Changes in Promotions Procedures for SC ST - Initial Cadre Seniority to be Counted ?
- ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో మార్పులు?
- ఇనీషియల్ కేడర్ సీనియారిటీనే పరిగణనలోకి తీసుకునే యోచనలో ప్రభుత్వం
- తమకు అన్యాయం జరుగుతుందన్న ఇతర వర్గాల ఆవేదన నేపథ్యంలోనే..
Changes in Promotions Procedures for SCs STs - Initial Cadre Seniority to be Counted in Promotions ?
రాష్ట్ర సచివాలయం లోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలుకు సంబంధించి అనుసరిస్తున్న విధానంలో కొన్ని కీలకమైన మార్పులు చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత కసరత్తు చేస్తోంది. సచివాలయంలో సెక్షన్ అధికారులు మొదలు అదనపు కార్యదర్శుల వరకు పదోన్నతులకు సంబంధించి ఇనీషియల్ కేడర్ సీనియారిటీని కాకుండా, ఫీడర్ కేడర్ సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవడం వల్ల తమకు అన్యాయం జరుగుతోందంటూ గతంలో కొందరు కోర్టును ఆశ్రయించారు. ఫీడర్ కేడర్ సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవడం వల్ల సెక్షన్ ఆఫీసర్లు మొదలు అదనపు కార్యదర్శుల వరకు.. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఖ్య వారికి రిజర్వు చేసిన శాతం కంటే ఎక్కువ ఉందని వారు పేర్కొన్నారు.దీనిపై హైకోర్టు ఉత్తర్వుల మేరకు.. న్యాయశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత నవంబరులో అడ్వైజరీ కమిటీని నియమించింది. 2014-15 నుంచి 2022 23 వరకు వివిధ కేటగిరీల్లో ఏయే వర్గాల ఉద్యోగులకు పదోన్నతులు లభించాయో.. కమిటీ పరిశీలించింది. సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్లు మొదలు అదనపు కార్యదర్శుల స్థాయి వరకు ఐదు కేటగిరీల్లో ఉద్యోగుల సంఖ్య 464 ఉండగా.. వారిలో ఎస్సీలు 88 మంది (19 శాతం), ఎస్టీలు 30 మంది (6.4 శాతం) ఉన్న ట్టుగా కమిటీ పేర్కొంది. రిజర్వేషన్ విధానం ప్రకారం ఆ పోస్టుల్లో ఎస్సీలు 15 శాతం, ఎస్టీలు 6 శాతం ఉండాలని, కానీ మొత్తం 25.4 శాతం ఉన్నారని కమిటీ పేర్కొంది. ఫీడర్ కేడర్ సీనియారిటీ ద్వారా పదోన్నతులు పొందినవారిని వెనక్కి పంపాలని సూచించింది.
తెలంగాణ నమూనా అమలు చేస్తే...
తెలంగాణ నమూనా అమలు చేస్తే...
తెలంగాణలో కూడా ఇదే సమస్య ఏర్పడితే ఆ రాష్ట్ర ప్రభుత్వం... అదనంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల్ని రివర్ట్ చేయకుండా, సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి వారు పదోన్నతి పొందిన స్థానాల్లోనే కొనసాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ విధానాన్నే అనుసరిస్తే ఎలా ఉంటుందన్న కోణంలో ప్రభుత్వం యోచిస్తోంది. ఈ అంశంపై న్యాయశాఖ కార్యదర్శి ఆధ్వర్యం లోని కమిటీకి... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి ఈ నెల 3న ఒక లేఖ రాశారు. వివిధ కేటగిరీల్లో అదనంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల్ని అక్కడే కొనసాగించాలంటే ఎన్ని సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించాల్సి ఉంటుందో, వారం రోజుల్లోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు.
ప్రస్తుత విధానం ఇదీ...
ఉద్యోగుల పదోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీడర్ కేడర్ సీనియారిటీ విధానాన్ని అనుసరి స్తోంది. ఉదాహరణకు.. జూనియర్ అసిస్టెంట్ కేడర్ లో ఉన్న ఎస్సీ ఉద్యోగి సీనియారిటీలో అయిదో స్థానంలో ఉన్నారనుకుందాం. దాన్ని ఇనీషియల్ కేడర్ సీనియారిటీ అంటారు. సీని యర్ అసిస్టెంట్ కేడర్ ఎస్సీలకు కేటాయించిన 15 శాతం పోస్టుల్లో ఖాళీ ఏర్పడినప్పుడు. దాన్ని ఎస్సీలతోనే భర్తీ చేయాలి కాబట్టి, జూనియర్ అసిసెంట్లలో కేడర్ సీనియారిటీలో ఐదో స్థానంలో ఉన్నప్పటికీ ఎస్సీ ఉద్యోగికి మొదట పదోన్నతి కల్పిస్తున్నారు.. సీనియారిటీలో ఒకటి నుంచి నాలుగు వరకు ఉన్న ఇతర వర్గాల ఉద్యోగులకు కాలక్రమంలో సీనియర్ అసి స్టెంట్లుగా పదోన్నతులు లభిస్తున్నాయి. సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్ పోస్టులోకి పదోన్నతి కల్పించేటప్పుడు... ఫీడర్ కేడర్ కి (ఇక్కడ సీనియర్ అసిస్టెంట్) ముందుగా పదోన్నతిపై వచ్చిన ఎస్సీ ఉద్యోగినే సీనియర్ గా పరిగణించి, మొదటి ప్రాధాన్యమి స్తున్నారు. సూపరింటెండెంట్ కేడర్ ఎస్సీ లకు కేటాయించిన 15 శాతం పోస్టుల్లో ఖాళీ లేనప్పటికీ, కొత్తగా ఖాళీ అయిన పోస్టు జన రల్ కేటగిరీదైనా.. ఫీడర్ కేడర్ లో సీనియర్గా ఉన్న ఎస్సీ ఉద్యోగికే మొదటి ప్రాధాన్యం లభి స్తోంది. కొన్నేళ్లుగా ఈ విధానాన్ని అనుసరిం చడం వల్ల ఫీడర్ కేడర్ పోస్టుల్లో.. రిజర్వేషన్ల ప్రకారం ఉండాల్సినదానికంటే ఎస్సీ, ఎస్టీ ఉద్యో గుల సంఖ్య ఎక్కువగా ఉందని ప్రభుత్వం నియమించిన కమిటీ తేల్చింది..

ఇప్పుడేం చేయబోతున్నారు?
ఫీడర్ కేడర్ సీనియారిటీని కాకుండా ఇనీష యల్ కేడర్ సీనియారిటీని పరిగణనలోకి తీసుకోబోతున్నారు. పై ఉదాహరణనే తీసుకుంటే.. ఇనీషియల్ కేడర్ (జూనియర్ అసిస్టెంట్) సీనియారిటీలో అయిదో స్థానంలో ఉన్న ఎస్సీ ఉద్యోగి, సీనియర్ అసిస్టెంట్లలో ఎస్సీలకు కేటా యించిన కోటాలోని పోస్ట్ ఖాళీ అవడం వల్ల మొదట పదోన్నతి పొందారనుకుందాం. సీని యారిటీలో ఒకటి నుంచి నాలుగు వరకు ఉన్న వారు ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్లు అయ్యా రనుకుందాం. సూపరింటెండెంట్ కేడర్ సాధారణ కేటగిరీ పోస్టుల్లో ఖాళీ ఏర్పడితే.. ఫీడర్ కేడర్లో (సీనియర్ అసిస్టెంట్) సీనియ ర్ గా ఉన్న ఎస్సీ ఉద్యోగికి కాకుండా, ఇనీషియల్ కేడర్ (జూనియర్ అసిస్టెంట్) సీనియారి టీలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తికే ఇకపై మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నది ప్రభుత్వ నిర్ణయం. సూపరింటెండెంట్ కేడర్లో ఎస్సీలకు కేటాయించిన 15 శాతంలో ఖాళీ వస్తే మాత్రం. కచ్చితంగా ఎస్సీ ఉద్యోగికే మొదటి ప్రాధాన్యం ఉంటుంది.
courtesy:EENADUఫీడర్ కేడర్ సీనియారిటీని కాకుండా ఇనీష యల్ కేడర్ సీనియారిటీని పరిగణనలోకి తీసుకోబోతున్నారు. పై ఉదాహరణనే తీసుకుంటే.. ఇనీషియల్ కేడర్ (జూనియర్ అసిస్టెంట్) సీనియారిటీలో అయిదో స్థానంలో ఉన్న ఎస్సీ ఉద్యోగి, సీనియర్ అసిస్టెంట్లలో ఎస్సీలకు కేటా యించిన కోటాలోని పోస్ట్ ఖాళీ అవడం వల్ల మొదట పదోన్నతి పొందారనుకుందాం. సీని యారిటీలో ఒకటి నుంచి నాలుగు వరకు ఉన్న వారు ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్లు అయ్యా రనుకుందాం. సూపరింటెండెంట్ కేడర్ సాధారణ కేటగిరీ పోస్టుల్లో ఖాళీ ఏర్పడితే.. ఫీడర్ కేడర్లో (సీనియర్ అసిస్టెంట్) సీనియ ర్ గా ఉన్న ఎస్సీ ఉద్యోగికి కాకుండా, ఇనీషియల్ కేడర్ (జూనియర్ అసిస్టెంట్) సీనియారి టీలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తికే ఇకపై మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నది ప్రభుత్వ నిర్ణయం. సూపరింటెండెంట్ కేడర్లో ఎస్సీలకు కేటాయించిన 15 శాతంలో ఖాళీ వస్తే మాత్రం. కచ్చితంగా ఎస్సీ ఉద్యోగికే మొదటి ప్రాధాన్యం ఉంటుంది.