e-SHRAM Portal - Benefits of Registering in E-Shram Portal - Eligibility

e-SHRAM Portal - Benefits of Registering in E-Shram Portal - Eligibility.
eSHRAM portal eSHRAM portal The Ministry of Labour & Employment has developed eSHRAM portal for creating a National Database of Unorganized Workers (NDUW) for optimum realization of their employability and extend the benefits of the social security schemes to them.
It is the first-ever national database of unorganised workers including migrant workers, construction workers, gig and platform workers, etc

e-SHRAM Portal - Benefits of Registering in E-Shram Portal - Eligibility

Objectives of eSHRAM Portal
  • Creation of a centralized database of all unorganized workers (UWs) including Construction Workers, Migrant Workers, Gig and Platform workers, Street Vendors, Domestic Workers, Agriculture Workers, etc., to be seeded with Aadhaar.
  • To improve the implementation efficiency of the social security services for the unorganized workers.(ii) Integration of Social Security Schemes meant for UWs being administered by MoLE and subsequently those run by other ministries as well.
  • Sharing of information in respect of registered unorganised workers with various stakeholders such as Ministries/ Departments/ Boards/ Agencies/ Organisations of the Central & State Governments through APIs for delivery of various social security and welfare schemes being administered by them.
  • Portability of the social security and welfare benefits to the migrant and construction workers.
  • Providing a comprehensive database to Central and State Governments for tackling any National Crises like COVID-19 in future
Who can register in eShram (NDUW) Portal?
  • Any individual satisfying following condition can register on the portal:
  • An unorganised worker (UW).
  • Age should be between 16-59 years.
  • Not a member of EPFO/ESIC or NPS (Govt. funded)
Who is Unorganised Worker?
Any worker who is a home based-worker, self-employed worker or a wage worker in the unorganised sector including a worker in the organised sector who is not a member of ESIC or EPFO or not a Govt. employee is called an Unorganised Worker.

What is required for registration in eSHRAM portal?

Following is required to register on the portal:
Aadhar Number
Mobile number linked with Aadhaar.
Savings Bank Account number with IFSC code

Benefits of registration on e-SHRAM Portal?
Central Government has developed eSHRAM portal which will be a centralized database of unorganized workers seeded with Aadhaar. After registering, he/she will get an Accidental Insurance cover of 2 Lacs under PMSBY. In future, all the social security benefits of unorganized workers will be delivered through this portal. In emergency and national pandemic like situations, this database may be utilized for assistance.

e-SHRAM Portal  - ఈ శ్రం పోర్టల్ వివరాలు తెలుగు లో 

e-SHRAM పోర్టల్ అసంఘటిత రంగ కార్మికుల "ఉచిత" నమోదు ప్రక్రియ 26-8-2021 నుండి ప్రారంభం

పథకం ముఖ్య ఉద్దేశ్యం:
అసంఘటితరంగ కార్మికులందరినీ e-SHRAM పోర్టల్లో నమోదు చేసి వారికి సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అందించడం.

ప్రయోజనాలు:
1). ఇందులో చేరిన ప్రతి అసంఘటిత కార్మికుడికి 12 అంకెలు గల ప్రత్యేక గుర్తింపు కార్డు (UAN) - (యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నెంబరు) ఇవ్వడం జరుగుతుంది.
2) ఈ కార్డు ఉంటేనే ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత పథకాలు, వివిధ సంక్షేమ పథకాలు వర్తింపజేయడం జరుగుతుంది.
3) ఇందులో నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి ఒక సంవత్సరం పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) క్రింద రూ.2లక్షల ప్రమాద మరణ / అంగవైకల్య బీమా ఉచితంగా కల్పించడం జరుగుతుంది.
4) ప్రభుత్వం అసంఘటితరంగ కార్మికులనుద్దేశించి చేసే పథకాలు & విధానాలకు ఈ డేటాబేసే ప్రామాణికంగా తీసుకొనున్నారు.
5) వలస కార్మికులు ఎక్కడ ఉన్నారో గుర్తించి వారికి ఉపాధి కల్పించడం.

ఈ పథకంలో చేరడానికి అర్హులు ఎవరంటే
1) 16 నుండి 59 సంవత్సరాల వయస్సులోపు వారు.
2) ఆదాయపు పన్ను (Income Tax) చెల్లించని వారు.
3) ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) మరియు ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్సు (ESI) సందుపాయం లేనివారు.
4) అసంఘటితరంగ కార్మిక కేటగిరిలలో తప్పనిసరిగా పనిచేస్తూ ఉండాలి.

అసంఘటిత రంగ కార్మికులు ఎవరంటే:
  • వ్యవసాయ మరియు అనుబంధ ఉపాధుల పనివారు చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యానవనాల పనివారు, నర్సరీలు, పాడి పరిశ్రమ, ఉమ్మడి వ్యవసాయదారులు, మత్స్యకారులు, భవన మరియు దాని అనుబంధ రంగాలలో పనిచేసేవారు - తాపీ, తవ్వకం, రాళ్ళు కొట్టేపని, సెంట్రింగ్, రాడ్ బెండింగ్, ప్లంబింగ్, సానిటరీ, పేయింటర్, టైల్స్, ఎలక్ట్రిషియన్, వెల్డింగ్, ఇటుక, సున్నం బట్టీలు, రిగ్గర్లు, కాంక్రీట్ మిక్సర్, బావులు తవ్వడం / పూడిక తదితరులు.
  • అప్పారెల్ - టైలరింగ్, ఎంబ్రాయిడరీ, డ్రెస్ మేకర్స్. ఆటో మొబైల్ & రవాణా రంగం - డ్రైవర్లు, హెల్పర్లు.
  • చేతి వృత్తుల పనివారు - చేనేత, కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరి, కౌరవృత్తి, బ్యూటి పార్లర్లలో పనిచేసేవారు, చర్మకారులు, రజకులు.
  • స్వయం ఉపాధి - వీధి వ్యాపారులు, తోపుడు బండి వ్యాపారస్తులు, ఇంటి వద్ద వస్తువులు తయారీ, చిరు వ్యాపారులు, కల్లుగీత కళాకారులు, రిక్షా కార్మికులు, బీడీ కార్మికులు, చెత్త ఏరేవారు.
  • సేవా రంగం పనివారు - ఇళ్ళల్లో పనిచేసే పాచి పనివారు, కొరియర్ బాయ్స్, ఇంటివద్ద రోగులకు సేవలు అందించేవారు, కమీషన్ మీద వస్తువులు సరఫరా చేసేవారు.
  • ప్రభుత్వ పథకాల అమలు పనివారు - NREG వర్కర్లు, ఆశా వర్కర్లు SHG స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీలు, మిడ్ డే మిల్ వర్కర్లు, విద్యా వాలంటీర్లు, గ్రామ / వార్డు వాలంటీర్లు. హమాలీలు - లోడింగ్, ఆన్ లోడింగ్.
  • దుకాణాలు / సంస్థలలో పనిచేసే (EPF & ESI లేని) వారు, ఆహార పరిశ్రమ - బేకరీ, పాల ఉత్పత్తులు, ఫాస్ట్ ఫుడ్ తయారీదారులు, వలస కార్మికులు

నమోదు కావడానికి కావలసిన పత్రాలు (Documents):
1. ఈ కే వై సి (e-KYC) కలిగిన ఆధార్
2. ఆధార్తో అనుసంధానమైన మొబైల్ ఫోన్ నెంబరు.
3. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మొబైల్ ఫోన్ నెంబరుకు OTP వస్తుంది.
4. OTPసదుపాయం లేనివారు బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ ద్వారా రన్నింగ్లో ఉన్న బ్యాంకు అకౌంట్ మరియు IFSC కోడ్ ఎక్కడ నమోదు చేసుకోవాలి?

మీ సమీప ప్రాంతాలలోని గ్రామ / వార్డు సచివాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్ల (CSC) లో నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న వెంటనే UAN కార్డు జారీ చేయబడును.

ముఖ్య గమనిక: నమోదుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఉచితం.
మరిన్ని వివరాలకు మీ సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయాలు CSC సెంటర్లు లేదా కార్మిక శాఖ కార్యాలయములు సంప్రదించగలరు.