SMC Elections 2024: Doubts and Clarifications - Official FAQs

SMC Elections 2024: Doubts and Clarifications - Official FAQs. The Samagra Siksha has released the Official FAQs and clarified the Doubts and Clarifications given for conducting SMC Elections 2024 vide  Rc.No.SSA-16021/54/2023-SEC-CMO SS, Dated: 02/08/2024.
SMC Elections -FAQs

SMC Elections 2024: Doubts and Clarifications - Official FAQs


Sub: APSS- CMO Section- Conduct of School Management Committee Elections 2024 - FAQS and Pledge - Reg.,

Ref: 
1 Govt Memo No.977203/Prog.II/A2/2019-5, Dated:22.11.2023 
2 Govt Memo No.977203/Prog.ll/A2/2019-8, Dated: 30.07.2024 
3 Rc.No.SSA-16021/54/2023-SEC-CMO SS, Dated: 30.07.2024

Order:

All the District Educational Officers and Additional Project Coordinators in the state are aware that vide ref 3rd read above, the proceedings are issued for reconstitution of School management committees in all the schools except private unaided schools along with the guidelines and schedule.

All the District Educational Officers and Additional Project Coordinators in the state are requested to communicate the list of frequently asked questions (FAQs) and corresponding answers, Pledge attached in this proceeding to all the MEOs to further communicate to all the HMs for smooth conduct of elections for reconstitution of School Management committees.

పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలకు సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలు -సమాధానాలు


So No Questios Doubts Clarifications / Answers
1 పాఠశాల యాజమాన్య కమిటీ అంటే ఏమిటి? విద్యా హక్కు చట్టం 2009 లోని సెక్షన్ -21(1) అమలులో భాగంగా పాఠశాల నిర్వహణ, యాజమాన్యలను చూసుకోడానికి పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీని పాఠశాల యాజమాన్య కమిటీ అంటాం.
2 పాఠశాల యాజమాన్య కమిటీ బాధ్యత ఏమిటి? పాఠశాల సక్రమంగా నడిచేలా అజమాయిషీ చేయడం, కావలసిన సదుపాయాలను కల్పిస్తూ పాఠశాలను అభివృద్ధి చేయడం దీని ప్రధాన భాద్యత.
3 పాఠశాల యాజమాన్య కమిటీ ప్రధాన పాత్రధారులు ఎవరు? ఎస్.ఎమ్.సి కమిటిలో ప్రధాన పాత్రధారులు విద్యార్థుల తల్లిదండ్రులు
4 ఒక తరగతిలో వేరు వేరు మీడియములు ఉంటే వేరు వేరు తరగతులగా భావించవచ్చా? ఒక తరగతిలో ఎన్ని మీడియములు, సెక్షన్లు ఉన్నా అన్నింటిని ఒకే తరగతిగా భావించాలి.
5 పాఠశాల యాజమాన్య కమిటీ పదవికాలము ఎంత? ఒకసారి ఏర్పాటు అయిన పాఠశాల యాజమన్యా కమిటీ వ్యవస్థ నిరంతంగా కొనసాగుతుంది (ఎమ్.ఇఓ మరియు డి.ఇ.ఓ చే రద్దు లేక విలీనము చేయడబడినప్పుడు తప్ప) కమిటీ సభ్యుల పదవీకాలం గరిష్టంగా 2 సం
6 పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులను ఏ విధంగా ఎన్నుకోవాలి? ఒక్కో తరగతి నుండి ఎన్నిక కావలసిన సభ్యులు మొత్తం ముగ్గురు (అన్ని సెక్షన్లు మరియు మాద్యమాలలో చదువుతున్న పిల్లలు తల్లిదండ్రులు) ముగ్గురులో సామాజికంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వర్గాల వారి నుండి కనీసం ఒకరు (ఎన్.సి, ఎస్.టి. అనాధలు, వీధిబాలలు, ప్రత్యేక ఆవసరాలు గల పిల్లలు, హెచ్.ఐ.వి బాధిత పిల్లలు మొ॥ వారు తల్లిదండ్రులు/సంరక్షకులు) బలహీన వర్గాలకు చెందిన వారి నుండి ఒకరు (బి.సి మైనార్టీ మరియు సంవత్సర ఆదాయం పట్టణ పరిధిలో రూ.1,44,000/-, గ్రామీణ ప్రాంత పరిధిలో రూ.1,20,000/- | మించని ఓసి కుటుంబాలు పేరంట్స్ గార్డెయన్) జనరల్ కేటగిరి నుండి ఒకరు ఈ ముగ్గురు సభ్యులలో ఇద్దరు తప్పని సరి మహిళలు ఉండాలి.
7 పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల ఎన్నికలను ఎవరు నిర్వహించాలి? పాఠశాల ప్రధానోపాధ్యాయుడు
8 పాఠశాల యాజమాన్య కమిటీ కనీసం ఎన్నికలు నిర్వహించడానికి ఎంత మంది హాజరు కావాలి? 50 శాతం మంది తల్లిదండ్రులు/సంరక్షకులు
9 పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించడానికి ఎటువంటి విధానాన్ని పాటించాలి? నోటి మాటతో గాని చేతులు ఎత్తడం ద్వారా గాని రహస్య బ్యాలెట్ కానీ విధానము ద్వారా ఎన్నికలు జరిపించాలి
10 తరగతిలోని కమిటీ సభ్యుల ఎన్నికల్లో ఓటు వేసే అర్హత ఎవరికి ఉంటుంది? తరగతిలోని పిల్లల తల్లిదండ్రులలో ఎవరో ఒకరికి మాత్రమే కమిటీ సభ్యుల ఎన్నికల్లో ఓటువేసే అర్హత ఉంటుంది.
11 ఒకటి కన్నా ఎక్కువ తరగతులలో చదువుకునే పిల్లలున్న తల్లిదండ్రులకు ఆ తరగతులు ఎన్నికలలో పాల్గొనే అవకాశం ఉంటుందా? పాల్గొనే అవకాశం ఉంటుంది.
12 సభ్యుని కుమారుడు/కుమారై పాఠశాలను వదిలి వెళ్లినట్లైతే ఆ సభ్యుని పదవీ కాలము ఏమవుతుంది? పదవీ కాలము ముగిసిపోతుంది.
13 సభ్యుల ఖాళీలను పూరించడానికి ఏమి చేయాలి? ప్రతి సంవత్సరం కమిటీలోని ఖాళీలను పూరించడానికి ప్రవేశ తరగతుల (Entry class) లో ఎన్నికలు నిర్వహించాలి.
14 పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎవరు ఎన్నుకుంటారు? తల్లిదండ్రుల/సంరక్షకుల వర్గ సభ్యులు, వారిలో నుండి అధ్యక్షులు మరియు ఉపాధ్యాక్షులను ఎన్నుకుంటారు. వీరిలో ఒకరు తప్పక ప్రతికూల వర్గాలు లేదా బలహీన వర్గాలకు చెందినవారై ఉండాలి. వీరిలో కనీసం ఒక మహిళ ఉండాలి.
15 పాఠశాల యాజమాన్య కమిటీ మెంబర్ కన్వీనర్ ఎవరు? ప్రధానోపాధ్యాయులు/ఇన్ చార్జీ ప్రధానోపాధ్యాయులు
16 పాఠశాల యాజమాన్య కమిటీ లో ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఎవరిని నియమించాలి ? 1.ప్రధానోపాధ్యాయులు/ఇన్చార్జీ ప్రధానోపాధ్యాయులు
2. మండల విద్యాశాఖాధికారి చేత నామినేట్ చేయబడిన పాఠశాల ఉపాధ్యాయుడు (హెడ్ టీచర్) పురుషుడు అయితే ఉపాధ్యాయునులు నుండి ఎంపిక చేస్తారు. హెడ్ టీచర్ స్త్రీ అయితే పురుషునికి ప్రాధాన్యతనిస్తారు.
3. సంబంధిత వార్డు మెంబర్/కౌన్సిలర్
4. అంగన్వాడీ వర్కర్/వర్కర్లు
5. మల్టి పర్పస్ హెల్త్ వర్కర్ మహిళ (ఎ.ఎన్.ఎమ్) 6. స్థానిక మహిళా సమాఖ్య అధ్యక్షురాలు
17 పాఠశాల యాజమాన్య కమిటీ కో ఆప్టెడ్ - మెంబర్ గా ఎవరిని నియమించాలి ? పేరొందిన విద్యావేత్త, దాత, స్థానిక స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధి, పాఠశాల పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి సహకరించే వారి నుండి ఇద్దరిని పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు కో-ఆప్టెడ్ మెంబర్లుగా నియమించుకుంటారు.
18 గ్రామ సర్పంచ్ /పురపాలక అధ్యక్షులు పాఠశాల యాజమాన్య కమిటీలో నిర్వహించవలసిన పాత్ర ఏమిటి? సంబంధిత గ్రామ సర్పంచ్ / పురపాలక అధ్యక్షులు వారు వారి ప్రాంతంలో జరిగే పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాలకు ఎప్పుడైనా వారి ఇష్టం ప్రకారం హాజరుకావచ్చును.
19 పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు చేయకపోతే ఏమవుతుంది ? పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు చేయకపోతే పాఠశాలకు గ్రాంట్లు విడుదల కావు.
20 కె.జి.బి.వి పాఠశాలల్లో కూడా పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు చేయాలా చేయాలి
21 పాఠశాల యాజమాన్య కమిటీకు ఎన్నికైన సభ్యుని పదవికాలం రెండు సం॥రాలు కానీ ఎప్పుడైన ఆ సభ్యుని కుమారుడు, కుమార్తె పాఠశాలలను వదిలి వెళ్లినట్లయితే ఆ సభ్యుని పదవీ కాలం కూడా ముగిసిపోతుందా? పాఠశాల యాజమాన్య కమిటీకు ఎన్నికైన సభ్యుని పదవికాలం రెండు సం॥రాలు అయినప్పటికీ ఎప్పుడైన ఆ సభ్యుని కుమారుడు, కుమార్తె పాఠశాలలను వదిలి వెళ్లినట్లయితే ఆ సభ్యుని పదవీ కాలం కూడా ముగిసిపోతుంది.
22 స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పడి పదవీకాలం (02 సంవత్సరాలు) పూర్తికానట్లయితే స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీలను కొనసాగించవచ్చా? లేదా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలా? స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుల పదవీకాలం (02 సంవత్సరాలు) పూర్తయిన వాటిలో మాత్రమే SMC ఎన్నికలు నిర్వహించాలి. (Memo.No.SSA-16021/1/2019-MIS SEC-SSA, Dt.19.09.2021]
23 ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న తల్లి తండ్రి సభ్యునిగా పోటీ చేయవచ్చా? లేదా? ప్రభుత్వ ఉద్యోగి పోటీ చేయడానికి అర్హులు కాదు. (Memo.No.SSA- 16021/1/2019-MIS SEC-SSA, Dt.21.09.2021)
24 ఒకే పాఠశాలలో వేర్వేరు తరగతుల్లో చదువుతున్న తోబుట్టువుల తల్లిదండ్రులు ఆయా తరగతుల్లో సభ్యులుగా పోటీ చేయవచ్చా? లేదా? అవును. వివిధ తరగతులలో పిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులు/సంరక్షకులు ప్రతి తరగతి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడానికి అర్హులు. (Memo.No.SSA- 16021/1/2019- MIS SEC - SSA, Dt.19.09.2021)
25 ఒకవేళ విద్యార్థి పేరు పిల్లల సమాచారంలో నమోదు కానట్లయితే, తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఓటరుగా పరిగణించవచ్చా /లేదా


 తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లయితే, వారు సభ్యుడు లేదాచైర్ పర్సన్ గా ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హులా?
పిల్లల సమాచారంలో ఇంకా పిల్లల పేర్లు చేర్చని తల్లిదండ్రులు, వారు 30.07.2024 లేదా అంతకు ముందు పాఠశాలలో చేరినట్లయితే అర్హులు. అటువంటి ప్రవేశానికి మద్దతుగా నమోదు చేయబడిన సాక్ష్యం ఉండాలి.
26


 తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లయితే, వారు సభ్యుడు లేదాచైర్ పర్సన్ గా ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హులా?
ఒక తల్లి లేదా తండ్రి / సంరక్షకుల పిల్లలు ఒక సమయంలో వేర్వేరు తరగతులలో చదువుటన్నట్టు అయితే ఆయా తరగతుల కొరకు జరిగే ప్రతీ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనడానికి అర్హులు 
27 ఎయిడెడ్ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ ఎన్నికలు నిర్వహించాలా? అవును. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ సహాయంతో నడిచే పాఠశాలలు (ఎయిడెడ్ పాఠశాలలు) తప్పనిసరిగా పాఠశాల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేయాలి. ప్రయివేట్ యాజమాన్య పాఠశాలలు మినహా అన్ని పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించాలి.
28 ఒక పాఠశాలలో ఎన్ని కమిటీలను ఏర్పాటు చేయాలి ? ఒక పాఠశాలలో ఒకే కమిటిని ఏర్పాటు చేయాలి. ఒకటి నుండి పదవ తరగతి వరకు ఎన్ని తరగతులు ఆ పాఠశాలలో ఉంటే అన్ని తరగతుల నుండి సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది
28 తొమ్మిదవ మరియు పదవ తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కమిటీలో ఉండాలా? పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు కోసం తొమ్మిదవ మరియు పదవ తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఎన్నిక నిర్వహించవలసి ఉంటుంది (Memo.No.3939/APSSA/CMO/2019, Dated:16.09.2019 of the State Project Director, Samagra Shiksha)
30 ఒక విద్యార్థి తల్లిదండ్రులు సజీవంగా ఉన్నట్లయితే ఆ విద్యార్థి సంరక్షకునికి ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హత ఉంటుందా? విద్యార్థి తల్లిదండ్రులు సజీవంగా ఉన్నట్లయితే ఆ విద్యార్థి సంరక్షకునికి ఎన్నికలలో చైర్మన్ గా పోటీ చేయడానికి అర్హత ఉండదు. అలా ఎన్నిక చేసినట్లయితే సంబంధిత హెచ్.ఎం.లే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
31 ఒక పాఠశాలలో ఎన్నిక కావాల్సిన సభ్యులు కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లయితే ఎన్నిక ఎలా నిర్వహించాలి? 1 నుండి 5 తరగతులు లేదా 6 నుండి 10 తరగతులు ఉన్న పాఠశాలల విషయంలో, మొత్తం విద్యార్థుల సంఖ్య 15 లేదా అంతకంటే తక్కువ ఉంటే, తల్లిదండ్రులందరూ సభ్యులు అవుతారు మరియు సభ్యులకు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు. అయితే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించవలసి ఉంటుంది.
32 1వ మరియు 2వ తరగతులు మాత్రమే ఉన్న పాఠశాలలో ఎంతమంది సభ్యులు ఉండాలి ? 1వ మరియు 2వ తరగతులు మాత్రమే ఉన్న పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీలో మొత్తం 6 గురు ఎన్నుకోబడిన సభ్యులు ఉండాలి. అయితే మొత్తం విద్యార్థుల సంఖ్య 6 లేదా అంతకంటే తక్కువ ఉంటే, తల్లిదండ్రులందరూ సభ్యులు అవుతారు మరియు సభ్యులకు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు. అయితే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించవలసి ఉంటుంది.
33 ఒకవేళ పాఠశాలలో SC/ST లకు సంబంధించి ఒకే విద్యార్థి ఉన్నట్లయితే ఇద్దరినీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి రోస్టర్ పరంగా ఏమి చేయాలి? ఒకవేళ 'అనుకూలమైన' లేదా "బలహీనమైన వర్గాల'కి చెందిన పేరెంట్ సభ్యులు అందుబాటులో లేని పక్షంలో, ప్రస్తుతం ఉన్న రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేయవచ్చు.
Download the Complete Copy