Inter-Se-Seniority in Promotions - APSSR 1996 Rule 33 Senior Junior in Inter se Seniority విలీన సీనియారిటి / అంతర్గత సీనియారిటి (Inter-se-Seniority) లెక్కించే పద్దతి. విలీన సీనియారిటి / అంతర్గత సీనియారిటి (Inter-se-Seniority) ఎలా నిర్ణయిస్తారు?
రాష్ట్ర ఉన్నత ఉద్యోగ శ్రేణి మరియు దిగువ స్థాయి ఉద్యోగ సేవల నియమావళులు 1996 (A.P. State and Subordinate Services rules 1996) లోని, నియమావళి 33 యందు తెలియజేసిన పద్ధతి ప్రకారం చేయాలి. అంటే ఒక యూనిట్లో నియామకము పొందిన తర్వాత, ఆ వర్గం (Category) చెందిన ఉద్యోగుల విలీన / అంతర్లీణ (Inter-se-Seniority) ని ఏ విధంగా నిర్ణయించాలో విశదీకరించారు.
A: వారి సీనియారిటి ఎ.పి. స్టేటు సబార్డినేటు సర్వీసులు నియమావళి 1996 (A.P.State and Subordinate Services rules 1996) లోని, నియమావళి 33 యందు తెలియజేసిన పద్ధతి ప్రకారం చేయాలి. అంటే ఒక యూనిట్లో నియామకము పొందిన తర్వాత, ఆ వర్గం (Category) లో ఆ వ్యక్తి ఉద్యోగంలో సకాలంలో చేరిన తేదిని పరిగణనలోనికి తీసుకొని అతని సీనియారిటిని నిర్ణయిస్తారు. ఆ విధంగా ఆ యూనిట్లో నిర్దేశించిన సీనియారిటికి భంగం కలుగకుండ, విలీన / అంతర్లీణ సీనియారిటి నిర్ణయించవలసియుంది (Rule 34)
Inter-Se-Seniority in Promotions - APSSSR 1996 Rule 33 Senior Junior in Inter se Seniority
విలీన సీనియారిటి / అంతర్గత సీనియారిటి (Inter-se-Seniority) ఎలా నిర్ణయిస్తారు?రాష్ట్ర ఉన్నత ఉద్యోగ శ్రేణి మరియు దిగువ స్థాయి ఉద్యోగ సేవల నియమావళులు 1996 (A.P. State and Subordinate Services rules 1996) లోని, నియమావళి 33 యందు తెలియజేసిన పద్ధతి ప్రకారం చేయాలి. అంటే ఒక యూనిట్లో నియామకము పొందిన తర్వాత, ఆ వర్గం (Category) చెందిన ఉద్యోగుల విలీన / అంతర్లీణ (Inter-se-Seniority) ని ఏ విధంగా నిర్ణయించాలో విశదీకరించారు.
A: వారి సీనియారిటి ఎ.పి. స్టేటు సబార్డినేటు సర్వీసులు నియమావళి 1996 (A.P.State and Subordinate Services rules 1996) లోని, నియమావళి 33 యందు తెలియజేసిన పద్ధతి ప్రకారం చేయాలి. అంటే ఒక యూనిట్లో నియామకము పొందిన తర్వాత, ఆ వర్గం (Category) లో ఆ వ్యక్తి ఉద్యోగంలో సకాలంలో చేరిన తేదిని పరిగణనలోనికి తీసుకొని అతని సీనియారిటిని నిర్ణయిస్తారు. ఆ విధంగా ఆ యూనిట్లో నిర్దేశించిన సీనియారిటికి భంగం కలుగకుండ, విలీన / అంతర్లీణ సీనియారిటి నిర్ణయించవలసియుంది (Rule 34)
అదే విధంగా నేరుగ నియామకము (Direct Recruitment) పొందిన ఉద్యోగి అనుమతించిన కాలంలోపుల ఎప్పుడు చేరినప్పటికి, అతని నియామకాలు జారీ చేసిన వ్యవస్థ (Recruiting Agency) నిర్ణయించిన శ్రేణి/స్థితి (Rank) ఆధారంగా సీనియారిటి నిర్ణయించబడుతుంది. కొత్తగా నియమించిన వారు ఉద్యోగంలో చేరుటకు ప్రస్తుతమున్న నియమావళుల మేరకు, ఉద్యోగ ఉత్తర్వులు (రిజిష్టర్డు పోస్టు తిరుగు రసీదు పద్ధతి) (Registered Post - Acknowledgement Due) ద్వారా పంపబడిన తేది నుంచి 30 రోజుల లోపల ఉద్యోగంలో చేరవలసి యున్నది. (Rule 11(a) A.P. State and Subordinate Services rules 1996) & (G.O.Ms.No.340 G.A (Ser. D) department dated 23-7-1999 W.E.F. 26-4-1999)
ఈ విషయంలో చాలా మంది ఉద్యోగులకు సరియైన అవగాహన లేక, ర్యాంకింగ్ నిమిత్తం లేకుండా, ఎవరు ముందు చేరితే వారే సీనియారిటీలో ముందుంటారని భావిస్తు వుంటారు. అది సరికాదు. నిర్దేశించిన సకాలంలో ఎప్పుడు చేరినప్పటికి, ర్యాంకింగు ప్రకారమే సీనియారిటీ నిర్ణయించబడుతుంది