AP Civil Services Conduct Rules 1964 in Telugu AP CS(Conduct Rules)1964 Explained in Telugu
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమావళి,1964 తెలుగు లో వివరణ మీ కోసం ఏ పి టీచర్స్ డాట్ ఇన్ వెబ్సైట్ వారిచే. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి ( ఏ పి సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ 1964) ఏ పి జీ వో ఎంఎస్ నెం. 468 జీఏడి తేది 17/04/1964 ద్వారా అమలులోకి వచ్చినవి. ఆంగ్లేయ ప్రభుత్వం మొట్టమొదటగా 1904 లో ‘ప్రభుత్వ సేవకుల ప్రవర్తనా నియమావళి’ ని రూపొందించింది ఆంధ్రప్రదేశ్ లో 1958 లో ‘ప్రభుత్వ సేవకుల ప్రవర్తనా నియమావళి’ అమలులోకి వచ్చింది. మళ్ళీ 1964 లో జీవో ఎంఎస్ నెం. 468 జీఏడి తేది 17/04/1964 ను అనుసరిస్తూ,‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వఉద్యోగుల ప్రవర్తన నియమావళి,1964’ ను అమలు లోకి తీసుకురావడం జరిగింది. తెలుగులో క్లుప్తంగా వివరణ కింద చూడగలరు
(జీవో ఎంఎస్ నెం. 468 జీఏడి తేది 17/04/1964)
ఆంగ్లేయ ప్రభుత్వం మొట్టమొదటగా 1904 లో ‘ప్రభుత్వ సేవకుల ప్రవర్తనా నియమావళి’ ని రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమావళి,1964 తెలుగు లో వివరణ మీ కోసం ఏ పి టీచర్స్ డాట్ ఇన్ వెబ్సైట్ వారిచే మీ కోసం కింద అందించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో 1958 లో ‘ప్రభుత్వ సేవకుల ప్రవర్తనా నియమావళి’ అమలులోకి వచ్చింది. మళ్ళీ 1964 లో జీవో ఎంఎస్ నెం. 468 జీఏడి తేది 17/04/1964 ను అనుసరిస్తూ,‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వఉద్యోగుల ప్రవర్తన నియమావళి,1964’ ను అమలు లోకి తీసుకురావడం జరిగింది.
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వఉద్యోగుల ప్రవర్తన నియమావళి,1964’ లో 29 నియమాలు వున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి, 1964 లోని 1(2) వ నియమం అనుసరించి ఈ నియమాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ లోని ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో సంబంధమున్న ఉద్యోగులకు వర్తిస్తాయి.
Rule 2 (5) :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి, 1964 లోని 2 (5) వ నియమం ప్రకారం ఈ నియమాలు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తాయి.
కుటుంబ సభ్యులనగా ప్రభుత్వ ఉద్యోగి యొక్క భార్య లేదా భర్త, కుమారుడు, కుమార్తె, సవతి కొడుకు, సవతి కూతురు.....వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగితో కలిసి నివసిస్తున్నా, నివశించలేకపోయినా & సంబంధీకులు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగితో కలిసి నివసిస్తున్ననూ........వీరందరూ ప్రభుత్వ ఉద్యోగి యొక్క కుటుంబ సభ్యులే.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి, 1964 లోని 3 వ నియమం ఈ విధంగా నిర్దేశిస్తున్నది.
Rule 3(1) :
1) ప్రతి ఉద్యోగి తన విధి పట్ల భక్తి భావం (DEVOTION TO DUTY) కలిగి వుండవలెను.
2) సంపూర్ణ నైతిక నిష్టత (ABSOLUTE INTEGRITY)
3) క్రమశిక్షణ (DISCIPLINE)
4) నిష్పాక్షికత (IMPARTIALITY),
5) ఔచిత్య భావన (SENSE OF PROPRIETY)
6) ఉత్తమ తీర్పు (BEST JUDGEMENT) కలిగి వుండవలెను.
సంపూర్ణ నైతిక నిష్టత ( ABSOLUTE INTEGRITY) అనగా...
G.O. MS No. 680 GAD Dated 01/11/2008 ప్రకారం,
Government direct that wherever CONNIVANCE (కుమ్మక్కు, రహస్య సమ్మతి), NEGLIGENCE (నిర్లక్ష్యం ), DERELICTION OF DUTY (కర్తవ్య ఉపేక్షత) is noticed, the competent authority shall take PROMPT ACTION for such MISCONDUCT (దుర్వర్తన) as per AP CIVIL SERVICES (CCA) RULES , 1991.
ప్రభుత్వ ఉద్యోగులు CONNIVANCE (కుమ్మక్కు, రహస్య సమ్మతి), NEGLIGENCE (నిర్లక్ష్యం ), DERELICTION OF DUTY (కర్తవ్య ఉపేక్షత) వంటి MISCONDUCT (దుర్వర్తన) లకు పాల్పడితే, AP CIVIL SERVICES (CCA) RULES , 1991 ( ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల (సీసీఏ) నియమావళి,1991) ప్రకారం సత్వరమే శిక్షించబడుతారు.
7) Rule 3(B) :
సత్వరత & మర్యాద (PROMPT & COURTEOUS)
8) Rule 3(5) :
తమ కింది సిబ్బందిలో సంపూర్ణ నైతిక నిష్టత (ABSOLUTE INTEGRITY)& విధి పట్ల భక్తి భావం (DEVOTION TO DUTY) పెంపొందించే బాధ్యత పై స్థాయి అధికారులపై వున్నది.
అలవాటు ప్రకారం కాలాయాపన చేయడం, సరిగ్గా పని చేయకపోవడం వంటి దుర్వర్తనాలు.....
విధి పట్ల భక్తి భావం (DEVOTION TO DUTY) లేకపోవడం కిందికి వస్తాయి.
(G.O. MS No. 381, GAD Dated 18/12/2003)
9) Rule 6(A) :
రూ 10,000 దాటిన విదేశీ నిధులను స్వీకరించిన 15 రోజులలోపు తెలపాలి. (G.O. MS No. 354, GAD Dated 08/08/1996)
10) Rule 9 Sub Rule 7 :
· ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగంలో చేరిన వెంటనే, (చివరి గ్రేడు ఉద్యోగులు తప్ప) ఆస్తుల ప్రకటన (STATEMENT OF PROPERTY) చేయాలి.
Rule 9 Sub Rule 7 లోని అనుబంధం 1 & 2 లో రూ 1 లక్ష దాటిన చరాస్తుల వివరాలు, ఎంత విలువైనా సరే స్థిరాస్తుల వివరాలు ప్రకటించాలి. (G.O. MS No. 528, GAD Dated 19/08/2008 ప్రకారం రూ 20,000 చరాస్తుల విలువను రూ 1 లక్ష కు పెంచడమైనది)
అలాగే ప్రతి సంవత్సరం జనవరి 15 లోపల , అదే అనుబంధం 1 & 2 లో స్థిరాస్తుల చరాస్తుల వివరాలు ప్రకటించాలి.( Circular Memo No. 695/Ser C/2006 GAD, Dated 12/10/2006)
12) ప్రజలకు సత్వరంగా & మర్యాదపూర్వకంగా సేవలందించాలి.
13) మధ్యాహ్న భోజన విరామ సమయంలో హుందా ప్రవర్తన కనబరచాలి.
14) రాజకీయ పక్షాల ప్రదర్శనలలో పాల్గొనకుండా వుండాలి
15) రాజకీయ తటస్థత పాటించాలి.
16) అప్పులు తీస్కొనడం, దివాలా కు పాల్పడడం లాంటి వాటికి దూరంగా వుండాలి.
17) ఏదైనా ఋణాల బకాయిల చెల్లింపులో గానీ, మిమ్మల్ని దివాలా అయినట్టు ప్రకటించడంలో గానీ వున్న న్యాయపరమైన అంశాలన్నీ దాపరికం లేకుండా ఉన్నతాధికారులకు నివేదించాలి.
18) పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నప్పుడు (ARREST), క్రిమినల్ న్యాయస్థానం శిక్ష విధించినపుడు ఉన్నతాధికారులకు నివేదించవలెను.
19) ప్రభుత్వానికి విశ్వసనీయమైన సేవకుడిలా వుండాలి.
20) అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం శ్రమించాలి
21) ప్రజలకు ‘నిర్ణీత కాల వ్వవధి’ (SLA = SERVICE LEVEL AGREEMENT) లోపల సేవలు అందజేయబడాలి.
22) సమయపాలన పాటించాలి
23) ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ సామాగ్రిని జాగ్రత్తగా చూసుకోవలెను.
24) సానుకూల దృక్పథం కలిగి వుండాలి
25) నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
26) తాజా సమాచారం, అభివృద్ధి పరిచిన పరిజ్ఞానం కలిగి వుండవలెను
27) మొదట వచ్చిన వారికి ప్రాధాన్యతను అమలు చేయాలి
28) వృత్తి పని పట్టిక (JOB CHART) లోని విధులు, బాధ్యతలు క్షుణ్ణంగా తెలుసుకుని అమలు చేయాలి
29) ముందస్తు అనుమతి & మంజూరీతోనే యాదృచ్ఛిక సెలవు (CASUAL LEAVE) తీసుకోవాలి.
30) చక్కని ఆదర్శ వేషధారణ కలిగి వుండాలి.
31) కార్యాలయాల్లో, కార్యాలయ పరిసరాలలో, గ్రామాలలో పరిశుభ్రతకు, పచ్చదనానికి ప్రాముఖ్యత ఇవ్వాలి
32) సున్నితమైన కులపరమైన, మతపరమైన, ఆచార సంబంధమైన అంశాలలో సమభావన, సహనభావన కలిగి వుండాలి.
33) రాగద్వేషాలకు, పూర్వ ఉద్వేగాలకు అతీతంగా వుండాలి.
34) ప్రజలందరినీ తారతమ్యాలు లేకుండా సమానాదరంతో గౌరవించాలి
35) ప్రజలకు నిత్యం అందుబాటులో, తలలో నాలుకలాగా వుండాలి.
36) ఎల్లవేళలా ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి.
37) ప్రజల కోసమే మనం, ప్రజలతోనే మనం అన్న భావనతో పని చేయాలి.
38) పని చేసే చోటే నివాసం వుండాలి.
1) అనుచిత ప్రవర్తన కలిగి వుండరాదు (UNBECOMING MANNER) - (Rule 3(2))
అనుచిత ప్రవర్తన (UNBECOMING MANNER) అనగా
· అమర్యాద వైఖరి (UNMATTERLY ATTITUDE)
· అవిధేయత (INSUBORDINATION)
· హుందా ప్రవర్తన లేకపోవడం (LACK OF DECORUM)
· సోమరితనం (LAZINESS)
· అవినీతి అలవాట్లు (CORRUPT HABITS)
· బాధ్యతలను తప్పించుకోవడం (SHIRKING OF RESPONSIBILITY )
2) ప్రభుత్వ ప్రతిష్ఠతకు భంగకరమయ్యే ప్రవర్తన (DEROGATORY TO THE PRESTIGE OF THE GOVERNMENT) కలిగి వుండరాదు - (Rule 3(2))
3) తన అధికార స్థానం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చునట్లు (EMBARASSMENT) ఏ ప్రభుత్వ ఉద్యోగి ప్రవర్తించరాదు - (Rule 3(3))
4) పై అధికారుల ఆదేశాలు కొరకో, వారి ఆమోదం కొరకో కారణాలు పెట్టి విధులు ఎగవేయరాదు (EVADE) - ( Rule 3(4) )
5) 14 ఏళ్ల లోపు పిల్లల చేత పనులు చేయించరాదు - ( Rule 3(6) ) (G.O. MS No. 555, GAD, Dated 14/12/2005).
6) భారత దేశపు సార్వభౌమ్యాధికారానికి, సమగ్రతకు ప్రతికూలమైన కార్యకాలాపాలలలో పాల్గొనరాదు , అట్టి సంఘాలలో సభ్యులుగా వుండరాదు - (Rule 3(A))
7) అధికార విధులలో అమర్యాదగా వ్యవహించరాదు - (Rule (3B)a)
8) కాలాయాపన యుక్తులకు (DILATORY TACTICS) & ఉద్దేశపూర్వకంగా కాలాయాపణకు (DELAY)పాల్పడరాదు - ( Rule 3(Bb) ) - (G.O. MS No. 72, GAD, Dated 03/03/1998).
9) సాటి మహిళా ఉద్యోగులతో అమర్యాదగా ప్రవర్తించరాదు - (Rule 3(C))
10) మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడరాదు - (Rule 3(C)a,b,c,)
11) అసభ్య చిత్రాలను చూపుట నేరం - (Rule 3(C)d,)
12) లైంగిక సూచికలు,సైగలు శిక్షార్హం - (Rule 3(C)e,)
(Rule 3(C)) లోని నిషేధిత దుర్వర్తనములకు బాధ్యులైన వారి మీద బారత శిక్షా స్మృతి, 1860 ఇతర చట్టాల ప్రకారమూ శిక్షార్హులు –
(G.O. MS No. 322, GAD, Dated 19/12/2005).
13) సమ్మెలు నిషేధం - (Rule 4)
సమ్మెలలో, లేదా, అలాంటివి, లేదా, సమ్మెలకు ప్రేరణ కల్గించే వాటిల్లో పాల్గొనరాదు
14) అనుమతి లేకుండా గైర్హాజరీ కాకూడదు - (Rule 4(1))
15) అధికారిపై/ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడానికై పని యందు నిర్లక్ష్యం లేదా పని చేయకపోవడం చేయరాదు - (Rule 4(2))
16) అధికారిపై/ప్రభుత్వంపై వత్తిడి తేవడానికై ‘నిరాహారాదీక్ష’ చేయరాదు - (Rule 4(3))
17) రాజకీయ పక్షాల ప్రదర్శనలలో పాల్గొనరాదు - (Rule 5)
18) వస్తు రూపేణా, డబ్బు రూపేణా కానుకలు స్వీకరించరాదు, సేవలు పొందరాదు - (Rule 6)
G.O. MS No. 205, GAD, Dated 05/06/1998 ప్రకారం ......
ఏదైనా అధికారిక పని చేయడానికి, చేయకుండా వుండడానికి ఏదైనా ప్రతిఫలం (GRATIFICATION) తీసుకున్నట్లు నిరూపణ అయితే, అర్హతతో కూడిన తొలగింపు (REMOVAL) లేదా అనర్హతతో కూడిన తొలగింపు (DISMISSAL) శిక్షగా విధిస్తారు.
19) చందాలు వసూలు చేయరాదు - (Rule 7)
20) అప్పులు ఇవ్వడం, తీస్కోవడం, దివాలా తీయడం (INSOLVENCY ) వంటివి నిషేధము - (Rule 8)
21) అనుమతి లేకుండా స్థిరాస్తుల, చరాస్తుల కొనుగోలు & అమ్మకం చేయరాదు - (Rule 9)
22) ప్రైవేటు వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు నిషేధము - (Rule 10)
23) ప్రైవేటు కంపెనీల నిర్వహణ, తోడ్పాటు చేయరాదు - (Rule 11)
24) ప్రైవేటు ఉద్యోగాలు చేయరాదు - (Rule 12)
25) పుస్తకాల ప్రచురణ నిషేధం - (Rule 13)
26) రహస్య పత్రాలను & అధికారిక సమాచారాన్ని వెల్లడి చేయరాదు www.apteachers.in- (Rule 14)
27) వార్తాపత్రికలతో సంబంధాలు వుండరాదు - (Rule 15)
28) ఆకాశవాణి ప్రసారాలలో పాల్గొనడం, వార్తా పత్రికలకు, వార పత్రికలకు వ్యాసాలు, వార్తలు రాయడం నిషేధం - (Rule 16)
29) ప్రభుత్వ విధానాలను, కార్యక్రమాలను, పథకాలను, చర్యలను విమర్శించరాదు - (Rule 17)
30) ఏదైనా కమిటీ, కమీషన్ & ఇతర అధికార సంస్థల ముందు సాక్ష్యం ఇవ్వడం నిషేధం - (Rule 18)
31) రాజకీయాలలో, ఎన్నికలలో పాల్గొనడం నిషేధం - (Rule 19)
32) నేరసంబంధ చర్యలను, వ్యక్తులను సమర్థించరాదు (VINDICATION OF ACTS & CHARACTERS) - (Rule 20)
33) బంధువుల దగ్గర & బంధువుల క్రింద ఉద్యోగం చేయరాదు - (Rule 21)
34) ప్రైవేటు సంస్థలలో కుటుంబ సభ్యలకు ఉద్యోగాలు నిషేధం - (Rule 22)
35) తన అధికార హోదాను తన కొరకు, తన బంధువుల కొరకు, తన మీద ఆధారపడ్డ వాళ్ళ కొరకు ఉపయోగించరాదు - (Rule 23)
36) తన స్వప్రయోజనాలకై, తన ఉన్నతాధికారులపై వత్తిడి తీసుకొనరాదు, పలుకుబడిని ఉపయోగించరాదు (INFLUENCING AUTHORITIES FOR FURTHERANCE OF INTERESTS - (Rule 24)
37) రెండవ వివాహం (BIGAMY) చేసుకొనరాదు - (Rule 25)
38) వరకట్నం ఇవ్వడం, తీసుకొనడమూ రెండూ నిషేధమే - (Rule 25 A) (వరకట్న నిషేధ చట్టం, 1961)
39) మత్తపానీయాల సేవనం నిషేధము. బహిరంగ ప్రదేశాల్లో మత్తు పదార్ధాల సేవనం చేయరాదు - (Rule 26)
40) ఇతరులకు తమ యూజర్ ఐడి & పాస్ వర్డ్ ఇవ్వరాదు
G.O. MS No.458, GAD, Dated 22/09/2009 ప్రకారం, AP CS (CCA) RULES ,1991 (ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (సీసీఏ) నియమావళి,1991) లోని Rule 9 , Clause 10 (DISMISSAL) కు చేసిన సవరణ మేరకు........
· ధన దుర్వినియోగం (MISAAPPROPRIATION),
· లంచం తీసుకోవడం (BRIBERY),
· రెండవ వివాహం చేసుకోవడం (BIGAMY),
· అవినీతికి పాల్పడడం (CORRUPTION),
· నైతిక దుర్వర్తన (MORAL TURPITUDE),
· దొంగ సంతకాలు (FORGERY),
· మహిళల గౌరవ భంగం (OUTRAGING THE MODESTY OF THE WOMEN)
వంటి దుర్వర్తనాలు (MISCONDUCT) నిరూపణ అయితే,
‘అనర్హతతో కూడిన తొలగింపు’ (DISMISSAL) ను ‘భారీ దండన’గా (MAJOR PENALTY) విధిస్తారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమావళి,1964 తెలుగు లో వివరణ మీ కోసం ఏ పి టీచర్స్ డాట్ ఇన్ వెబ్సైట్ వారిచే. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి ( ఏ పి సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ 1964) ఏ పి జీ వో ఎంఎస్ నెం. 468 జీఏడి తేది 17/04/1964 ద్వారా అమలులోకి వచ్చినవి. ఆంగ్లేయ ప్రభుత్వం మొట్టమొదటగా 1904 లో ‘ప్రభుత్వ సేవకుల ప్రవర్తనా నియమావళి’ ని రూపొందించింది ఆంధ్రప్రదేశ్ లో 1958 లో ‘ప్రభుత్వ సేవకుల ప్రవర్తనా నియమావళి’ అమలులోకి వచ్చింది. మళ్ళీ 1964 లో జీవో ఎంఎస్ నెం. 468 జీఏడి తేది 17/04/1964 ను అనుసరిస్తూ,‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వఉద్యోగుల ప్రవర్తన నియమావళి,1964’ ను అమలు లోకి తీసుకురావడం జరిగింది. తెలుగులో క్లుప్తంగా వివరణ కింద చూడగలరు
AP Civil Services Conduct Rules 1964 in Telugu AP CS(Conduct Rules)1964 Explained in Telugu
ANDHRA PRADESH CIVIL SERVICES (CONDUCT RULES), 1964(జీవో ఎంఎస్ నెం. 468 జీఏడి తేది 17/04/1964)
ఆంగ్లేయ ప్రభుత్వం మొట్టమొదటగా 1904 లో ‘ప్రభుత్వ సేవకుల ప్రవర్తనా నియమావళి’ ని రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమావళి,1964 తెలుగు లో వివరణ మీ కోసం ఏ పి టీచర్స్ డాట్ ఇన్ వెబ్సైట్ వారిచే మీ కోసం కింద అందించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో 1958 లో ‘ప్రభుత్వ సేవకుల ప్రవర్తనా నియమావళి’ అమలులోకి వచ్చింది. మళ్ళీ 1964 లో జీవో ఎంఎస్ నెం. 468 జీఏడి తేది 17/04/1964 ను అనుసరిస్తూ,‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వఉద్యోగుల ప్రవర్తన నియమావళి,1964’ ను అమలు లోకి తీసుకురావడం జరిగింది.
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వఉద్యోగుల ప్రవర్తన నియమావళి,1964’ లో 29 నియమాలు వున్నాయి.
- భారత రాజ్యాంగంలోని 309 అధికరణ లోని నిబంధనను అనుసరించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారికి ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనను నియంత్రించడానికి అధికారం కలిగి వున్నారు.
- ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేయాలో, ఏం చేయకూడదో వివరించబడినవి.
- విధుల నిర్వహణలో ఉద్యోగుల ప్రవర్తన మరియు ప్రజలతో మెలిగే తీరు బట్టి ప్రభుత్వం యొక్క సామర్థ్యం ఆధారపడి వుంటుంది.
- ఉద్యోగుల దుర్వర్తన ప్రభుత్వం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి, ప్రభుత్వ ప్రయోజనాల రీత్యా, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, ప్రవర్తనా నియమావళిని రూపొందించడం ద్వారా ఉద్యోగుల ప్రవర్తనను ప్రభుత్వం నియంత్రిస్తుంది.
- దుర్వర్తనకు పాల్పడ్డ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి, 1964 కింద బాధ్యులవుతారు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి, 1964, ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగ ప్రస్థానం లో చేయవలసిన & చేయకూడని పనులను విశదీకరించినది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి, 1964 లోని 1(2) వ నియమం అనుసరించి ఈ నియమాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ లోని ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో సంబంధమున్న ఉద్యోగులకు వర్తిస్తాయి.
Rule 2 (5) :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి, 1964 లోని 2 (5) వ నియమం ప్రకారం ఈ నియమాలు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తాయి.
కుటుంబ సభ్యులనగా ప్రభుత్వ ఉద్యోగి యొక్క భార్య లేదా భర్త, కుమారుడు, కుమార్తె, సవతి కొడుకు, సవతి కూతురు.....వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగితో కలిసి నివసిస్తున్నా, నివశించలేకపోయినా & సంబంధీకులు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగితో కలిసి నివసిస్తున్ననూ........వీరందరూ ప్రభుత్వ ఉద్యోగి యొక్క కుటుంబ సభ్యులే.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి, 1964 లోని 3 వ నియమం ఈ విధంగా నిర్దేశిస్తున్నది.
చేయవలసిన పనులు (Dos) :
Rule 3(1) :
1) ప్రతి ఉద్యోగి తన విధి పట్ల భక్తి భావం (DEVOTION TO DUTY) కలిగి వుండవలెను.
2) సంపూర్ణ నైతిక నిష్టత (ABSOLUTE INTEGRITY)
3) క్రమశిక్షణ (DISCIPLINE)
4) నిష్పాక్షికత (IMPARTIALITY),
5) ఔచిత్య భావన (SENSE OF PROPRIETY)
6) ఉత్తమ తీర్పు (BEST JUDGEMENT) కలిగి వుండవలెను.
సంపూర్ణ నైతిక నిష్టత ( ABSOLUTE INTEGRITY) అనగా...
- · నిజాయితీ (HONESTY)
- · స్వచ్ఛత (PURITY)
- · ఋజుత్వం (UPRIGHTNESS)
- · సమయపాలన(PUNCTUALITY)
- · సత్వరత (PROMPTNESS)
- · సక్రమ హాజరీ ( REGULAR ATTENDANCE)
- · విధేయత (OBEDIENCE)
- · పరిశుభ్రత (CLEANLINESS)
- · ప్రశాంతత & హుందా ప్రవర్తన ( QUIT & DIGNIFIED BEHAVIOUR)
- · పరస్పర గౌరవం (MUTUAL COURTESY)
- · అధికార సమాచారాన్ని, రహస్యాలను వెల్లడి చేయకుండా వుండడం(NON DIVULGENCE OF OFFICIAL INFORMATION & SECRETS)
- · క్రమపద్ధతి (ORDERLINESS).
G.O. MS No. 680 GAD Dated 01/11/2008 ప్రకారం,
Government direct that wherever CONNIVANCE (కుమ్మక్కు, రహస్య సమ్మతి), NEGLIGENCE (నిర్లక్ష్యం ), DERELICTION OF DUTY (కర్తవ్య ఉపేక్షత) is noticed, the competent authority shall take PROMPT ACTION for such MISCONDUCT (దుర్వర్తన) as per AP CIVIL SERVICES (CCA) RULES , 1991.
ప్రభుత్వ ఉద్యోగులు CONNIVANCE (కుమ్మక్కు, రహస్య సమ్మతి), NEGLIGENCE (నిర్లక్ష్యం ), DERELICTION OF DUTY (కర్తవ్య ఉపేక్షత) వంటి MISCONDUCT (దుర్వర్తన) లకు పాల్పడితే, AP CIVIL SERVICES (CCA) RULES , 1991 ( ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల (సీసీఏ) నియమావళి,1991) ప్రకారం సత్వరమే శిక్షించబడుతారు.
7) Rule 3(B) :
సత్వరత & మర్యాద (PROMPT & COURTEOUS)
తమ కింది సిబ్బందిలో సంపూర్ణ నైతిక నిష్టత (ABSOLUTE INTEGRITY)& విధి పట్ల భక్తి భావం (DEVOTION TO DUTY) పెంపొందించే బాధ్యత పై స్థాయి అధికారులపై వున్నది.
అలవాటు ప్రకారం కాలాయాపన చేయడం, సరిగ్గా పని చేయకపోవడం వంటి దుర్వర్తనాలు.....
విధి పట్ల భక్తి భావం (DEVOTION TO DUTY) లేకపోవడం కిందికి వస్తాయి.
(G.O. MS No. 381, GAD Dated 18/12/2003)
9) Rule 6(A) :
రూ 10,000 దాటిన విదేశీ నిధులను స్వీకరించిన 15 రోజులలోపు తెలపాలి. (G.O. MS No. 354, GAD Dated 08/08/1996)
10) Rule 9 Sub Rule 7 :
· ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగంలో చేరిన వెంటనే, (చివరి గ్రేడు ఉద్యోగులు తప్ప) ఆస్తుల ప్రకటన (STATEMENT OF PROPERTY) చేయాలి.
Rule 9 Sub Rule 7 లోని అనుబంధం 1 & 2 లో రూ 1 లక్ష దాటిన చరాస్తుల వివరాలు, ఎంత విలువైనా సరే స్థిరాస్తుల వివరాలు ప్రకటించాలి. (G.O. MS No. 528, GAD Dated 19/08/2008 ప్రకారం రూ 20,000 చరాస్తుల విలువను రూ 1 లక్ష కు పెంచడమైనది)
అలాగే ప్రతి సంవత్సరం జనవరి 15 లోపల , అదే అనుబంధం 1 & 2 లో స్థిరాస్తుల చరాస్తుల వివరాలు ప్రకటించాలి.( Circular Memo No. 695/Ser C/2006 GAD, Dated 12/10/2006)
- 1) ముందస్తు అనుమతితోనే , ఎంత విలువైనా సరే స్థిరాస్తులు, రూ 1 లక్ష దాటే చరాస్తుల కొనుగోలు కానీ, అమ్మకం కానీ చేయాలి.
- 2) 30 రోజుల ముందుగానే అనుమతి కొరకు దరఖాస్తు చేయాలి.
- 3) ఒక నెల ముందుగానే, కొనుగోలుకు కానీ, అమ్మకం కొరకు కానీప్రభుత్వానికి అనుమతి కొరకు దరఖాస్తు చేస్కున్న తర్వాత, (రశీదు తప్పనిసరి), ఒక నెల లోపు అనుమతి రాకపోయినా... అమ్మకానికి, కొనుగోలుకు పాల్పడవచ్చును. (G.O. MS No. 26, GAD, Dated 20/01/1998).
12) ప్రజలకు సత్వరంగా & మర్యాదపూర్వకంగా సేవలందించాలి.
13) మధ్యాహ్న భోజన విరామ సమయంలో హుందా ప్రవర్తన కనబరచాలి.
14) రాజకీయ పక్షాల ప్రదర్శనలలో పాల్గొనకుండా వుండాలి
15) రాజకీయ తటస్థత పాటించాలి.
16) అప్పులు తీస్కొనడం, దివాలా కు పాల్పడడం లాంటి వాటికి దూరంగా వుండాలి.
17) ఏదైనా ఋణాల బకాయిల చెల్లింపులో గానీ, మిమ్మల్ని దివాలా అయినట్టు ప్రకటించడంలో గానీ వున్న న్యాయపరమైన అంశాలన్నీ దాపరికం లేకుండా ఉన్నతాధికారులకు నివేదించాలి.
18) పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నప్పుడు (ARREST), క్రిమినల్ న్యాయస్థానం శిక్ష విధించినపుడు ఉన్నతాధికారులకు నివేదించవలెను.
19) ప్రభుత్వానికి విశ్వసనీయమైన సేవకుడిలా వుండాలి.
20) అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం శ్రమించాలి
21) ప్రజలకు ‘నిర్ణీత కాల వ్వవధి’ (SLA = SERVICE LEVEL AGREEMENT) లోపల సేవలు అందజేయబడాలి.
22) సమయపాలన పాటించాలి
23) ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ సామాగ్రిని జాగ్రత్తగా చూసుకోవలెను.
24) సానుకూల దృక్పథం కలిగి వుండాలి
25) నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
26) తాజా సమాచారం, అభివృద్ధి పరిచిన పరిజ్ఞానం కలిగి వుండవలెను
27) మొదట వచ్చిన వారికి ప్రాధాన్యతను అమలు చేయాలి
28) వృత్తి పని పట్టిక (JOB CHART) లోని విధులు, బాధ్యతలు క్షుణ్ణంగా తెలుసుకుని అమలు చేయాలి
29) ముందస్తు అనుమతి & మంజూరీతోనే యాదృచ్ఛిక సెలవు (CASUAL LEAVE) తీసుకోవాలి.
30) చక్కని ఆదర్శ వేషధారణ కలిగి వుండాలి.
31) కార్యాలయాల్లో, కార్యాలయ పరిసరాలలో, గ్రామాలలో పరిశుభ్రతకు, పచ్చదనానికి ప్రాముఖ్యత ఇవ్వాలి
32) సున్నితమైన కులపరమైన, మతపరమైన, ఆచార సంబంధమైన అంశాలలో సమభావన, సహనభావన కలిగి వుండాలి.
33) రాగద్వేషాలకు, పూర్వ ఉద్వేగాలకు అతీతంగా వుండాలి.
34) ప్రజలందరినీ తారతమ్యాలు లేకుండా సమానాదరంతో గౌరవించాలి
35) ప్రజలకు నిత్యం అందుబాటులో, తలలో నాలుకలాగా వుండాలి.
36) ఎల్లవేళలా ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి.
37) ప్రజల కోసమే మనం, ప్రజలతోనే మనం అన్న భావనతో పని చేయాలి.
38) పని చేసే చోటే నివాసం వుండాలి.
చేయకూడని పనులు (DONTs):