పార్ట్ -8 ఉద్యోగుల - ఉపాధ్యాయుల సర్విస్ మాటర్ -సందేహాలు - సమాధానాలు
సందేహాలు - సమాధానాలు - 134 (716-720)
◼◼◼◼◼◼◼◼◼◼
716.❓సందేహం:
నేను 10వ తరగతి తర్వాత ఇంటర్ చదవకుండా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేశాను. తదుపరి బి.ఎడ్ చేసి ప్రస్తుతం Sgt గా పనిచేస్తున్నాను.నాకు పదోన్నతి ఇస్తారా??ఇవ్వరా??
✅సమాధానం:
స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి కి మీకు ఈ అర్హతలు సరిపోతాయి.
జాతీయ పండుగల రోజు జెండా వందనం కి హాజరు కాలేకపోతే చర్యలు తీసుకుంటారా??
✅సమాధానం:
సివిల్ సర్వీస్ కోడ్ ప్రకారం జెండా వందనం కి హజరు కాకపోతే జాతీయ జెండాను అగౌరవపరచినట్లుగా భావించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.
━━━━━━━━━━━━━━━━
718.❓సందేహం:
స్థానికత దేని ఆధారంగా నిర్ణయిస్తారు??
✅సమాధానం:
జీఓ.674 జీఏడీ: తేదీ:20.10.1975 రాష్టప్రతి ఉత్తర్వులలోని పేరా 7 ప్రకారం 4 నుంచి 10వ తరగతి వరకు గల 7 ఇయర్స్ కాలంలో ఎక్కువ భాగం ఎక్కడ చదివితే ఆ జిల్లానే లోకల్ గా పరిగణింపబడుతుంది.
━━━━━━━━━━━━━━━━
719.❓సందేహం:
నేను 1996 డిసెంబరు లో SGT గా చేరాను.ఐతే 2001 లో 142 రోజులు, 2005 లో 90 రోజులు అనారోగ్యంతో జీత నష్టం(ఇఓఎల్)సెలవు పెట్టాను.ఇంక్రిమెంట్ ఆగస్టుకి పోస్టుపోన్ అయ్యింది. ఐతే ఇంక్రిమెంట్ ను డిసెంబరు కి మార్చుకొనే అవకాశం లేదా??
✅సమాధానం:
జీఓ.43; తేదీ:5.2.76 ప్రకారం డిసెంబరుకి మార్చుకోవచ్చు. ఐతే సంబంధిత ప్రతిపాదనలు వైద్య ధ్రువపత్రాలతో మరియు SR తో DEO ద్వారా DSE కి పంపాలి.180 రోజుల వరకు DSE, అంతకు మించిన కాలానికి విద్యా శాఖ కార్యదర్శి అనుమతితో ఈఓయల్ కాలం ఇంక్రిమెంట్కి సర్వీసు గా పరిగణించబడుతుంది.
━━━━━━━━━━━━━━━━
720.❓సందేహం:
సస్పెన్షన్ కాలంలో ఉద్యోగి బ్రతికేది ఎలా??
✅సమాధానం:
సస్పెండ్ పీరియడ్ లో సబ్ స్టెన్స్ అలవెన్సు కింద సగం జీతం(హాఫ్ పే,హాఫ్ డీఏ,హాఫ్ హెచ్ఆర్ఏ)ఇస్తారు.
సందేహాలు - సమాధానాలు - 135 (721-725)
◼◼◼◼◼◼◼◼◼◼
721.❓సందేహం:
ఒక ఉద్యోగి 9 ఇయర్స్ పాటు ఉద్యోగానికి గైరు హాజరు అయ్యాడు.అతనికి మరల పోస్టింగ్ ఇస్తారా??
✅సమాధానం:
FR.18 మరియు aplr.1933 లోని రూల్ 5 ప్రకారం ఒక ఉద్యోగి 5 ఇయర్స్ పాటు గైర్హాజరు అయితే ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా భావించాలి.తిరిగి చేరాలి అంటే విద్యాశాఖ కార్యదర్శి నుండి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి.
722.❓సందేహం:
నేను SGT ను.75% అంగవైకల్యం తో బాధపడుతున్నాను.నేను ఉద్యోగం చేయలేకపోతున్నాను.నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. డిగ్రీ,బీ.ఎడ్ చేశాడు. నా ఉద్యోగం నా తమ్ముడు కి ఇప్పించవచ్చా??
✅సమాధానం:
మీ ఉద్యోగం ఎవ్వరికీ నేరుగా బదిలీ చేసే అవకాశం లేదు. కానీ జీఓ.66 జీఏడీ తేదీ:23.10.2008 ప్రకారం మీరు అనారోగ్యంతో విధులు నిర్వర్హించలేక పోతున్నారని జిల్లా మెడికల్ బోర్డు దృవీకరించిన, మిమ్మల్ని మెడికల్ ఇన్వాలిడేషన్ కింద రిటైర్ చేసి మీ తమ్ముడు కి జూనియర్ అసిస్టెంట్ పోస్టు కారుణ్య నియామకం కోటాలో ఇవ్వటానికి అవకాశం ఉంది.
━━━━━━━━━━━━━━━━
723.❓సందేహం:
ఉన్నత పాఠశాలలో బోధనేతర సిబ్బంది లేనప్పుడు వేసవి సెలవుల్లో SSC అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల విధులను ఎవరికి అప్పగించాలి??
✅సమాధానం:
ఆర్.సి.132 తేదీ:14.5.14 ప్రకారం బోధనేతర సిబ్బంది లేనప్పుడు వేసవిలో ssc భాద్యతను ఆ ఉన్నత పాఠశాలలోని సీనియర్ ఉపాధ్యాయుడికి అప్పగించాలి.
━━━━━━━━━━━━━━━━
724.❓సందేహం:
విద్యాహక్కు చట్టంలోని ఏ నిబంధన ప్రకారం 1 నుండి 8వ తరగతి వరకు పిల్లలను నేరుగా చేర్చుకోవచ్చు??
✅సమాధానం:
విద్యాహక్కు చట్టం 2009 లోని 2వ అధ్యాయం 4వ సెక్షన్ ప్రకారం 6--14 వయస్సు గల పిల్లలను వారి వయస్సుకి తగిన విధంగా 1--8 తరగతులలో నేరుగా చేర్చుకోవలసి ఉంటుంది.
━━━━━━━━━━━━━━━━
725.❓సందేహం:
గత సంవత్సరం 9వ తరగతి లో ముగ్గురు పిల్లలు వార్షిక పరీక్షలు రాయలేదు.కనీసం 20% హాజరు కూడా లేదు.వారిని ఈ సంవత్సరం 10 లోకి చేర్చుకోవచ్చా??
✅సమాధానం:
9,10 తరగతులు విద్యాహక్కు చట్టం పరిధిలోకి రావు.కావున కనీస హాజరు లేకుండా పై తరగతికి ప్రమోట్ చేయకూడదు.
◼◼◼◼◼◼◼◼◼◼
716.❓సందేహం:
నేను 10వ తరగతి తర్వాత ఇంటర్ చదవకుండా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేశాను. తదుపరి బి.ఎడ్ చేసి ప్రస్తుతం Sgt గా పనిచేస్తున్నాను.నాకు పదోన్నతి ఇస్తారా??ఇవ్వరా??
✅సమాధానం:
స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి కి మీకు ఈ అర్హతలు సరిపోతాయి.
పార్ట్ -8 ఉద్యోగుల - ఉపాధ్యాయుల సర్విస్ మాటర్ -సందేహాలు - సమాధానాలు
717.❓సందేహం:జాతీయ పండుగల రోజు జెండా వందనం కి హాజరు కాలేకపోతే చర్యలు తీసుకుంటారా??