పార్ట్ -7 ఉద్యోగుల - ఉపాధ్యాయుల సర్విస్ మాటర్ -సందేహాలు - సమాధానాలు

పార్ట్ -6  ఉద్యోగుల - ఉపాధ్యాయుల సర్విస్ మాటర్ -సందేహాలు - సమాధానాలు 
సందేహాలు - సమాధానాలు - 132(706-710)

పార్ట్ -6  ఉద్యోగుల - ఉపాధ్యాయుల సర్విస్ మాటర్ -సందేహాలు - సమాధానాలు 

706.❓సందేహం:
వేసవి సెలవుల్లో పాఠశాల విధులు నిర్వహి0చటానికి జూనియర్ అసిస్టెంట్ లేకపోతే ఎవరిని నియమించాలి?
✅సమాధానం:
ఆ స్కూల్లో సీనియర్ ఉపాధ్యాయునికి ముందు అవకాశం ఇవ్వాలి.

707.❓సందేహం:
నేను జీత నష్టపు సెలవు పెట్టాను.EHS ప్రీమియం చెల్లించలేదు.ఇపుడు నేను ఏమి చేయాలి?
✅సమాధానం:
చలానా ద్వారా ప్రీమియం చెల్లించవచ్చు.


708.❓సందేహం:
నేను,మరొక టీచర్ ఇద్దరం ఒకే సారి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందాము. HM పదోన్నతికి మా ఇద్దరిలో ఎవరు సీనియర్?
✅సమాధానం:
Rc. No.142 తేదీ:11.8.2011 ప్రకారం SGTలో సీనియర్ ఐన ఉపాధ్యాయుడు ఎస్ఏ లో సీనియర్ అవుతాడు.వారికే ముందు HM పదోన్నతి వస్తుంది.

709.❓సందేహం:
సవ పిల్లలు కి EHS వర్తిస్తుందా?

✅సమాధానం:
జీఓ.174; తేదీ:1.11.2013 ప్రకారం సవతి పిల్లలు కూడా EHS ప్రయోజనాలు పొందవచ్చు.

710.❓సందేహం:
దత్తత తీసుకున్న తల్లిదండ్రులకి EHS వర్తిస్తుందా?
✅సమాధానం:
జన్మనిచ్చిన తల్లిదండ్రులకి లేదా దత్తత తీసుకున్న తల్లిదండ్రులకి ఎవరో ఒకరికి మాత్రమే ehs వర్తిస్తుంది.