఉపాధ్యాయులను 1:3 పద్ధతిలో పిలవాలని కోరాము. పరిశీలిస్తామని తెలిపారు*
సీనియారిటీ జాబితాలను రూపొందించేటపుడు అన్ని జిల్లాలలో ఒకే విధానాన్ని అవలంబించాలని కోరగా తగు సూచనలు చేస్తామని తెలిపారు.