Vidya Pravesh 90 Days Action Plan 2024 Vidya Pravesh Day Wise Activities List

Vidya Pravesh 90 Days Action Plan - Day Wise Activities List.

Vidya Pravesh 90 Days Action Plan 2024  Day Wise Activities List

Day -1 June 13th 2024 Vidya Pravesh Activities for 1st Class

Language & Literacy Development
Theme-Me and my friends: పిల్లలతో మాట్లాడుతూ వారిని పరిచయం చేసుకోమనాలి. ప్రతి పిల్లవానితో మాట్లాడించాలి. ఉదా: గుడ్ మార్నింగ్ అనడం నేర్పాలి.

Cognitive Development
Theme: జ్ఞానేంద్రియాలు అభివృద్ధి: చూసి చెప్పండి :
పిల్లలను తమ చుట్టూ కనబడుతున్న ఏవైనా నాలుగు వస్తువుల పేర్లు చెప్పమనాలి. (ఉదా: బ్యాగ్, పుస్తకం, బల్ల, బాటిల్, చెట్టు, బోర్డు, ఫ్యాన్, లైట్ మొ.వి). పిల్లలు స్వంతగా చెప్పడానికి ముందుకు రానట్లయితే టీచర్ వస్తువును చూపి అడిగి పిల్లలు చెప్పేలా ప్రోత్సహించాలి.


Physical Development
బంతి ఆటతో పరిచయం:- టీచర్ పిల్లలందరినీ గుండ్రంగా కూర్చోబెట్టి బంతిని విసురుతూ ఒక్కొక్కరిగా పట్టుకోమనాలి. పట్టుకున్న వారు లేచి పేరు చెబుతూ పరిచయం చేసుకోమనాలి.