AP Cabinet Meeting Decisions 31st Jan 2024 Cabinet Meeting Highlights

AP Cabinet Decisions 31st Jan 2024 Cabinet Meeting Highlights

AP Cabinet meeting is held on 31st Jan 2024 under the chairmanship of CM Jagan Mohan Reddy. Key decisions have been taken in this AP Cabinet Meeting. Details are explained below.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్‌లో మంత్రి వర్గ సమావేశం జరిగింది. పలు ఇతర కీలక అంశాలపై మంత్రి వర్గ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.



ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకోంది.. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన కొనసాగుతోన్న మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలకు పచ్చజెండా ఊపారు..

కేబినెట్‌లో డీఎస్సీ నిర్వహణ, నోటిఫికేషన్ జారీపై చర్చించారు.. సుమారు 6 వేల టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ఆమోద ముద్ర వేసింది ఏపీ కేబినెట్‌..

వైఎస్సార్ చేయూత నాలుగో విడతకు కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. ఫిబ్రవరి నెలలో వైఎస్సార్ చేయూత నిధులు విడుదలకు ఆమోదం తెలిపింది..

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5 వేల కోట్ల మేర నిధుల విడుదలకు ఆమోద ముద్ర వేసింది..

ఎస్ఐపీబీ ఆమోదించిన తీర్మానాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ మంత్రిమండలి..

ఇంధన రంగంలో 22 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కూడా పచ్చజెండా ఊపింది ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ సమావేశం.

ఇంధన రంగంలో 22,302 కోట్ల పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 5,300 మందికి ఉపాధి అవకాశాలు లభించను్నాయి.

3350 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ కు ఆమోదం లభించింది..

దాదాపు 12,065 కోట్ల పెట్టుబడి పెట్టనున్న జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ ఏర్పాటు చేయనున్నారు..

ఆగ్వాగ్రీన్‌ ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 1000 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్‌ను ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది..

4 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది.. ఇక, ఎక్రోన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 1350 కోట్లు పెట్టుబడి ప్రతిపాదనకు కేబినెట్‌ పచ్చజెండా ఊపింది..
Stay Tuned for Detailed updates

పలు కీలక అంశాలకు ఆమోదం
►డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌
►6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు కేబినెట్‌ ఆమోదం
►వైఎస్సార్‌ చేయూత 4వ విడతకు ఆమోదం
►ఫిబ్రవరిలో వైఎస్సార్‌ చేయూత నిధులు విడుదల
►ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం
►ఎస్‌ఐపీబీ ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్‌ సిగ్నల్‌
►ఇంధన రంగంలో 22 వేల కోట్ల పెట్టుబడుల ప్రాతిపాదనలకు ఆమోదం
►ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి ఆమోదం
►ఎస్‌ఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కేబినెట్‌ ఆమోదం
►యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంపు
►అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం
►నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్‌ పవర్‌ ప్రాజెక్టులకు ఆమోదం
►శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
►ఆర్జేయూకేటీకి రిజిస్ట్రార్‌ పోస్టు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
►ఆ మేరకు చట్టంలో సవరణకు కేబినెట్‌ ఆమోదం