Income Tax FY 2022-23 in Telugu: ఆదాయ పన్ను 2022-23 గణన తెలుగులో పూర్తి వివరణ

Income Tax 2022-23 in Telugu: Income Tax for the Financial Year 2022-23 (Assessment Year 2023-24) Complete information in Telugu by www.apteachers.in ఆదాయ పన్ను 2022-23 గణన తెలుగులో పూర్తి వివరణ.
Income Tax FY 2022-23 in Telugu: ఆదాయ పన్ను 2022-23 గణన తెలుగులో పూర్తి వివరణ

Income Tax FY 2022-23 in Telugu: ఆదాయ పన్ను 2022-23 గణన తెలుగులో పూర్తి వివరణ 

ఆదాయ పన్ను 2022-23 గణన తెలుగులో పూర్తి వివరణ

ఆదాయపు పన్ను చట్టం-1961 సెక్షన్ 192 ప్రకారం ప్రతి ఉద్యోగి తన వేతన ఆదాయం, ఇతర ఆదాయాలు కలిపి మొత్తం ఆదాయంపై ప్రతి సంవత్సరం నిబంధనల మేరకు పన్ను చెల్లించాలి. 2022-23 ఆర్థిక సంవత్సరమునకు సంబంధించి (01.04.2022 నుండి 31.03.2023 వరకు గల ఆదాయము) ఉద్యోగులు చెల్లింపు చేయవలసిన ఆదాయపు పన్ను లెక్కింపులోని ముఖ్యాంశాలను పరిశీలిద్దాము.
ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను లెక్కింపు విధానము రెండు విధాలుగా వర్గీకరించారు.
  • 1. మొదటి విధానం (సెక్షన్ 115 BAC): ఈ విధానంలో మిన హాయింపులు గాని, తగ్గింపులు గాని ఏవి అనుమతించబడవు. ఈ విధానంలో పన్ను లెక్కింపు అన్ని వయస్సుల వారికి ఒకే విధంగా ఉంటుంది
  • 2. రెండవ విధానం : ఈ విధానంలో మినహాయింపులు, తగ్గింపులు గతంలో మాదిరిగానే వర్తిస్తూ గత సంవత్సరం విధంగానే ఆదాయపు పన్ను రేట్లు కొనసాగింపు. పై రెండింటిలో ఉద్యోగి తనకిష్టమైన దానిని ఎన్నుకోవచ్చు

కొత్త టాక్స్ శ్లాబ్ విధానంలో ఆదాయ పన్ను 2022-23 శ్లాబ్ రేట్స్

ఐటీ 2022-23 గణన కొత్త టాక్స్ శ్లాబ్లు
ఆదాయం చెల్లించాల్సిన టాక్స్
2.5 లక్షల వరకు టాక్స్ లేదు
2.5 లక్షల నుండి 5 లక్షల వరకు 5% టాక్స్ (రూ 12,500 వరకు టాక్స్ మినహాయింపు ఉంది. కావున టాక్స్ పడదు)
5 లక్షల నుండి 7.5 లక్షల వరకు 12500 + 5 లక్షలు దాటిన ఆదాయం పై 10%
7.5 లక్షల నుండి 10 లక్షల వరకు 37500 + 7.5 లక్షలు దాటిన ఆదాయం పై 15%
10 లక్షల నుండి 12.5 లక్షల వరకు 75000 + 10 లక్షలు దాటిన ఆదాయంపై 20%
12.5 లక్షల నుండి 15 లక్షల వరకు 125000+10 లక్షలు దాటిన ఆదాయంపై 25%
15 లక్షలపైన 187500+15లక్షలు దాటిన ఆదాయంపై 30%

ప్రస్తుత ఉన్న ఐటీ 2022-23 గణన పాత టాక్స్ శ్లాబ్లు

ఐటీ 2022-23 గణన పాత (ప్రస్తుతం ఉన్న) టాక్స్ శ్లాబ్లు
ఆదాయం చెల్లించాల్సిన టాక్స్
2.5 లక్షల వరకు టాక్స్ లేదు
2.5 లక్షల నుండి 5 లక్షల వరకు 5% టాక్స్ (రూ 12,500 వరకు టాక్స్ మినహాయింపు ఉంది. కావున టాక్స్ పడదు)
5 లక్షల నుండి 10 లక్షల వరకు 12500 + 5 లక్షలు దాటిన ఆదాయం పై 20%
10 లక్షలపైన 1,12,500 + 10 లక్షలు దాటిన ఆదాయంపై 30%

ఆదాయ పన్ను 2022-23 వేతనాదాయంగా పరిగణించే అంశాలు

(1) మూలవేతనము, డిఏ, హెచ్ఎస్ఏ, సిసిఏ, ప్రోత్సాహక ఇంక్రిమెంట్లు, ఐ.ఆర్.
(2) వేతన బకాయిలు, వేతన అడ్వాన్స్
(3) పెన్షన్
(4) సరెండర్ లీవు
(5) బోనస్
(6) నూతన పెన్షన్ పథకంలో ప్రభుత్వ వాటా
(7) ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్,
(8) పిఆర్సి, స్టెప్ అప్, ఏఏఎస్ తదితర బకాయిలు

ఆదాయ పన్ను 2022-23 ఇతర ఆదాయ అంశాలు

(1) నివాస గృహాలు, వ్యాపార కాంప్లెక్స్ పై వచ్చే అద్దెలు,
(2) వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయం,
(3) షేర్లు / మ్యూచువల్ ఫండ్స్ అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయం.
(4) భవిష్య నిధి ఖాతాలలో రూ.2.5లక్షల పైబడి చెల్లించే చందా మొత్తంపై వడ్డీ
(5) బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ, పోస్టు ఆఫీసు లలోని సేవింగ్స్ ఖాతా పై వడ్డీ, ఎన్.యస్.సి. సర్టిఫికెట్లపై వడ్డీ, ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీలు
(3) ఉద్యోగి లేదా సర్వీస్ పెన్షనర్ పొందుతున్న ఫ్యామిలీ పెన్షన్
(4) గత సంవత్సరం ఆదాయపు పన్ను రీఫండ్ ద్వారా వచ్చిన వడ్డీ

ఆదాయ పన్ను 2022-23 వేతనాదాయంగా పరిగణించబడని అంశములు :

(1) గ్రాట్యుటీ
(2) కమ్యూటెడ్
(3) యల్టిసి
(4) పిఎఫ్ నుండి చెల్లింపులు
(5) టూర్ / ట్రాన్స్ఫర్, టిఏ, డిఏ
(6) రిటైరైన తదుపరి సంపాదిత, అర్ధజీతపు సెలవు నగదు
(7) వికలాంగుడైన ఉద్యోగికిచ్చే కన్వేయన్స్ అలవెన్స్
(8) ఎడ్యుకేషన్ అలవెన్స్
(9) మెడికల్ రీయింబర్స్మెంట్

ఆదాయ పన్ను 2022-23 గణన Telugu Part-2

✔️1. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏమిటి, అస్సెస్స్మెంట్ ఇయర్ ఏమిటి ? ఈ రెండిటి మధ్య బేధం ఏంటి ?
✔️2. టీడీస్ అంటే ఏంటి. అడ్వాన్స్ టాక్స్, టీడీస్ ఒక్కటే నా ?
✔️3. సందేహాలు - సమాధానాలు -

✔️Link: Click Here for Part =II
రోజుకు ఒక్కొక్క అంశం చేర్చబడును. రోజూ చూడవల్సిందిగా మనవి