"IDI MANCHI PRABHUTVAM" - 100 Days Completion of AP Govt Program Details

"IDI MANCHI PRABHUTVAM" - 100 Days Completion of AP Govt Program Details. Department of GV/WV & VS/WS – 100 days of Government – Conduct of “Idi Manchi Prabhutvam” (ఇది మంచి ప్రభుత్వం) Programme at Village / Ward level completion of 100 days of the Government – Scheduled from 20.09.2024 to 26.09.2024 - Certain instructions – Orders – Issued.

 
IDI MANCHI PRABHUTVAM 100 Days Celebration Program


G.O.RT.No. 14 Dated: 19-09-2024

Read: From the Director, GSWS, Vijayawada vide E-file Computer.No.2560576, Dt:19.09.2024. 

ORDER: 

Government has completed 100 days after taking office. During these 100 days, Government has fulfilled several important promises and achieved major milestones. 

It has been decided to conduct “Idi Manchi Prabhutvam” (ఇది మంచిప్రభుత్వం) Programme at Village / Ward level, from 20.09.2024 to 26.09.2024 to highlight the achievements of Government in 100 days. 

2. For the smooth conduct of the programme, all the District Collectors shall appoint Special Officers for Mandals / Urban Local Bodies and ensure participation of all the Hon’ble MLAs and other Public Representatives of the District. 

3. The Chief Planning Officer of the District is the Nodal Officer for conducting the “Idi Manchi Prabhutvam” (ఇదిమంచిప్రభుత్వం) Programme at District level. The Municipal Commissioners / MPDOs shall appoint Supervisory Officers to each Village / Ward duly ensuing participation of all Functionaries of Village / Ward Secretariats. 

4. From 20.09.2024 to 26.09.2024, the Hon’ble MLAs may participate in at least one location every day in the “Idi Manchi Prabhutvam” (ఇది మంచి ప్రభుత్వం) Programme at Villages / Wards and conduct Gram Sabha / Ward Sabha (Praja Vedika) explaining the achievements of the Government, duly covering all Mandals / ULBs in his / her Assembly Constituency. 

5. The District Collectors shall get the Stickers & Pamphlets printed and ensure distribution to all Village / Ward Secretariats. Mapping of the households with Secretariat Functionaries have been completed. The Village / Ward Secretariat Functionaries shall visit all Households and distribute Stickers & Pamphlets. They should explain the achievements of the Government during 100 days to all the Households assigned to them. 

6. The Municipal Commissioners / MPDOs shall facilitate the participation of Public Representatives along with Village / Ward Secretariat Functionaries while distributing Stickers & Pamphlets. They shall ensure submission of required information to the Chief Planning Officer daily without fail. 

7. The Chief Planning Officers of all the Districts shall furnish daily reports on “Idi Manchi Prabhutvam” (ఇది మంచి ప్రభుత్వం) Programme and participation of Public Representatives. 8. All the District Collectors in the State are requested to conduct “Idi Manchi Prabhutvam” (ఇదిమంచిప్రభుత్వం) Programme in an effective manner and create awareness on the achievements of the Government during 100 days period and ensure participation of all the Public Representatives.


What is The "IDI MANCHI PRABHUTVAM"

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి అయ్యాయి. ఈ వంద రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి చేసిన కొన్ని ముఖ్యమైన హామీలను ప్రజలలోకి తీసుకొని వెళ్లేందుకు గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో నిర్వహించనున్న కార్యక్రమం పేరే ఇది మంచి ప్రభుత్వం [ Idi Manchi Prabhutvam Program ]

Schedule of Idi Manchi Prabhutvam Program

సెప్టెంబర్ 20 నుండి 26 వరకు ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రాం [ Idi Manchi Prabhutvam Program ] ను నిర్వహించనుంది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రోగ్రాం ప్రజల లోకి వెళ్తుంది.

Participants Of Idi Manchi Prabhutvam Program


రాష్ట్రంలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలు ఈ ప్రోగ్రాంకు హాజరు అయ్యే విధముగా మరియు జిల్లా స్థాయి ప్రజా ప్రతినిధులు హాజరు అయ్యే విధముగా మండల / మునిసిపాలిటీ స్పెషల్ ఆఫీసర్లుగా జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది . జిల్లా స్థాయిలో ముఖ్య ప్రణాళిక అధికారి వారు నోడల్ ఆఫీసర్గా ఈ కార్యక్రమానికి ఉంటారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ ప్రోగ్రాం లో భాగం చేస్తూ వారి పర్యవేక్షణ నిమిత్తం మండల స్థాయిలో ఎంపీడీవో వారిని మునిసిపాలిటీ స్థాయిలో మున్సిపల్ కమిషనర్ వారిని నియమించడం జరిగినది.

Process Of Idi Manchi Prabhutvam Program

ఈ ప్రోగ్రాం లో ప్రతి ఇంటికి పంచుటకు గాను ప్రభుత్వం నుండి స్టిక్కర్లు మరియు పాంప్లెట్లు ప్రింటింగ్ చేసినవి జిల్లాల నుండి మండల అధికారుల ద్వారా సచివాలయాలకు అందించడం జరుగుతుంది . వాటిని మండల అధికారుల పర్యవేక్షణలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మరియు సంబంధిత ప్రజా ప్రతినిధుల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయవలసి ఉంటుంది. రోజువారి రిపోర్టులను తయారుచేసుకొని సంబంధిత అధికారులు ఆదేశాల మేరకు వాటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను సచివాలయ పరిధిలో ఉన్న ఇళ్లను సచివాలయ సిబ్బందితో అనుసంధానం ఇప్పటికే పూర్తి అయినది.

ప్రోగ్రాం జరుగు తేదీ సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 మధ్య సంబంధిత ఎమ్మెల్యే వారు తప్పనిసరిగా ప్రతిరోజు కనీసం ఒక గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సందర్శించి వారి నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాలను కవర్ చేసే విధంగా ఉంటుంది. అదే రోజున వారు సందర్శించే గ్రామములో గ్రామసభ లేదా వార్డు సభ ప్రజా వేదికను ఏర్పాటు చేసి ప్రభుత్వం సాధించిన విజయాలను మరియు నెరవేర్చిన హామీలకు తప్పనిసరిగా తెలియజేస్తూ ప్రజలలో భాగం అవ్వనున్నారు.

Idi Manchi Prabhutvam Pamphlat Contains

ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రాం [ Idi Manchi Prabhutvam Program ] లో ఇచ్చే పాంప్లెట్ లో ఉండే ముఖ్యమైన అంశాలు

అంశం 1 : నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డీఎస్సీ తో 16437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టటం

అంశం 2 : పెన్షన్లు ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 ఇవ్వటం ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి ₹7,000 చొప్పున ఒకేరోజు 65 లక్షల 18 వేల మందికి అది కూడా ఇంటింటికి వెళ్లి 4408 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం దేశంలోనే ఇది ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర .

అంశం 3 : ప్రతినెల ఒకటో తారీకున ఉద్యోగుల జీతాలు ఇస్తున్నారు .

అంశం 4 : 1674 కోట్ల దాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించి అన్నదాతను ఆదుకున్నారు .

అంశం 5 : స్థానిక సంస్థలకు 1452 కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోశారు .

అంశం 6 : పేదల కోసం రాష్ట్రవ్యాప్తంగా కేవలం ఐదు రూపాయలతోనే ఆకలి తీర్చే 100 అన్న క్యాంటీన్లను పున ప్రారంభించడం.

అంశం 7 : ప్రజల కంటికి నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దుచేసి ప్రజల ఆస్తులను భద్రత కల్పించారు.

అంశం 8 : విజయవాడ నగరం వరదలతో విలవిలలాడుతున్నప్పుడు పది రోజులపాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలను ఓ తండ్రిలా కాపాడుకున్నారు చంద్రబాబు గారు .





Notes On Idi Manchi Prabhutvam Program

ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రాంలో తప్పనిసరిగా రెండు విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మొదటిది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ప్రజా ప్రతినిధులతో వారికి అనుసంధానం చేసిన క్లస్టర్ పరిధిలో ఇంటికి వెళ్లినప్పుడు స్టిక్కర్ అంటించి పాంప్లెట్లో ప్రభుత్వం 100 రోజుల్లో సాధించిన విజయాలను తెలియజేయాల్సి ఉంటుంది రెండవది గౌరవ ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రాం సమయంలో కనీసం ఒక మండలానికి ఒక రోజుకి ఒక గ్రామాన్ని విజిట్ చేసి ప్రజావేదికను ఏర్పాటు చేసి ప్రభుత్వ విజయాలను చేయాల్సి ఉంటుంది.

ప్రతి ఇంటిని సచివాలయ సిబ్బందితో అనుసంధానంపూర్తి చేసి ఆ వివరాలను గ్రామ వార్డు సచివాలయ శాఖకు పంపించాల్సి ఉంటుంది .

సచివాలయ సిబ్బంది స్టిక్కర్ మరియు పాంప్లెట్ తో ఇంటింటికి వెళ్లి పాంప్లెట్ లో ఉన్న విషయాలను ఇంటింటికీ తెలియజేయాల్సి ఉంటుంది.

గౌరవ మినిస్టర్లు లేదా ఎమ్మెల్యేలు ప్రతిరోజు వారి నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలంలో గ్రామసభ లేదా ప్రజా వేదికను ఏర్పాటు చేసి చేయాల్సి ఉంటుంది షెడ్యూల్ ప్రాప్తికి సంబంధిత ప్రజాప్రతినిధులు సమాచారం అందించాల్సి ఉంటుంది.

సెప్టెంబర్ 20 ఉదయం 9 గంటలకు ప్రతి సచివాలయంలో సరిపడిన పాంప్లెట్ మరియు డోర్ స్టిక్కర్లు అందించడం జరుగుతుంది. . ఈ ప్రోగ్రాంను సచివాలయ స్థాయిలో పర్యవేక్షించడానికి స్పెషల్ ఆఫీసర్లను నియమించడం జరుగుతుంది