APRS 6th, 7th, 8th Backlog Admissions 2024 through APRC CAT 2024 Apply Online Here

APRS 6th, 7th, 8th Backlog Admissions 2024 through APRC CAT 2024 Apply Online Here. Andhra Pradesh Residential Schools Common Admission Test 2024 Notification Released by APREIS for Admission into 5th Class Regular, 68th Backlog Seats. Detailed Information, How to apply, Syllabus, How to prepare for Entrance Exam, Model Question Papers explained below.

    APRS 6th,7th,8th Backlog Admissions 2024


    APRS 6th, 7th, 8th Backlog Admissions 2024 Notification Overview


    APRS CAT 6th,7th,8th Backlog 2024 Notification Overview
    Name of the Notification APRS CAT 2024
    Detailed Name of the Entrance AP Residential Schools Common Admission Test 2024
    AP GURUKULA 6th,7th,8th Backlog Entrance
    Academic Year 2023-24
    Eligible Classes 6th,7th,8th Backlog Admissions
    Admission Mode Admission through APRS CAT 2024
    Last Date to APPLY Online 31.03.2024
    Entrance Date 25.04.2024 (10 AM to 12 NOON)
    Official Website aprs.apcfss.in
    Join Social Medial Channels for Free Alerts

    Salient Features of APRS Gurukulams

    ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల ప్రత్యేకతలు :
    • ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్నవి.
    • ఈ విద్యాలయాలు పూర్తిగా గురుకుల విధానంలోనే విద్యను అందిస్తున్నవి. మరియు విద్యాలయాలు అన్నియు పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో నిర్వహించబడుచున్నవి.
    • ఈ విద్యాలయాలలో ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ వహించబడును.
    • ఈ విద్యాలయాలలో మంచి మౌళిక వసతులతో కూడిన ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, క్రీడాప్రాంగణాలు అందుబాటులో ఉన్నాయి.
    • విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కొరకు, విద్యతో పాటుగా, సహ పాఠ్యాంశాలు మరియు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
    • ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు లోకో పేరెంట్ గా నియమించబడును. వీరు ప్రతి విద్యార్ధి పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకొనెదరు.
    •  దైనందిన కార్యక్రమాలు ఉదయం గం. 5 లకు శారీరక వ్యాయామంతో ప్రారంభమై, బోధనా తరగతులు మరియు ఇతర అభ్యసన కార్యక్రమాలు రాత్రి గం. 9.00 వరకు కొనసాగుతాయి.
    • విద్యార్థులకు గణిత ఒలింపియాడ్, హిందీ ప్రచార సభ, ఇండియా స్కిల్స్ జూనియర్, సైన్స్ ఫెయిర్ మరియు NTSE మొదలైన ప్రతిష్ఠాత్మక పరీక్షల కొరకు తర్ఫీదు ఇవ్వబడును.

    APRS Admissions 2024 Reservation of Seats

    3. రిజర్వేషన్ శాతం (%):
    a) సాధారణ పాఠశాలలు:
    i. ఓసి : 41%, బిసి-ఎ: 7 %, బిసి-బి : 10%, బిసి-సి: 1%, బిసి-డి: 7%,
    ii. బిసి-ఇ: 4%, ఎస్.సి: 15% మరియు ఎస్.టి: 6%.
    ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్: పి.హెచ్.సి: 3%, సి.ఎ.పి. (సైనికోద్యోగుల పిల్లలు): 3%, అనాథ: 3%.

    APRS CAT 2024 Admissions Eligibility & Age Criteria

    The detailed Eligibility Criteria, Age Criteria for Admissions into APRS Schools for various classes is given below.

    అర్హతలు:-
    విద్యార్థినీ విద్యార్థులు భారతపౌరులై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుతూ ఉండవలెను.

    6 వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో 5 వ తరగతి చదివి ఉండాలి. ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2012 నుండి 31.08.2014 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC & ST లకు చెందినవారు 01.09.2010 నుండి 31.08.2014 మధ్య పుట్టి ఉండాలి.

    7 వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో 6 వ తరగతి చదివి ఉండాలి. ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2011 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC & ST) లకు చెందినవారు 01.09.2009 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి.

    8 వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో 7 వ తరగతి చదివి ఉండాలి.ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2010 నుండి 31.08.2012 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC & ST లకు చెందినవారు 01.09.2008 నుండి 31.08.2012 మధ్య పుట్టి ఉండాలి.

    • జనరల్ పాఠశాలల్లో ప్రవేశానికి ఓ.సి., బి. సి. మరియు మైనారిటీ విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి.
    • యస్.సి. మరియు యస్.టి. విద్యార్థులు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదివినప్పటికీ జనరల్ మరియు మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు.
    h) మైనారిటీ విద్యార్థులు, మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశం కొరకు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదివి ఉండవచ్చును.

    APRS CAT 2024 Admissions Income Limit

    ఆదాయపరిమితి: అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి/సంరక్షకుల సంవత్సరాదాయము (2023-24) రూ. 1,00,000/- మించి ఉండరాదు లేదా తెల్లరేషన్ కార్డు కలిగిన వారు అర్హులు.

    సైనికోద్యోగుల పిల్లలకు ఆదాయపరిమితి నియమం వర్తించదు.

    మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకొనుటకు మార్గదర్శకాలు :

    a) మైనారిటీ విద్యార్థినీ విద్యార్థులు మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశం కొరకు దరఖాస్తు చేయు విధానం జనరల్ విద్యార్థుల కంటే భిన్నంగా ఉంటుంది. వీరు ప్రవేశం కొరకు ప్రవేశ పరీక్ష వ్రాయవలసిన అవసరం లేదు.

    b) కావున, మైనారిటీ విద్యార్థినీ విద్యార్థులు ప్రవేశం కొరకు దరఖాస్తు చేయుటకై మార్గదర్శకాల కొరకు APRS CAT (Minority) ప్రాస్పెక్టస్ ని చూడగలరు.

    How to APPLY Online for APRS CAT 2024

    దరఖాస్తు చేసుకొనుటకు మార్గదర్శకాలు :

    a) జనరల్ పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేయగోరు అందరు అభ్యర్థులు మరియు మైనారిటీ పాఠశాలల్లో దరఖాస్తు చేయు యస్.సి & యస్.టి. అభ్యర్థులు తప్పక ఎ.పి.ఆర్.యస్. సెట్ వ్రాయవలెను.

    b) అభ్యర్థులు దరఖాస్తులను నింపుట కొరకు https://aprs.apcfss.in వెబ్ సైట్ న్ను సందర్శించవలెను.

    అభ్యర్థులు దరఖాస్తులను నింపుటకు ముందు వెబ్ సైట్ నందలి నియమావళిని జాగ్రత్తగా చదువుకొని తమ అర్హతల పట్ల సంతృప్తి చెందిన తరువాత మాత్రమే దరఖాస్తులను నింపవలెను

    APPLICATION FEE:

    అభ్యర్థి అర్హత ప్రమాణాల గురించి సంతృప్తి చెందిన తర్వాత, రుసుము చెల్లింపు లింక్ని క్లిక్ చేయడం/తెరవడం ద్వారా రూ.100/- రుసుమును పేర్కొన్న వ్యవధిలో ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.

    ఆన్లైన్లో ఫీజు చెల్లింపు సమయంలో, అభ్యర్థి అవసరమైన ప్రాధమిక వివరాలను అనగా అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నంబర్ మొదలైనవి ఇవ్వవలెను.

    ఒక మొబైల్ నంబర్ను ఒక అప్లికేషన్ కోసం మాత్రమే ఉపయోగించవలెను. ఇవ్వబడిన మొబైల్ నెంబర్, OTP ద్వారా నిర్ధారించబడుతుంది.

    ఆన్లైన్లో ఫీజు చెల్లించిన తర్వాత, అభ్యర్థి ID జారీ చేయబడుతుంది. అభ్యర్థి ID జారీ చేయడం అంటే అభ్యర్థి ఆన్లైన్లో దరఖాస్తు సమర్పణను పూర్తి చేసినట్లు కాదు. ID, రుసుము రసీదుకి సంబంధించిన నిర్ధారణ మాత్రమే.

    ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు అభ్యర్థి 3.5 × 4.5 సెంటీమీటర్ల పరిమాణంలో ఫోటో మరియు సంతకంతో సిద్ధంగా ఉండాలి. దరఖాస్తు ఫారమ్తో పాటు ఫోటో & సంతకాన్ని కలిపి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

    ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి, అప్లికేషన్ ఫారమ్ లింక్పై క్లిక్ చేసి, అభ్యర్థి ID మరియు పుట్టిన తేదీతో లాగిన్ చేయవలెను. పిదప ఆన్లైన్ అప్లికేషన్ తెరవబడుతుంది.

    ఆన్లైన్ దరఖాస్తును పూరిస్తున్నప్పుడు, తరగతిని జాగ్రత్తగా ఎంచు కోవలెను. ఎంచుకున్న తరగతిని తర్వాత మార్చలేరు.

    ఆన్లైన్ దరఖాస్తును సమర్పించేటప్పుడు ఎటువంటి ధృవపత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. కానీ, ఎంపికైన అభ్యర్థి అడ్మిషన్ సమయంలో దరఖాస్తులో అందించిన సమాచారానికి తగిన ఒరిజినల్ సర్టిఫికేట్లను సమర్పించగలగాలి.

    దరఖాస్తులో అభ్యర్థి తన కులం / కేటగిరిని తప్పుగా నమోదు చేసి, మరొక కేటగిరిలో ఎంపిక కాబడినచో ప్రవేశం ఇవ్వబడదు మరియు కులం / కేటగిరి మార్చబడదు.

    ఎలాంటి లోపాలు లేకుండా వివరాలను జాగ్రత్తగా పూరించాలి. ఏదైనా తప్పులు/తప్పుడు సమాచారం సమర్పించినట్లయితే, దరఖాస్తు / అడ్మిషన్ తిరస్కరణకు అభ్యర్థి పూర్తిగా బాధ్యత వహించవలసి వుంటుంది.

    ఆన్లైన్ దరఖాస్తును సమర్పించిన తర్వాత, అభ్యర్థి తదుపరి అవసరముల కోసం దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింట్ను తీసుకోవాలి.

    అడ్మిషన్ సమయంలో అవసరమైన పత్రాలను సమర్పించడంలో విఫలమైతే మరియు నిబంధనల ప్రకారం ఏదైనా కారణంతో అతను/ఆమె అనర్హులైతే అభ్యర్థి యొక్క దరఖాస్తు / అడ్మిషన్ ఎలాంటి నోటీసు లేకుండా తిరస్కరించబడుతుంది.

    APRS 6th,7th,8th  Backlog Admissions Entrance Pattern 2024

    ప్రవేశ పరీక్ష 2 గంటల వ్యవధితో, 100 మార్కులకు బహుళైచ్ఛిక ప్రశ్నలతో నిర్వహించబడుతుంది.

    ఆయా తరగతుల పరీక్ష కొరకు ఇవ్వబడు ప్రశ్నల సబ్జెక్టులు, ప్రశ్నల సంఖ్య మరియు మార్కులు క్రింది విధముగా ఉండును.

    APRS 6th, 7th, 8th Backlog Admissions 2024 through APRC CAT 2024 Apply Online Here

    పరీక్ష ప్రశ్నాపత్రము 5 వ తరగతికి తెలుగు & ఇంగ్లీషు మీడియంలలోనూ మరియు ఉర్దూ & ఇంగ్లీషు మీడియంలలో వుంటుంది. మిగిలిన తరగతులకు తెలుగు మరియు ఇంగ్లీషు మీడియంలలో మాత్రమే వుంటుంది.

    పరీక్ష ప్రశ్నాపత్రము అన్ని తరగతులకు తెలుగు మరియు ఇంగ్లీషు మీడియంలలో వుంటుంది.

    అభ్యర్థులు OMR షీట్ను బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో మాత్రమే బబుల్ చేయాలి మరియు జారీ చేసిన సూచనలను పాటించాలి. సూచనలకు వ్యతిరేక చర్యలు OMR షీట్ను రద్దు చేయుటకు దారిచేయును.

    ప్రవేశ పరీక్ష, 26 జిల్లా ప్రధాన కేంద్రములలో మాత్రమే నిర్దేశించబడిన పరీక్ష కేంద్రాలలో నిర్వ హించబడును.

    సంబంధిత జిల్లాలోని పరీక్షా కేంద్రానికి తగినంతమంది అభ్యర్థులు లేని యెడల ప్రక్క జిల్లాలోని పరీక్షా కేంద్రానికి కేటాయించ బడతారు.

    అడ్మిషన్ల కోసం మార్గదర్శకాలు:

    అడ్మిషన్ కోసం ఎంపికైన అభ్యర్థులకు వెబ్సైట్, SMS మరియు ప్రెస్ నోట్ ద్వారా నిర్దేశిత తేదీ మరియు హాజరు కావలసిన పాఠశాల వివరములు తెలియజేయబడతాయి.

    PHC కేటగిరీ కింద, అభ్యర్థులు జిల్లా మెడికల్ బోర్డ్ జారీ చేసిన కనీస వైకల్యం 40% యొక్క సర్టిఫికేట్ (SADAREM సర్టిఫికేట్) సమర్పించాలి.

    CAP (చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్ పర్సనల్) కేటగిరీ కింద, అభ్యర్థి తల్లితండ్రులు తప్పనిసరిగా మాజీ సైనికుడిగా లేదా ప్రస్తుతం డిఫెన్స్ సర్వీస్లో ఉన్నారని జిల్లా సైనిక్ బోర్డ్ జారీ చేసిన సర్టిఫికేట్ను సమర్పించాలి.

    అనాధ కేటగిరీ క్రింద, అభ్యర్థికి తల్లిదండ్రులు లేరని సంబంధిత MRO జారీ చేసిన ధృవీకరణ పత్రాన్ని అభ్యర్థి సమర్పించాలి.

    ప్రత్యేక కేటగిరీ కింద అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకుంటే, సీట్లు OC కేటగిరీకి కేటాయించబడుతాయి.

    ప్రవేశపరీక్షలో ఎంపిక కాబడిన విద్యార్థినీ విద్యార్థులు, నిర్దేశించిన పాఠశాలలో నిర్ణయించిన తేదీన ధృవపత్రాల పరిశీలన చేయించుకుని తప్పక చేరవలెను. లేనిచో ప్రవేశం రద్దు చేయబడును.

    మొదటి ఎంపిక తర్వాత సీట్ల లభ్యతకు లోబడి, తదుపరి ఎంపికల కోసం మిగిలిన మెరిట్ జాబితాల నుండి అభ్యర్థుల జాబితా విడుదల చేయబడుతుంది.

    నిర్దేశించబడిన ఎంపిక జాబితాల అనంతరం, సీట్లు మిగిలి ఉన్నచో, పాఠశాల స్థాయిలో మొదట వచ్చిన వారికి మొదట కేటాయింపు ప్రాతిపదికన మెరిట్ జాబితాలలో మిగిలి వున్న విద్యార్థులకు కేటాయించబడును.

    పైన తెలిపిన విధంగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన పిదప, ఇంకనూ ఖాళీలు మిగిలి వున్నచో మరియు ఏదైనా కేటగిరీలో సంబంధిత విద్యార్థులు లభ్యం కానిచో, అట్టి ఖాళీలలో ప్రవేశ పరీక్ష (APRS CAT) వ్రాసివున్న విద్యార్థులకు, ఎస్.టి. / ఎస్.సి. / బి.సి. / ఓ.సి. ప్రాధాన్యతా క్రమములో మెరిట్ ప్రాతిపదికన మరియు పాఠశాల పరిధికి లోబడి, అవకాశం వున్నమేరకు, అడ్మిషన్లు కల్పించబడును.

    APRS 6th,7th,8th Admissions Application Form - 2024-25

    APRS Backlog Vacancy(6th,7th, & 8th) Admission Application Form - 2024-25
    Payment Click Here
    Application Form Click Here
    Know Your Candidate Details Click Here
    Start & End Dates From   01-03-2024  To   31-03-2024

    APRS 6th,7th,8th Admissions Model Paper

    APRS Backlog Model Question Papers
    APRS CAT 2023 6th Class E&T Model Paper Click Here
    APRS CAT 2023 7th Class E&T Model Paper Click Here
    APRS CAT 2023 8th Class E&T Model Paper Click Here