Surrender Leave Rules in Telugu - ఆర్జిత సెలవులను సరెండర్ లీవ్ రూల్స్ తెలుగులో

Leaves Rules in Telugu Surrender Leave Rules in Telugu - ఆర్జిత సెలవులను సరెండర్ లీవ్ రూల్స్. అర్జిత సెలవు నగదు కోసం అప్పగింత, సరెండర్ లీవ్ (SURRENDER LEAVE) సంబంధిత ఉత్తర్వులతో ఆర్జిత సెలవు- నగదుకోసం అప్పగింత
(Surrender of Earned Leave) ఆర్జిత సెలవు ఖాతాలో నిలువ వున్న సెలవును, కొన్ని పరిమితులకు, షరతులకు లోబడి అప్పగించి (Surrender) దానికి ప్రతిఫలంగా నగదు రూపేణా పొందుటకు ప్రభుత్వం G.O.Ms. No. 238 Finance (FRI) Dept. dt. 13-8-1969 & Govt. Circular Memo 52729 Finance dt. 11-10-1969 ఉత్తరువుల ద్వారా సౌకర్యం కల్పించింది.

    Surrender Leave Rules in Telugu - ఆర్జిత సెలవులను సరెండర్ లీవ్ రూల్స్ 

    What is Surrender Leave??
    ఆర్జిత సెలవు ఖాతాలో నిలువ వున్న సెలవును, కొన్ని పరిమితులకు, షరతులకు లోబడి అప్పగించి (Surrender) దానికి ప్రతిఫలంగా నగదు రూపేణా పొందుటకు ప్రభుత్వం G.O.Ms. No. 238 Finance (FRI) Dept. dt. 13-8-1969 & Govt. Circular Memo 52729 Finance dt. 11-10-1969 ఉత్తరువుల ద్వారా సౌకర్యం కల్పించింది అర్జిత సెలవు నగదు కోసం అప్పగింత, సరెండర్ లీవ్ (SURRENDER LEAVE) సంబంధిత ఉత్తర్వులతో ఏ పి టీచర్స. ఇన్  వెబ్సైట్ వారిచే రూపొందించిన కూర్పు:


    అర్జితసెలవు(Earned Leave) ఖాతాలో నిలువ వున్న సెలవులను కొన్ని షరతులకు లోబడి అప్పగించి (Surrender) దానికి ప్రతిఫలంగా నగదు పొందుటను సరెండర్ లీవ్ అందురు.
    (Ref: G.O.Ms.No.238 Fin తేది:13-08-1969 Click Here to See)
    (Govt. Circular Memo No.52729 Fin తేది:11-10-1969)

    ఈ  సౌకర్యం గజిటెడ్, నాన్ గజిటెడ్, నాల్గవ తరగతి ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది.
    ఆర్జిత సెలవు సరెండరు చేయుటకు ఉద్యోగులను వర్గాల వారీగా విభజించి ఏఏ వర్గాల ఉద్యోగులు ఏఏ నెలలో ఆర్జిత సెలవు సరెండరు చేయవచ్చునో ప్రభుత్వం టైమ్ షెడ్యూల్ నిర్ణయించి ఉత్తరువులు జారీ చేస్తూ ఉంటుంది. తదనుగుణంగా ఉద్యోగులు ఆర్జిత సెలవును సరెండరు చేస్తూ నగదు సౌకర్యం పొందవచ్చును. ఈ ఉద్యోగులు ఆర్జిత సెలవును సరెండరు సౌకర్యం కోసం ఉద్యోగులను మూడు వర్గాలుగా విభజించారు.
    • ఎ. నాల్గవ తరగతి ఉద్యోగులు
    • బి. నాన్ గెజెటెడ్ ఉద్యోగులు
    • సి. గెజెటెడ్ ఉద్యోగులు
    ప్రభుత్వ ఆర్ధిక సహాయం పొందుతున్న జిల్లాపరిషత్, మండల పరిషత్, పురపాలక సంఘాలు, ప్రైవేటు యాజమాన్యం(ఎయిడెడ్) ఆధ్వర్యంలో పనిచేయుచున్న అన్ని పాఠశాలలు, కాలేజీలలో పనిచేయుచున్న ఉద్యోగులు సరెండర్ లీవ్ సదుపాయానికి అర్హులు.
    (Ref: G.O.Ms.No.418 Edn తేది:18-04-1979)

    ఆర్జిత సెలవు ఎప్పుడెప్పుడు సరెండరు చేయవచ్చు

    • ఒక సంవత్సరం సర్వీసు పూర్తి చేసినటువంటి రెగ్యులర్ ఉద్యోగులు ప్రతి ఆర్థిక సంవత్సరం (Financial year) లో 15 రోజులు, రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన రెగ్యులర్ ఉద్యోగులు ప్రతి రెండు ఆర్థిక సంవత్సరాల బ్లాక్ పీరియడ్ లో 30 రోజులు ఆర్జిత సెలవు సరెండరు చేసుకొనుటకు అనుమతించవచ్చును.  ఈ సౌకర్యం 1-1-1977 నుండి అనుమతించబడినది.
    • అనగా ఒక ఆర్ధిక సం॥ నకు 15 రోజుల చొప్పునగాని, 2 సం॥ లకు 30 రోజుల చొప్పున గాని ఈ సెలవును సరెండర్ చేసి నగదు పొందవచ్చు. (Ref: G.O.Ms.No.334 F&P తేది:28-09-1977)
    • సరెండర్ లీవ్ 15/30 రోజులకు 12/24 నెలల గ్యాప్ తో ఏ నెలలోనైనా అనుమతిస్తారు.ఈ సెలవు కోసం ప్రత్యేకంగా ఉత్తర్వులివాల్సిన అవసరం లేదు.(Memo.No.14781-C/278/FR-1/2011 తేది:22-06-2011)
    • ఆర్థిక సంవత్సరములో ఎప్పుడైనా సెలవు సరెండరు చేయవచ్చు. కాని ఒక్క సరెండరు సెలవుకు తదుపరి సరెండు సెలవుకు మధ్యలో 12 నెలల వ్యవధి వుండవలెను. అదే విధంగా ఒక సరెండరుకు ఇంకొక సరెండరు సెలవుకు మధ్య 24 నెలల వ్యవధి ఉన్న యెడల 30 రోజులు సరెండరు చేయవచ్చు. (V 3(ఎ) ఆఫ్ గవర్నమెంట్ సర్యులర్ మెమొ నెం. 3405-ఎ/870/ ఎస్ఆర్‌/12 ఫైనాన్స్ (ఎస్ఆర్ఎ) డిపార్ట్మెంట్ తేదీ 14-12-2012).
    • ఒకవేళ ఉద్యోగికి తన సంపాదన సెలవు ఖాతాలో 286 రోజులుగాని, అంతకు మించిగాని వున్న యెడల, 12 నెలల గ్యాప్ పరిధిలోనికి తీసుకొనకుండ 15 రోజులు సరెండరు చేయవచ్చు. (పేరా 3(బి)). వెనుకటి ఆర్థిక సంవత్సరములో ఉద్యోగి సరెండరు సెలవు తీసుకోకుండా, అతను పెట్టుకున్న అర్జీ నాటికి 286 రోజులు అంతకుమించి అతని సంపాదిత సెలవులో ఖాతా ఉన్న సందర్భంలో, 24 నెలల గ్యాప్ షరతు పాటించకుండా 30 రోజులు సరెండరు సెలవు మంజూరు చేయవచ్చు. (పేరా 3(బి)) and further as clarified in Govt. Circular Memo. No. 4338-A\95\FRI\13 Finance FRI department, dated 18-02-2013.
    • సరెండర్ సెలవు జీతం నెలవారీ పద్దతిపై ఇవ్వాలి. ఆ నెలలో గల 28/29/30/31 రోజులతో నిమిత్తం లేకుండా నెలవారీ పద్దతిపై నగదు చెల్లించాలి. ఈ విషయమై నెల అనగా 30 రోజులు మాత్రమే.(Ref: G.O.Ms.No.306 Fin తేది:08-11-1974)

    సరెండర్ సెలవు మంజూరులో చెల్లించే అలవెన్స్ లు - మినహాయింపుల

    ఉపాధ్యాయుల విషయంలో ఏ అధికారైతే అర్జిత సెలవు మంజూరుచేయు అధికారం కలిగియుంటాడో, అట్టి అధికారే అర్జిత సెలవు సరెండర్ చేయుటకు అనుమతించవచ్చును.
    (Para II of G.O.Ms.No.238 Fin తేది:13-08-1969)

    సరెండర్ లీవ్ లెక్కింపు లో IR చెల్లించబడదు. ఇంటీరియమ్ రిలీఫ్ అనేది పే కాదు. కాబట్టి అది సరెండరు లీవు సందర్భంలోనే కాకుండ నీవును నగదుగ మార్చుకొను సందర్భంలో కూడా పరిగణనలోకి తీసుకొను వీలులేదు.
    (Govt. Memo No. 31948/398/P.C./1/98-1 F& P Dept. dt. 12-8-1998).
    LEAVE RULES , SERVICE RULES (Govt.Memo.Mo.31948 F&P తేది:12-08-1998)

    ఆర్జిత సెలవు జనవరి ఒకటవ తేదీనగాని లేక జులై ఒకటవ తేదీనగాని సరెండర్ చేసే పక్షంలో, మొదటి సరెండరు చేస్తున్న సెలవును , ఆర్జిత సెలవు పద్దు నుంచి తగ్గించి అటు తర్వాత జనవరి/జులై ఒకటవ తేదీన అర్హతగల ఆర్జిత సెలవును జమ చేయవలెను.
    (Govt. Circular Memo No. 50798/1063 FRI/79-1 Fin (FRI) dept. dt.22-11-1979, Read with Government Circular Memo No. 13870-A/436/FRI/2005-2 Fin. (FRI) Dept. dt. 27-7-2005).

    అర్జిత సెలవు సరెండర్ చేసినందువల్ల వచ్చు సెలవు జీతంలో నుంచి GPF, ప్రభుత్వానికి చెల్లించే అడ్వాన్సులు, సహకార సంస్థల బాకీలు తదితరములు తగ్గించకూడదు.

    సరెండర్ సెలవుకు సంబంధించిన సెలవు జీతం చెల్లించునపుడు ఇంటి అద్దె (HRA) మరియు ఇతర కాంపెన్సెటరీ అలవెన్సు లు కూడా చెల్లించాలి.
    (Govt.Memo.No.64861/797/FR-II711 తేది:14-07-1972)

    ఉద్యోగులు ప్రభుత్వ క్వార్టర్సులోను, నిర్దేశిత క్వార్టర్సు (Earmarked Quarters) లోను రెంటు ఫ్రీ క్వార్టర్సులో నివసిస్తున్నప్పటికి ఆర్జిత సెలవు సరెండరు చేయుటకు అనుమతించినచో ఇంటి అద్దె అలవెన్సు (HRA) కూడా చెల్లించవలెను. (G.O.Ms. No. 337 F&P (PWPC II) Dept. dt. 29-9-1994)

    అదే విధంగా అదనపు ఇంటి అద్దె (Additional HRA) కూడా G.O.Ms. 25 F&P (FWPC IV) Dept. dt. 5-2-1996 ప్రకారం చెల్లించవలసి యున్నది.

    సరెండరు లీవుకు నగదు చెల్లించు సందర్భంలో ఇతర అలవెన్సులు (Other Compensatory Allowances) కూడా చెల్లించాలి. (Govt. Circular Memo No. 64861/797-1-FR/711 Fin Dept. dt. 14-7-1972)

    పదవీ విరమణ తేదికి సమీపంలో ఉన్న ఉద్యోగులకు కూడా సరెండర్ సెలవు మంజూరు చేయవచ్చును. కాని అట్టివారికి మంజూరు చేయబడిన కడపటి తేదీకి, పదవీ విరమణ తేదికి డ్యూటీ పీరియడ్ కు 30 రోజులు తక్కువగాకుండా ఉండవలెను.
    (G.O.Ms.No.131 F&P తేది:25-03-1976)

    పదవీ విరమణ/సర్వీసులో ఉంటూ మృతిచెందిన ఉద్యోగుల విషయంలో అర్జిత సెలవును నగదుగా మార్చుకొను విషయంలో కార్యాలయపు అధికారే మంజూరు చేయవచ్చును. 
    (Govt Circular Memo No.9258-C/1768/FR-I/76-1 www.apteachers.in Fin తేది:31-01-1977)
     

    సరెండరు లీవు బిల్లు సమర్పించుటకు కాల పరిమితి

    అర్జిత సెలవు సరెండర్ చేయుటకు ఉద్యోగి దరఖాస్తు చేసిన తర్వాత తేదినుండి మాత్రమే, అర్జిత సెలవు సరెండర్ చేసుకొనుటకు అనుమతించాలి. అంతకు ముందు తేది నుండి అనుమతించకూడదు.
    (Govt.Memo.No.47064/1164/FR-I/4-1 F&P తేది:25-09-1974)

    ఉద్యోగికి సరెండరు లీవు మంజూరు అయిన తేదీ నుండి 90 రోజుల లోపల బిల్లు నగదుకోసం సమర్పించవలెను. ఆర్ధిక సంవత్సరమని కేలండరు సంవత్సరము అడ్డులేదు. 90 రోజులలోపల బిల్లు సంబంధిత వారికి సమర్పించని యెడల సరెండరు లీవు మంజూరు అనుమతి దానంతట అదే (Automatic) రద్దు అవుతుంది
    (Govt Memo.No.271423/A2/97-1/ F&P తేది:18-08-1997)

    ఫారెన్ సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సరెండరు లీవు

    ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా ఇతర సంస్థలలో (Foreign Service) పని చేస్తున్న సందర్భంలో వారు కూడా సరెండర్ లీవుకు అర్హులు. అలాంటివారికి సరెండరు సెలవు జీతము, అలవెన్సులు మూలశాఖ (Parent Department) నుండి చెల్లిస్తారు. అయితే ఫారన్ ఎంప్లాయర్ (Foreign Employer) ముందుగా సరెండరు సెలవు జీతం ఉద్యోగికి చెల్లించి, అట్టి మొత్తాన్ని మూలశాఖ (Parent Department) నుండి తిరిగి రాబట్టుకొనవచ్చును.
    (G.O.Ms.211 Fin (FRI) Dept. dt. 11-4-1972 , G.O.Ms. No. 35 F&P Dept. dt. 31-1-1976 and www.apteachers.in Govt. Memo No. 25818/516/FRI/76-1 F & P Dept. dt. 29-4-1976)

    సరెండరు లీవు-  జత పరచవలసిన సర్టిఫికేటు
    సరెండరు లీవు అనేది నిర్దేశించిన బ్లాక్ పీరియడు ఆధారంగా అనుమతించబడుతూ ఉంటుంది. అలాంటి సందర్భాలలో నియమ నిబంధనల మేరకు, బ్లాకు పీరియడ్ మేరకు ఆర్జిత సెలవు సరెండరు చేయుటకు అనుమతించినది లేనిది నిర్ధారించుకొనుటకు సంబంధిత అధికారి ఈ క్రింద తెలియజేసిన విధంగా సర్టిఫికేటు యివ్వవలసియున్నది.
    (Govt. Circular Memo No. 106288/1893/ FRI/77-1 F&P (Fin. wing. FRI) dept. dt. 30-5-1978)
    "Certified that the Surrender of leave Now permitted of one or two calendar year (s) has not been sanctioned and availed by the government servant earlier"..

    Never Miss any Update: Join Our Free Alerts:

    తాత్కాలిక ఉద్యోగులకు సరెండరు లీవు

    తాత్కాలిక ఉద్యోగులకు రెండు సంవత్సరముల సర్వీసు పూర్తి చేసుకు తర్వాతనే 15 రోజుల ఆర్జిత సెలవు సరెండరు చేసుకొనుటకు అనుమతించవచ్చు. ఆ తరువాత సంవత్సరం విడిచి సంవత్సరం (ఆర్థిక సంవత్సరం) 15 రోజు.. సరెండరు చేసుకొనుటకు అనుమతించవచ్చును. అనగా సరెండరుకు, సరెండరు మధ్య ఒక ఆర్థిక సంవత్సరం ఎడం (Gap) వుండాలి.
    (G.O.Ms. No. 221 FRD (FRI) Dept. dt. 23-8-1974,
    G.O. Ms. 316 Fin. dept. dt. 26-11.1974 and G.O.Ms. No. 393 F&P Dept. dt. 31-12-1975) and W.O. Note No.31504-A2/81-2/FRI Fin dept. dt. 3-8-1981.

    తాత్కాలిక ఉద్యోగులు అనగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేటు సర్వీసు రూల్సులోని రూలు 10(a)(i) ప్రకారం నియమితులైనవారు, ఆంధ్రప్రదేశ్ లాస్ట్ గ్రేడు సర్వీసు రూల్సులోని రూలు 7 (2) ప్రకారం నియమితులైన నాల్గవ తరగతి ఉద్యోగులు. అట్టివారు వారి ఆర్జిత సెలవుల ఖాతాలో 30 రోజులు ఆర్జిత సెలవు ఉన్నప్పుడు, 24 నెలల కాలం ఎడం (Interval)తో, ఒకసారి 15 రోజులు సరెండరు చేయవచ్చు. (G.O.Ms.No. 393 F&P FRI Dept. dt. 3-12-1975)

    పదవీ విరమణ - పునర్నియామకము - సరెండరు లీవు

    G.O. Ms. 324 F&P Dept. dt. 30-7-1976 ప్రకారం పదవీ విరమణ వయస్సుకు చేరి పదవి విరమణ చేసి తిరిగి పునర్నియామకము పొంది ఉద్యోగ విరమణకు పునర్నియామకానికి మధ్య ఎడం (Gap) లేనట్లయితే అట్టి వారిని కూడ తమ ఆర్జిత సెలవు సరెండరు చేసుకొనుటకు అనుమతించవచ్చును.

    ఇతర రాష్ట్రాల నుంచి డిప్యూటేషన్ పై వచ్చినవారికి
    ఇతర రాష్ట్రాల నుంచి లేక కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి డిప్యూటేషన్ పై వచ్చిన ఉద్యోగులు కూడ సరెండరు లీవుకు అర్హులు. కాని అట్టివారికి డ్యూటీ పే మరియు అలవెన్సులు మాత్రమే చెల్లిస్తారు. కాన ఇంటి అద్దె అలవెన్సు (H.R.A) లేక ఇతర కంపెన్సేటరి అలవెన్సులు చెల్లించరు. (G.O.Ms. 211 Fin (FRI) dept. dt. 10-4-1972). అదే విధంగా ఆంధ్రరాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు డిప్యూటేషన్ పై వెళ్ళిన ఉద్యోగులకు సరెండరు లీవు పథకం వర్తిస్తుంది.

    ఇతర ముఖ్య అంశాలు 

    అర్జిత సెలవు సరెండర్ చేసిన సందర్భాలలో పూర్తి వివరములు ఉత్తర్వుల నంబరుతో సహా సంబంధిత ఉద్యోగి సర్వీసు పుస్తకంలో ఎర్రసిరాతో నమోదుచేయాలి. అలాగే సర్వీసు పుస్తకంలో అర్జిత సెలవు పట్టికలో కూడా ఏర్రసిరాతో నమోదుచేసి అటెస్ట్ చేయాలి.

    ఉపాధ్యాయులు ఇటీవల బదిలీలలో భాగంగా ఒక STO పరిధి నుండి మరొక STO పరిధిలోని పాఠశాలకు మారినపుడు సరెండర్ అప్లై చేసిన సందర్భంలో పాత STO కార్యాలయం నుండి Fly Leaf Xerox కాపీని STO గారి అటెస్ట్స్టేషన్ సమర్పించాలి.

    ఈ సరెండర్ లీవ్ (అర్జిత సెలవును సరెండర్ చేయడం) కు సంబంధించి ఈ వివరాలను ఏ పి టీచర్స . ఇన్ వెబ్సైట్ వారిచే కూర్పు చేయబడింది. వేరే వెబ్సైట్ బ్లాగ్ లలో ఈ కూర్పు చేసిన వారి అనుమతి లేకుండా కాపీ పేస్ట్ చేసిన ఎడల వారిపై కాపీ రైట్ కింద చర్యలకు అవకాశం ఉంది 

    సరెండర్ లీవ్ - వివిధ శాఖలకు వర్తింపు సమాచారం 


    1. సరెండరు లీవుకు సంబంధించి ప్రభుత్వం కాలానుగుణంగా జారీ చేసిన ఉత్తరువులు పురపాలక సంఘాల ఉద్యోగులకు కూడా వర్తిస్తాయి. (G.O.Ms. No. 339 MA dt. 8-8-1975 as amended in G.M. No. 2031/F2/77-1 M.A. dt. 16-1-1978 W.E. From 17-7-1975). "
    2. ప్రభుత్వ ఉత్తరువులు 334 Fin. & Plg. Dept. dt. 28-9-1977 పురపాలక సంఘాలకు వర్తిస్తాయని G.O.Ms.No. 687 MA dt. 12-4-1978 ద్వారా ఉత్తరువులు జారీ చేయబడ్డాయి.
    3. ప్రభుత్వ ఉత్తరువులు G.O.Ms. 393 Fin. & Plg. (FRI) Dept. dt. 31-12-1975 యధావిధిగా పురపాలక బోధనేతర సిబ్బందికి వర్తిస్తాయి. (GM.No. 676/F2/76-1 M.A. dt. 20-3-1976). ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం పురపాలక సంఘాలకు అందదు.
    4. ప్రజారోగ్య (Public Health) మరియు ప్రజారోగ్యా నికి చెందని (Non Public Health) పనివారలకు (workers) నాల్గవ తరగతి సిబ్బందికి చెల్లించే విధంగానే వర్తిస్తాయి. (Govt.Memo.No. 1807/F3/79-1 dt. 1-5-1975).
    5. పురపాలక సంఘాల ఆధ్వర్యంలో పని చేయు ఉపాధ్యాయులకు కూడా సరెండరు లీవు నియమాలు వర్తిస్తాయి. (G.M.No.39887/1686/A2/FR/83-2F&P Dept. dt. 3-1-1984 and G.M.No. 2296/61/Admn/11/83 Dept. dt. 4-6-1984).
    6. జిల్లా ప్రజా పరిషత్తులు, మండల ప్రజా పరిషత్తులలో పని చేయుచున్న ఉద్యోగులకు ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి కూడా సరెండరు లీవు నియమాలు వరి, (G.M.No. 39887/1686/A2/FRI/83-2 F&P dept. dt. 3-1-1984 and GM.No. 2296/61 Admn 11/83 dt. 4-6-1984). ఈ సౌకర్యం 1-3-1970 నుంచి కల్పించబడినది. (GO.Ms.No. 418 Edu. dt. 18-4-1979).
    7. గ్రామ పంచాయితీల ఉద్యోగులకు సరెండర్ లీవు నియమ నిబంధనలు వర్తిస్తాయి. (G.O.Ms. No. 479/P.R. dt. 16-9-1974).
    8. జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగులకు యధాతథంగ సరెండరు లీవు నియమ నిబంధనలు వర్తిస్తాయి. (G.O.Ms. No. 1801/Edu. Dept. dt. 24-9-70 and GM.No. 65499/F2/76-2 dt. 2-3-1979).
    9. ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుతున్న జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, పురపాలక సంఘాలు, ప్రైవేటు యాజమాన్యం ఆధ్వర్యంలో పని చేయుచున్న అన్ని పాఠశాలలు, కాలేజీలలో పని చేయుచున్న ఉద్యోగులు సరెండరు లీవు సదుపాయానికి అరులు. (G.O.Ms.No. 418 Edu. Dept. dt. 18-4-1979).

    సరెండర్ లీవ్ మంజూరు -కొన్ని  రిఫరెన్స్ ఉత్తర్వులు

    • 1. గెజిటెడ్ మరియు నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు సరెండర్ లీవు సౌకర్యము జి.ఒ.నెం. 238, ఫైనాన్స్, ది. 13.08.1969 ద్వారా అమలులోనికి తేవడం జరిగినది.
    • 2. కాస్ - 4 ఉద్యోగులకు సరెండర్ లీవు సౌకర్యము సర్కులర్ ఆ మెమొ నెం. 52739-ఎ/ 69-1 తేది 11.10.69 ఫైనాన్ ద్వారా అమలులోకి తేవడం జరిగినది.
    • 3. సర్కులర్ మెమొ నెం, 64861/797/ ఎఫ్.ఆర్. 1-1 తేది 14.7.72 ప్రకారము సరెండర్ లీవు కొరకు డి.ఎ., హెచ్.ఆర్.ఎ., సి.సి.ఎ. మరియు ఇతర అలవెన్సులు అనుమతించడమైనది. . 
    • 4.జి.ఒ, ఎం.ఎస్. నెం. 172 ది. 01.07.74 ఫైనాన్స్ ప్రకారము వాస్తవంగా సెలవులోకి వెళ్ళకుండా 12 నెలల కాలంలో ఒకసారి 15 రోజులు /24 నెలల కాలంలో ఒకసారి 30 రోజులు సరెండర్ లీవు తీసుకొనుటకు ఉ ద్యోగులు అందరికి వర్తింపచేస్తూ ఆదేశాలు ఇవ్వటం జరిగినది. 
    • 5. జి.ఓ. ఎం.ఎస్. నెం. 306 ది. 08.11.1974 ఫైనాన్స్ ప్రకారం సరెండర్ చేసిన నెలలో 28/29/30/31 రోజులు ఉన్నాయా అనే దానితో సంబంధం లేకుండా ఒక నెల అనగా 30 రోజులుగా మాత్రమే లెక్క కట్టి 15 లేదా 30 రోజులకు సరెండర్ లీవుకు సమానమైన నగదు చెల్లించాలని ఆదేశించారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి ఫిబ్రవరి నెలలో నెలరోజుల సరెండర్ లీవు తీసుకుంటే 30 రోజులుగా లెక్కించి పూర్తి జీతాన్ని సరెండర్ లీవుకు నగదుగా ఇవ్వాలి. అలాగే 15 రోజులు సరెండర్ చేసిన పూర్తిగా సగం జీతం నగదుగా చెల్లించాలి తప్ప 28 రోజులకు లెక్కించకూడదు. .. 
    • 6. సర్వీసు రెగ్యులర్ కాని తాత్కాలిక ఉద్యోగులకు సరెండర్ లీవు సదుపాయము జి.ఒ. ఎం.ఎస్. నెం. 221 ఫైనాన్స్ 23.08.1974 ద్వారా అమలు చేయుటకు ఆదేశాలు ఇవ్వడమైనది. 
    • 7. తాత్కాలిక నాలుగవ తరగతి ఉద్యోగులకు సరెండర్ లీవు సదుపాయమును అమలు పరుస్తూ సర్కులర్ మెమో నెం. 47774/1177/FR./74-1 ది. 17.7.1974 ఆర్ధికశాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేయడమైనది. 
    • 8. సర్కులర్ మెమొ నెం. 35326/సి/ 748/ F.R.I/ 74-1 ది. 17.7.1974 ప్రకారం ఏ రోజు అయితే సరెండర్ లీవు మంజూరు చేసారో ఆ రోజు నుండే సరెండర్ లీవు క్లెయిమునకు బిల్లు పెట్టు కోవచ్చు. సరెండర్ లీవు పీరియడ్ పూర్తి అయ్యేవరకు ఆగవలసిన అవసరం లేదు,
    • 9. ఆర్ధికశాఖ సర్కులర్ మెమో నెం. 47064/1164 /ఎఫ్.ఆర్.. 1/74-1 తేది 25.09.74 ప్రకారం దరఖాస్తు చేసిన తేదీ నుండే సరెండర్ లీవు మంజూరు చేయాలి. ముందు తేదీ నుండి మంజూరు చేయరాదు. 
    • 10. జి.ఓ.ఎం.ఎస్. నెం. 0809 ది.11.12.1974 సాధారణ పరిపాలన (స్పెషల్) శాఖద్వారా సరెండర్ లీవు సౌకర్యాన్ని రాష్ట్రంలో పని చేస్తున్న అఖిల భారత సర్వీసు (ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్., ఐ.ఎఫ్.ఎస్) అధికారులకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయడమైనది. 
    • 11. జి.ఓ, ఎం.ఎస్. నెం. 393 ఫైనాన్సు ది. 31.12.1975 ద్వారా తాత్కాలిక ఉద్యోగులకు 24 నెలల ఇంటర్వెల్ లో ఒకసారి 15 రోజులు సరెండర్ లీవు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ అయినవి. 
    • 12. కేంద్ర | రాష్ట్ర ప్రభుత్వ కార్పోరేషన్లు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు మొదలైన కార్యాలయాల్లో డెప్యుటేషన్ పై పని చేసే ఉద్యోగులను ఆయా కార్పొరేషన్లు లేదా సంస్థలు ముందుగా సరెండర్ లీవు మొత్తం నగదుగా చెల్లింపు జరిపి, తరువాత జి.ఓ.ఎం.ఎస్. నెం. 329, ఫైనాన్స్ ది. 02.11.74లో ఇచ్చిన విధివిధానల ప్రకారం ఆ ఉద్యోగి యొక్క పేరెంట్ డిపార్టుమెంట్ నుండి రీ-ఇంబర్స్మెంట్ పొందాలి. (సర్యులర్ మెమో నెం. 49395/12/19/ఎఫ్.ఆర్. 1/ 75-1 ది. 06.01.76 ఆర్ధిక శాఖ). 
    • 13. జి.ఒ.ఎం.ఎస్. నెం. 324 ది. 30.07.1976 ఆర్థికశాఖ ప్రకారము రిటైర్మెంట్ వయస్సు పూర్తి అయిన వెంటనే రిటైరైన ఉద్యోగులు ఎలాంటి గ్యాప్ లేకుండా తిరిగి రి-ఎంప్లాయ్ మెంట్ పొందినచో వారికి కూడా సరెండర్ లీవు సౌకర్యము అమలు చేయటం జరిగినది. 
    • 14. జి.ఒ.ఎం.ఎస్. నెం, 35 ఫైనాన్స్ ది. 31.1.1976 ప్రకారం వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్పోరేషన్లు, స్వతంత్ర సంస్థలలో డెప్యుటేషన్ పై పని చేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన సరెండర్ లీవు మొత్తాన్ని చెల్లించవలసిన బాధ్యత ఆ ఉద్యోగి యొక్క పేరెంట్ డిపార్టుమెంట్ పైనే ఉంటుందని ఆదేశాలు జారీ చేయడము జరిగినది. 
    • 15. జి.ఒ.ఎం.ఎస్. నెం. 334, ఫైనాన్స్ ది. 28.09.1977 ప్రకారం ఒకటి, రెండు కాలెండర్ సంవత్సరంలలో 15/ 30 రోజుల సరెండర్ లీవు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయటం జరిగినది.
    • 16. సర్క్యులర్ మెమో నెం. 50798/ 1863/ ఎఫ్.ఆర్.1/79-1 ది. 22.11.79 ఆర్థికశాఖ ప్రకారం ఒక ఉద్యోగి జనవరి 1వ తేదీ లేదా జూలై 1వ తేది సరెండర్ లీవు ఉ పయోగించుకొన్నప్పుడు, ముందుగా సరెండర్ లీవును ఎర్శవు ఖాతా నుండి తగ్గించి, ఆ తరువాత రాబోయే అర్ధసంవత్సరానికి అడ్వాన్స్ క్రెడిట్ ఇవ్వాలి. 
    • 17. జి.ఒ.ఎం.ఎస్.నెం. 294 ప్రకారము సరెండర్ లీవును కేలండర్ సంవత్సరమునకు కాకుండా ఆర్థిక సంవత్సరంలో ఒకసారి 15 రోజులు లేదా 30 రోజులు సరెండర్కు అనుమతించడం జరిగినది. (జి.ఓ.ఎం.ఎస్.నెం. 294 ది. 16.11. 1988 ఫైనాన్స్ డిపార్టుమెంట్) 
    • 18. 12 నెలలు లేదా 24 నెలలు అంతరముతో ఒక ఆర్థిక . . నంవత్సరంలో ఎప్పుడైనా సరెండర్ లీవు ఉపయోగించుకోవచ్చును. 
    • 19. గవర్నమెంట్ సర్కులర్ నెం. 8672/3/305/ ఎఫ్.ఆర్. 1/ 89-1 ది. 13.04.1989 ఆర్థికశాఖ ప్రకారం రిటైర్ అవుతున్న ఉద్యోగులు 12/24 నెలల అంతరంతో 15/30 రోజులు సరెండర్ లీవు రిటైర్మెంటుకు ముందుగానే తీసుకునే అవకాశం కల్పించబడింది. 
    • 20. గవర్నమెంట్ క్వార్టర్సులో నివాసముంటున్న ఉద్యోగులకు సరెండర్ లీవు మంజూరు చేసినప్పుడు ఇంటి అద్దె అలవెన్సు మొత్తము కూడా 15/30 రోజులకు లభిస్తుంది. (జి.ఓ.ఎం.ఎస్. నెం. 337 ఫైనాన్స్ ది. 29.09.1994) 
    • 21. జి.ఓ.ఎం.ఎస్.నెం. .25 ఫైనాన్సు ది. 05.02.1996 - ప్రకారం ఇంటి అద్దె అలవెన్సు, అలాగే అదనపు ఇంటి అద్దె అలవెన్సుకు అర్హత కలిగిన ఉద్యోగులకు సరెండర్ లీవులో ఆ ఇంటి అద్దె అలవెన్సు, అదనపు ఇంటి అద్దె అలవెన్సు మొత్తాలు కూడా డి.ఏ., సి.సి.ఏ.లతో పాటు పొందుటకు అవకాశం కల్పించబడింది.
    • 22. గవర్నమెంట్ మెమో నెం. 27/ 423/ A2/FR.I/ 97-1ది. 18.08.1997 ఆర్థిక శాఖ ప్రకారం సరెండర్ లీవు శాంక్షన్ ఉత్తర్వులు జారీ చేసిన - 90 రోజులలోపు బిల్లు పెట్టవచ్చును. 90 రోజుల లోపు బిల్లులు పెట్టని ఎడల శాంక్షన్ ఉత్తర్వులు ఆటోమేటిక్ గా రద్దు అవుతాయి. కనుక జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో జారీ చేసిన సరెండర్ లీవు ఉత్తర్వులు ఆర్ధిక సంవత్సరము చివరి రోజైన మార్చి, 31తో సంబంధం లేకుండా ఉత్తర్వులు జారీ చేసిన 90 రోజులలో బిల్లు పెట్టవచ్చు. ఉదాహరణకు జనవరి 15వ తేదీన జారీచేసిన సరెండర్ లీవు ఉత్తర్వుల ప్రకారం బిల్లును ఏప్రియల్ 14వ తేదీలోపు ఎప్పుడైనా పెట్టవచ్చును. 
    • 23. గవర్నమెంట్ సర్క్యులర్ మెమో నెం. 31948/ 398/పి.సి.-1/98-1 ది. 12.08.1998 ప్రకారము సరెండర్ ప్రజలకు లీవులో ఇంటి రిమ్ రిలీఫ్ (ఐ.ఆర్.) మొత్తము అనుమతించబడదు.
    • 24. గవర్నమెంట్ సర్క్యులర్ మెమొ నెం. 10472/ సి-199/ఎఫ్.ఆర్.-1/2010 ది. 29.04.2009 ఆర్థికశాఖ ప్రకారం ఆర్థిక సంవత్సరంలో ఏ నెలలో అయినా 12 లేదా 24 నెలల అంతరముతో సరెండర్ లీవును పొందుటకు అవకాశం కల్పిస్తూ, అంతకుముందు కొన్ని నెలలలో మాత్రమే సరెండర్ లీవును అనుమతించే విధానాన్ని రద్దు చేశారు. 
    • 25. గవర్నమెంట్ సర్కులర్ మెమొ నెం. 14781/ సి/ 278/ఎఫ్.ఆర్.1/2011 ది. 22.6.2011 ఆర్ధిక శాఖ ప్రకారం ఏ ఆర్ధ సంవత్సరము మొదట్లో అయినా 286 రోజులు కాని అంతకు మించి కాని ఎరనీవు ఖాతలో నిల్వ ఉన్న ఎడల 12/24 నెలల అంతరముతో సంబంధం లేకుండా 15/30 రోజుల సరెండర్ లీవును అనుమతి ఇస్తూ ఉ త్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం అంతకుముందు లాగా ప్రతి సంవత్సరము సరెండర్ లీవు మంజూరుకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చే విధానాన్ని తొలగించి నిరంతరాయంగా సరెండర్ లీవు తీసుకునే సౌకర్యం కల్పించటం జరిగినది. 
    • 26. ఒక ఉద్యోగి సర్వీసు నుండి రిటైర్ అయిన సందర్భంలో గరిష్టంగా 300 రోజులు ఎర్శవును ఎనౌక్యాష్ మెంట్ చేసుకొని నగదు పొందే సౌకర్యం కలదు. (జి.ఒ.ఎం.ఎస్.నెం. 208 ఆర్థిక శాఖ ది. 16.08.1975) 
    • 27. పై ఎనౌక్యాష్మంట్ సౌకర్యాన్ని ప్రీ మెచూర్ రిటైర్మెంట్ వారికి అనారోగ్య కారణాలతో రిటైర్ అయిన వారికి, కాంపెన్ సేషన్ పెన్షన్ పధకం ద్వారా రిటైర్ అయిన వారికి, ఒక ఉద్యోగికి పనిష్మెంట్ క్రింద కంపల్సరి రిటైర్మెంట్ ఆ అయిన వారికి, వర్తింపచేస్తూ జి.ఒ.నెం.  27.ది. 19.1.76 ఆర్ధిక శాఖ ద్వారా ఉత్తర్వులు వచ్చాయి. 
    • 28. స్వచ్చంద పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా ఈ లీవు ఎనౌక్యాష్ మెంట్ సౌకర్యాన్ని కల్పిస్తూ జి.ఒ. ఎం.ఎస్. నెం. 35 ఆర్థికశాఖ ది. 31.03.1977 ద్వారా ఉత్తర్వులు జారీ అయినాయి. 
    • 29. సర్యులర్ మెమో నెం. 92580-సి/ 1768/ ఎఫ్.ఆర్.1/76-1 ది. 31.3.1977 ఆర్థికశాఖ వారి ఉత్తర్వుల - ప్రకారం ఈ లీవు ఎన్క్యాష్మంటు మొత్తాన్ని ఉద్యోగి ఏ కార్యాలయంలో రిటైర్ అయినాడో ఆ కార్యాలయ అధిపతి (హెడ్ ఆఫ్ ది ఆఫీస్) మంజూరు చేయవచ్చును. 
    • 30. జి.ఒ.ఎం.ఎస్. నెం. 337 ఫైనాన్స్ ది. 29.09.1994 ప్రకారము గవర్నమెంట్ క్వార్టర్సు లేదా అద్దె లేని క్వార్టర్సులో ఉంటూ రిటైరైన ఉద్యోగులకు కూడా లీవు ఎనోక్యాష్మంటుకు ఇంటి అద్దె అలవెన్సు డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
    • 31 ఒ.ఎం.ఎస్. నెం. 38, ఫైనాన్స్ ది. 28.2. 1996 ప్రకారము రిటైరైన తేదీన అమలులో ఉన్న రేట్ల ప్రకారం 2.ఏ.. హెచ్.ఆర్.ఏ. సి.సి.ఏ.లు మొత్తం 300 లేదా అంతకంటే తక్కువగా ఎన్ని రోజులు ఎన్క్వాషమెంటు అనుమతించారో అన్ని రోజులకు పూర్తిగా అనుమతించడం జరిగినది.
    • 32. జి.ఓ.ఎం.ఎస్. నెం.11 ది. 15.01. 1997 ఆర్థిక శాఖ వారి ఉత్తర్వుల ప్రకారము రిటైర్ అయిన రోజుకి సస్పెన్షన్లో ఉన్న ఉద్యోగులు ఆ రోజుకి శాఖాపరమైన క్రమశిక్షణా కేసులు లేదా క్రిమినట్ కేసులు అపరిష్కృతముగా ఉన్న ఉద్యోగులు విషయంలో ఏదైనా కొంతమొత్తం అటువంటి కేసులలో నిరూపణ అయినచో రికవరీ వస్తుందని సంబంధిత అధికారి భావించిన ఎడల ఆ మొత్తము వరకు నిలుపుదల చేసి, మిగిలిన మొత్తాన్ని ఉద్యోగికి చెల్లించవచ్చు. అటువంటి సందర్భంలో నిలుపుదల చేసిన మొత్తములో గవర్నమెంటు రికవరీ ఏదైనా ఇచ్చినట్లైతే, ఆ మొత్తము పోను మిగిలిన మొత్తం పొందుటకు అర్హత కలిగి ఉండును. 
    • 33. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా విడిపోయిన తర్వాత, ఉమ్మడి రాష్ట్రంలో చేసిన మొత్తానికి ఒక బిల్లు, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పనిచేసిన కాలానికి సంపాదించిన ఎరన్ లీవుకు మరొక బిల్లు ఆయా హెడ్ ఆఫ్ ఎకౌంట్స్ క్రింద విడివిగా బిల్లులు పెట్టాలి. ఎంత మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి, ఎంత మొత్తం కొత్త రాష్ట్రానికి విభజింపబడినదో స్పష్టముగా ఉత్తర్వులలో పేర్కొనాలి. 
    • 34. సర్వీసులో ఉండి చనిపోయిన ఉద్యోగులకు కూడా గరిష్టంగా 300 రోజులకు మించకుండా ఎరన్ లీవు ఖాతాలో ఉన్న సెలవు ఎనౌక్యాష్మంట్ కి అనుమతిస్తూ జి.ఒ.ఎం.ఎస్.నెం. 186 ఆర్ధిక శాఖ, ది. 23.07.1975 ద్వారా 01.06.1975 నుండి అమలులోకి వచ్చినది. 
    • 35. జి.ఒ.ఎం.ఎస్. నెం. 337 ఫైనాన్స్ ది. 29.09.1994 ప్రకారము గవర్నమెంట్ క్వార్టర్సు, అద్దెలేని క్వార్టర్సులో ఉంటూ చనిపోయిన ఉద్యోగులకు ఆనాటికి ఉన్న ఇంటి అద్దె అలవెన్సు లీవ్ ఎనౌక్యాష్ మెంట్ కు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 
    • 36. జి.ఒ.ఎం.ఎస్. నెం. 38 ఫైనాన్స్ ది. 26.02. 1996 ప్రకారము మరణిచిన ఉద్యోగులకు కూడా మరణించిన తేదీ నాటికి అమలులో ఉన్న డి.ఎ., హెచ్. ఆర్.ఎ, సి.సి.ఎ.లను 300 రోజులకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయడమైనది. 
    • 37. జి.ఒ.ఎం.ఎస్. నెం. 342 ఫైనాన్స్ ది. 30.09.1994 ప్రకారం అర్ధవేతన సెలవు నగదుగా మార్చుకొనుటకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయడమైనది. అయితే ఎరనీవు మరియు హాఫ్ పే లీవు కలిపి 300 రోజులకు మించకుండా ఎనోక్యాష్ మెంట్ చేసుకోవచ్చును.
    • 38. అయితే ఈ ఉత్తర్వులు కంపల్సరీ రిటైర్మెంట్ అయినవారికి, రాజీనామా చేసినవారికి, సర్వీసునుండి వైదొలగిన వారికి, రిటైర్మెంట్ తరువాత రీ-ఎంప్లాయిమెంట్ పొందిన వారికి  వర్తించదు. (జి.ఒ.నెం. 342 ఫైనాన్స్ 30.09.94) 
    • 39. బేసిక్ పేలో 50% మరియు డి.ఎ.లో 50% కలిపి 30తో  భాగించినట్లయితే ఒక్కరోజు హాఫ్ పే లీవు ఎనోక్యాష్మంట్ మొత్తం వస్తుంది. ఎన్ని రోజులు సగం జీతం సెలవు ఎనోక్యాష్ మెంటుకి అనుమతించారో అన్ని రోజులకు పై మొత్తాన్ని లెక్కించి సగం జీతం సెలవు జీతం సెలవు చెల్లింపు చేయాలి. దీనితో ఇంటి అద్దె అలవెన్సు, ఇతర అలవెన్సులు రావు.
    • 40. పై విధముగా సర్వీసులో ఉన్న ఉద్యోగులకు సరెండర్ లీవు చెల్లింపు, అలాగే రిటైరైన వారికి, చనిపోయిన ఉద్యోగులకు ఎనో క్యాష్ మెంట్, అలాగే సగం జీతం సెలవు నగదు రూపముగా చెల్లింపు చేయుటకు సౌకర్యమును కల్పించటం జరిగినది.

    Important Orders on Surrender of Earned Leaves