AP Teachers Transfers Act 2025 Passed in Assembly - Complete Act in Telugu

AP Teachers Transfers 2025 Act Passed in Assembly - Complete Act in Telugu. AP Assembly has passed the AP Teachers Transfers Act 2025 in Assembly Today. The Complete details of the Act which is passed in Assembly on 19th March 2025 is given below as it is.

AP Teachers Transfers 2025 Act Passed in Assembly - Complete Act in Telugu

AP Teachers Transfers 2025 Act Passed in Assembly - Complete Act in Telugu

ANDHRA PRADESH STATE TEACHERS TRANSFER REGULATION ACT, 2025 IN TELUGU

టీచర్స్ ట్రాన్స్ఫర్ చట్టం,2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025.

భారత గణతంత్ర రాజ్యం యొక్క డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ద్వారా ఈ క్రింది విధంగా అమలు చేయబడింది:


సంక్షిప్త శీర్షిక మరియు ప్రారంభం:1.
(1) ఈ చట్టమును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల క్రమబద్ధీకరణ మరియు ప్రారంభము. చట్టము, 2025 అని పేర్కొనవచ్చును. నిర్వచనములు.
(2) ఇది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటికి విస్తరించును.
(3) ఇది ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ గెజెట్లో అధిసూచన ద్వారా నియతము చేయునట్టి తేదీన అమలులోనికి వచ్చును.
నిర్వచనాలు:

కేంద్ర చట్టం 2009 సంఖ్య 35
2.
(i) "విద్యా సంవత్సరము" అనగా ప్రతి సంవత్సరము జూన్, 1 నుండి తరువాతి సంవత్సరం మే 31 వరకు అని అర్థము:

వివరణ:- ఒక విద్యా సంవత్సరములో కనీసము తొమ్మిది మాసముల సర్వీసు పూర్తిచేసిన ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయుడు ఒక విద్యా సంవత్సరము పూర్తి చేసినట్లుగా పరిగణించడమవుతుంది.

(ii)
“నియామకము" అనగా ప్రత్యక్ష నియామకము ద్వారా, విలీనము ద్వారా లేదా బదిలీ ద్వారా లేదా పదోన్నతి ద్వారా నియామకము అని అర్థము;

(iii) “నియామక ప్రాధికారి” అనగా తత్సమయమున అమలులో ఉన్న సంబంధిత సర్వీసు నియమములలోని నిబంధనలకు అనుగుణముగా ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ ఉపాధ్యాయుని పోస్టుకి నియామకము చేయుటకు సమర్థత గల ప్రాధికారి అని అర్థము;

(iv) "నిషేధ కాలావధి" అనగా ఆయా సమయములలో ప్రభుత్వముచే నిర్దిష్టపరచబడినట్లుగా ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయుని బదిలీలు అమలులో లేని కాలావధి అని అర్థము;

(V) "క్లస్టర్” అనగా మండల పరిధిలో గల ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల సముదాయము అని అర్థము;

(vi) "సమర్థ ప్రాధికారి" అనగా ప్రధానో పాధ్యాయుడు గ్రేడ్-11 విషయములో పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు మరియు ఉపాధ్యాయుల విషయములో జిల్లా విద్యాధికారి లేదా ఆయా సమయములలో ప్రభుత్వముచే అధిసూచింపబడిన ఎవరేని అధికారి అని అర్ధము;

(vii) "ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-11" అనగా సుంజూరు చేసిన పోస్టుపై పనిచేయుచున్న ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అని అర్ధము;

(vi) "ఉపాధ్యాయుడు" అసగా ప్రాధమిక లేదా ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టు కేటగిరీ మరియు అనుసూచిలో నిర్దిష్టపరచినట్లుగా అట్టి ఇతర పోస్టులకి నియమించబడిన వ్యక్తి అని అర్థము;

(ix) “గరిష్ఠ కాలావధి” అనగా-
(ఎ) ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-IIగా, వారు ఆ పాఠశాలలో చేరిన తేదీ నుండి ఐదు విద్యా సంవత్సరములు నిరంతర సర్వీసు.

(బి) ఉపాధ్యాయులు, వారు ఆ పాఠశాలలో చేరిన తేదీ నుండి ఎనిమిది విద్యా సంవత్సరముల నిరంతర సర్వీసు అని అర్ధము;

(x) " కనీస కాలావధి" అనగా ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయ క్యాడరులో వారు ఆ పాఠశాలలో చేరిన తేదీ నుండి రెండు విద్యా సంవత్సరముల నిరంతర సర్వీసు అని అర్ధము;

(xi) “అవసర పాఠశాలలు" అనగా ఆర్టిఇ చట్టము క్రింద విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి (పిటిఆర్) లేదా పుసర్ కేటాయింపు కొరకు ప్రభుత్వముచే నిర్వచింపబడిన ప్రమాణముల ప్రకారము ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయుడు అవసరమగు పాఠశాలలు అని అర్థము;

(xi) "పట్టణ ప్రాంతము" అనగా ఈ క్రింది ప్రాంతాలు -

(ఎ) కేటగిరీ -I - జిల్లా ప్రధాన కేంద్రముల పరిధులు, నగర కార్పొరేషన్ పరిధులు లోపలగల అన్ని ప్రాంతములు మరియు ప్రస్తుతమున్న ఇంటి అద్దె భత్యము (హెచ్ఐర్ఎ)నకు అర్హత ప్రకారము ఆయా సమయములలో రాష్ట్ర ప్రభుత్వముచే అధిసూచించబడిన ప్రాంతము.

(బి) కేటగిరీ-II - అన్ని నివాసములు/పురపాలికలు లేదా నగర పంచాయతీలు మరియు ప్రస్తుతమున్న ఇంటి అద్దె భత్యము (హెర్ఆర్ఎ)నకు అర్హత ప్రకారము ఆయా సమయములలో రాష్ట్ర ప్రభుత్వముచే అధిసూచింపబడిన ప్రాంతము. (సి) ఆయా సమయములలో ప్రభుత్వముచే నిర్వచింపబడిన ప్రమాణముల ప్రకారము అని అర్థము.

(xii) “గ్రామీణ ప్రాంతము" అనగా-

(ఎ) ఆయా సమయములలో ప్రభుత్వముచే జారీ చేయబడిన ఉత్తరువుల ప్రకారము ఇంటి అద్దె భత్యము (హెచిఆర్ఎఎ) 12% (ఆర్పియస్-2015), 10% (ఆర్పియస్-2020) అనుమతించదగిన అన్ని నివాసాల ప్రాంతములు. (బి) కేటగిరీ-III - కేటగిరీ 1 మరియు 1ల పరిధిలోకి రాని అన్ని మండల ప్రధాన కార్యస్థానములు మరియు అన్ని పరిస్థితులలో రహదారి అనుసంధానమును కలిగివున్న అన్ని నివాసాలు/గ్రామములు.

(సి) కేటగిరీ -IV - కొండప్రాంత పాఠశాలలతో సహా కేటగిరీ III పరిధిలోకి రాని నివాసములు/గ్రామములు.

(డి) ఆయా సమయములలో ప్రభుత్వముచే నిర్వచింపబడిన ప్రమాణముల ప్రకారము అని అర్థము.

(xiv) "పునర్ కేటాయింపు" అనగా విద్యా హక్కు చట్టము, 2009 క్రింద విహితపరచబడిన మరియు తదనుగుణముగా రాష్ట్ర ప్రభుత్వముచే నిర్ధారించబడిన విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి (పిటిఆర్) పై ఆధారపడి అవసరమగు పాఠశాలలకు మిగులు ఉపాధ్యాయ పోస్టులను పునర్ కేటాయించు ప్రక్రియ అని అర్థము;

(XV) “బదిలీ” అనగా ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయుని ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు పోస్టింగ్ చేయుట అని అర్థము;

(NVi) “ఉపాధ్యాయ సర్దుబాటు" అనగా ఈ చట్టములోని 14వ పరిచ్ఛేదము ప్రకారము పరిపాలనా కారణములపై అవసరమగు పాఠశాలలకు మిగులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ సమర్ధ ప్రాధికారిచే జారీచేయబడిన ఏవేని ఉత్తరువులు అని అర్థము;

(xvii) “పాఠశాల” అనగా ప్రభుత్వ/మండల పరిషత్/జిల్లా పరిషత్/పురపాలక/ సందర్భానుసారము పురపాలక కార్పొరేషన్ యాజమాన్యముల క్రింద గల ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాల అని అర్బము;

(xxvii) “అనుసూచి” అనగా ఈ చట్టమునకు అనుబంధించబడిన అనుసూచి అని అర్థము;

(xix) “మిగులు” అనగా ఆర్టి ఇ చట్టము/పునర్ కేటాయింపు ప్రమాణముల ప్రకారము సంబంధిత పాఠశాలలో అవసరమగు ఉపాధ్యాయుల కంటే ఎక్కువగా ఉన్నారని సమర్థ ప్రాధికారిచే గుర్తించబడిన ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయుడు అని అర్థము; (XX) "సినియారిటీ యూనిట్" అసగా -

(ఎ) జోన్ ప్రభుత్వ పాఠశాలలలో ప్రారంభ నియామకమైన ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II (ప్రభుత్వ పాఠశాలలు).

(బి) జిల్లా (పూర్వపు) : ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II (ఎమ్పి/జడ్పి), స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు మరియు ప్రభుత్వ/మండల పరిషత్/ జిల్లా పరిషత్ యాజమాన్యములోని ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలలోని తత్సమాన కేడర్లు.

(సి) జిల్లా (పూర్వపు) : ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II, స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు మరియు పురపాలికలు/పురపాలక కార్పొరేషన్లు/ విశాఖపట్టణ మహానగర పురపాలక కార్పొరేషన్/విజయవాడ పురపాలక కార్పొరేషన్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలలో పురపాలక యాజమాన్య పాఠశాలలోని తత్సమాన కేడర్లు అని అర్ధము.
గ్రామీణ ప్రాంతాలలో ఉపాధ్యాయుని తప్పనిసరి నియామకం అంటే కేటగిరీ III లేదా IV.
3. (1) ప్రతి నియామక ప్రాధికారి, ప్రారంభ నియామక లేదా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయునిగా పదోన్నతిని పొందు మొదటి పోస్టింగ్ సమయముస గ్రామీణ ప్రాంతాలు అనగా కేటగిరీ III లేదా IVలలో ఖాళీలను నిర్ధారించుకొని మొదటి విడతలో భర్తీ చేయవలెను.

(2) ప్రారంభ నియామకము లేదా కేటగిరీ III లేదా IVలో పదోన్నతి ద్వారా పోస్టింగ్కి ఖాళీ లభ్యముగా లేనట్లైతే అప్పుడు, ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయుని, కేటగిరీ లేదా II క్రమములోని పాఠశాలకు పోస్ట్ చేయవచ్చును.

వివరణ: పురపాలక పాఠశాలలు/పురపాలక కార్పొరేషన్ పాఠశాలలలో నియమించబడిన ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయునికి ఖండము (i) మరియు (i)లో పేర్కొనబడిన నిబంధనలు వర్తించవు. పూర్తి వివరాలు ఏపి టీచర్స్. ఇన్ వెబ్సైట్ లో కలవు 
ఉపాధ్యాయుల పునర్ కేటాయింపు 4. (1) మంజూరైన పోస్టులు మరియు పాఠశాలలో వాటిలో పనిచేయుచున్న ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయుడు ఆయా సమయములలో రాష్ట్ర ప్రభుత్వముచే నిర్ణయించబడిన విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి ఆధారముగా పునర్ కేటాయించబడుదురు.

(2) పునర్ కేటాయింపు తరువాత, ఏదేని పాఠశాలలో అధికముగా ఉన్న ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయుల పోస్ట్లను అవసరమగు ఏదేని ఇతర పాఠశాలకు బదిలీ చేయడమువుతుంది. ఆ విధంగా నిర్ధారించబడిన మిగులు ఉపాధ్యాయులను, ప్రాధాన్యతాక్రమము ఆధారముగా, ఆయా సమయములలో ప్రభుత్వముచే విహితపరచబడినట్లుగా అట్టి ఇతర షరతులకు లోబడి కౌన్సిలింగ్ ద్వారా బదిలీ చేయబడుదురు.

(3) పునర్ కేటాయింపు వలన ప్రభావితమగు ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ ఉపాధ్యాయుల కొరకు ప్రభుత్వము విడిగా మార్గదర్శకాలు జారీచేయును.
ప్రధానోపాధ్యాయుడు Gr.II/ ఉపాధ్యాయుడి బదిలీకి ప్రమాణాలు.
5. (1) అయితే, నిర్ణీత పాఠశాలలో గరిష్ఠ కాలావధి సర్వీసును పూర్తిచేసిన గ్రేడ్-11/ఉపాధ్యాయుని ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయుని తప్పనిసరిగా బదిలీ చేయడమవుతుంది.

(2) అయితే, కేటగిరీ III/III/IVలో కనీస కాలావధి సర్వీసు చేసిన ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయుని ఖాళీల లభ్యతకు లోబడి వారి యొక్క సర్వీసు ఆధారముగా, బదిలీ కోరుకొనుటకు ఐచ్ఛికమును ఇవ్వడమవుతుంది.

(3) ఆ సంవత్సరపు మే, 31 నుండి 2 సంవత్సరముల లోపు పదవీ విరమణ చేయబోవు ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయుడు, బదిలీ కొరకు వారు అభ్యర్థించిననే తప్ప బదిలీ చేయరాదు.

(4) వారి యొక్క నియామక యాజమాన్యము లోపలే బదిలీలు ప్రభావితము చేయబడతాయి.

(5) ఆ సంవత్సరము మే, 31నాటికి 50 సంవత్సరములలోపు వయసు ఉండి మరియు బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేయుచున్న పురుష ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయుని తప్పనిసరిగా బదిలీ చేయవలెను.

(6) బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేయుటకు మహిళా ప్రధానోపాధ్యాయురాలు గ్రేడ్-II/ఉపాధ్యాయురాలు లభ్యముగా లేనట్లైతే, అప్పుడు ఆ సంవత్సరము మే,31 నాటికి 50 సంవత్సరముల వయస్సు దాటిన పురుష ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయుని అట్టి పాఠశాలలో పోస్టింగ్ కొరకు పరిగణించవలెను.

(7) 5 విద్యా సంవత్సరముల సర్వీసును పూర్తిచేసిన ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II మరియు 8 విద్యా సంవత్సరముల సర్వీసును పూర్తిచేసిన ఉపాధ్యాయుడు, ఎన్సిసి అధికారులుగా ఎన్సిసి యూనిట్ ఉన్నటువంటి పాఠశాలలో ఉన్న ఖాళీలో పోస్ట్ చేయబడుదురు. ఎన్సిసి యూనిట్ వున్న మరొక పాఠశాలలో ఖాళీ లభ్యముగా లేనట్లైతే, వారి అభ్యర్థన మేరకు అదే పాఠశాలలో వారిని కొనసాగించవలెను. ఎవరేని ఎన్సిసి అధికారి క్రమశిక్షణా చర్యలను ఎదుర్కొనుచున్నట్లైతే, ఆ ఎన్సిసి అధికారిని బదిలీ చేయవలెను.

(8) లైంగిక అపరాధముల నుండి బాలల రక్షణ చట్టము, 2012/బాలికలపట్ల అసభ్య ప్రవర్తన కేసు క్రింద ఆరోపణలను ఎదుర్కొనుచున్న ఉపాధ్యాయుని అదే మండలము/ పురపాలిక లేదా ఏదేని బాలికల ఉన్నత పాఠశాలకు ఎంపిక చేయరాదు. పురపాలిక కార్పొరేషన్ పాఠశాలల విషయములో ఉపాధ్యాయుని దూరపు ప్రాంతాలలో పోస్టింగ్ చేయవలెను.

(9) ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయునికి వ్యతిరేకముగా ఆరోపణ అంశాలు పెండింగ్లో ఉన్నట్లైతే, అతడు/ఆమె యొక్క బదిలీ అభ్యర్థనను పరిగణనలోనికి తీసుకోరాదు.
ఖాళీల నోటిఫికేషన్
6.
(1) ప్రభుత్వము ఈ క్రింది ఖాళీలను నోటిఫై చేయును,-
(i) పదవీ విరమణ ఖాళీలతో సహా స్పష్టమైన ఖాళీలు;
(ii) తప్పనిసరి బదిలీ క్రింద ఖాళీలు;
(iii) పుసర్ కేటాయించు ఖాళీలు;
(iv) బదిలీ మార్గదర్శకములు జారీచేసిన తేదీ నాటికి ఒక సంవత్సరము లేదా ఒక సంవత్సరము కంటే ఎక్కువ అసధికార గైరుహాజరు కారణంగా ఉత్పన్నమైన ఖాళీలు:
(v) అధ్యయన సెలవు ఖాళీలు;
(vi) బదిలీల కౌన్సిలింగ్ ఫలితముగా ఖాళీలు.

(2) ఖాళీలను నిలిపి ఉంచుటకు నిబంధన, -
(i) జిల్లాలో ఏవేని మిగులు ఖాళీలను గుర్తించిన సందర్భములో, ఆ ఖాళీలు జిల్లాలోని మండలాల మధ్య సమానంగా పంపిణీ చేయబడవలెను;
(ii) ఖాళీలను నిలిపి ఉంచుటకు ఆయా సమయములలో ప్రభుత్వము విడిగా మార్గదర్శకాలను జారీచేయును.

కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు
7. (1)
ఈ చట్టము క్రింద ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయ బదిలీ, ఆయా సమయములలో విహితపరచబడునట్టి అట్టి రీతిలో నిర్వహించబడు వెబ్-ఆధారిత కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా చేయడమవుతుంది.

(2) ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయుడు బదిలీని హక్కుగా క్లెయిమ్ చేయరాదు మరియు ఈ మార్గదర్శకములు కోరిన ప్రదేశములలో పోస్టింగ్ కొరకు ఏదేని హక్కుగా ఉద్దేశించబడవు లేదా కలుగజేయవు.

(3) బదిలీలను అమలు చేయునపుడు, పారదర్శక రీతిలో కౌన్సిలింగ్ ప్రక్రియను జరుపుటకు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో కమిటీలను ఏర్పాటు చేయును.

అనుసూచిలో ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయ బదిలీ.:
8. అనుసూచిలో నిర్దిష్టపరచిన పోస్టులన్నీ, 9వ మరియు 10వ పరిచ్ఛేదము ప్రకారము నిర్దిష్టపరచిన పోస్ట్లకు పాయింట్లపై ఆధారపడి ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే భర్తీ చేయబడవలెను.

అర్హత పాయింట్లు
9. (1) స్టేషను పాయింట్లు : ఆయా పాఠశాలలలో సర్వీసు చేసిన సంవత్సరముల సంఖ్య ఆధారముగా ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయునికి క్రింద వివరించబడినట్లుగా ప్రదానం చేయబడతాయి, -
(i)
  • కేటగిరీ -I ప్రదేశము-1 పాయింట్ / సంవత్సరము
  • కేటగిరీ-II ప్రదేశము - 2 పాయింట్లు / సంవత్సరము
  • కేటగిరీ -III ప్రదేశము-3 పాయింట్లు / సంవత్సరము
  • కేటగిరీ -IV ప్రదేశము-5 పాయింట్లు / సంవత్సరము
ప్రారంభంలో ఒక కేటగిరీ క్రింద వర్గీకరించబడి మరియు తరువాత మరొక కేటగిరీకి (హెచ్ఐర్ఎ లేదా రోడ్డు పరిస్థితుల ప్రకారము) తిరిగి వర్గీకరించిన గ్రామాలు లేదా పట్టణాల విషయంలో స్టేషన్ పాయింట్లు దామాషా ప్రకారం లెక్కించబడవలెను.

అయితే, ఆయా సమయములలో ప్రభుత్వముచే అధిసూచించబడిన ఐటిడిఎ ప్రాంతాలలో పనిచేయుచున్న వ్యక్తులు స్టేషన్ పాయింట్లకు అదనముగా సంవత్సరమునకు అదనముగా ఒక పాయింట్ను పొందుతారు.

(2) సర్వీసు పాయింట్లు :
చేసిన సేవకు : ఆ సంవత్సరము మే 31 నాటికి, అన్ని క్యాడర్లలో సంవత్సరము సర్వీసు పూర్తిచేసిన ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయునికి 0.5 పాయింటు ఇవ్వబడును. 

బదిలీలలో ప్రత్యేక పాయింట్లు
10. (1) బదిలీలలో ఈ క్రింది విధంగా ప్రత్యేక పాయింట్లు కేటాయించబడును,-
(i) ఎవరి జీవిత భాగస్వామి అయితే రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ/ప్రభుత్వరంగ సంస్థలు/ స్థానిక సంస్థలు లేదా ఎయిడెడ్ సంస్థలలో పనిచేయుచున్నారో ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II)/ ఉపాధ్యాయునికి మరియు రాష్ట్ర ప్రభుత్వము క్రింద నిర్వహించబడుతున్న విద్యా సొసైటీలలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు కూడా.

(ii) జీవిత భాగస్వామి ప్రయోజన పాయింట్లు 5/8 విద్యా సంవత్సరాలలో కేవలము ఒక్కసారే దంపతులలో ఒకరికే వర్తించును.

(2) 40 సంవత్సరాల వయస్సు పైబడిన అవివాహిత మహిళా ఉపాధ్యాయులు. (3)(i) దివ్యాంగులు అంటే 40 శాతము నుండి 55 శాతము దివ్యాంగతతో దృష్టిలోపము/ శల్య వైకల్యం/ వినికిడి లోపము ఉన్న ఉద్యోగులు.

3) దివ్యాంగులు అంటే 56 శాతము నుండి 69 శాతము దివ్యాంగతతో దృష్టిలోపము/శల్య వైకల్యం/వినికిడి లోపము ఉన్న ఉద్యోగులు.

(4) రాష్ట్ర/జిల్లా స్థాయిలో (పూర్వపు జిల్లాలు) గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు.

(5) చట్టపరంగా విడిపోయిన మహిళలు, ప్రస్తుతము ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న సైన్యం/నావికాదళం/వైమానికదళం/బిఎస్ఎఫ్/సిఆర్పిఎఫ్/సిఐఎస్ఎన్ఎలోని మాజీ సైనికోద్యోగులు మరియు సైన్యం/నావికదళం/వైమానికదళం/బిఎస్ఎఫ్/సిఆర్పిఎఫ్/ సిఐఎస్ఎఫ్ఎలో పనిచేస్తున్న వారి యొక్క జీవిత భాగస్వామి.

(6) పరిశీలనా సమయమునకు ముందు రెండు సంవత్సరాల నుండి స్కౌట్స్ మరియు గైడ్స్ యూనిట్ను నిర్వహిస్తున్నవారు.

వివరణ : ఆయా సమయమములలో ప్రభుత్వము పాయింట్లను సూచిస్తుంది.

బదిలీలకు ప్రాధాన్యత కేటగిరీ

11. (1)
(i)బదిలీల కోసము ప్రాధాన్యత కేటగిరీలు ఈ క్రింది విధముగా ఉంటాయి, - దివ్యాంగులు అంటే 80 శాతము కంటే ఎక్కువ లేదా సమానమైన దృష్టి లోపము/శల్య వైకల్యము గల ఉద్యోగులు,

(i) దివ్యాంగులు అంటే 70 శాతము కంటే ఎక్కువ లేదా సమానమైన లోపము/శల్య వైకల్యము/వినికిడి లోపము ఉన్న ఉద్యోగులు.

(iii)వితంతువు (పునర్వివాహము చేసుకొన్నచో ఇది వర్తించదు).


(iv) ఈ క్రింది వ్యాధులతో బాధపడుతూ చికిత్స పొందుతున్న అతడు/ఆమె ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయుడు;
(ఎ) క్యాన్సర్;
(బి) ఒపెన్ హార్ట్ సర్జరీ/గుండెలోని కర్ణికల మధ్య రంధ్రం ఉండటం/అవయవ మార్పిడి;
(సి) ముఖ్యమైన నాడీ శస్త్రచికిత్స;
(డి) బోన్ బి:
(ఇ) మూత్రపిండాల మార్పిడి/డయాలిసిస్: మరియు
(ఎఫ్) వెన్నెముక శస్త్రచికిత్స.
(v) జీవిత భాగస్వామికి మానసిక వైకల్యము ఉండి మరియు చికిత్స పొందుతూ, తనపై ఆధారపడిన పిల్లలున్న ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయుడు.
(vi) బాల్యంలోనే మధుమేహం/తలసీమియా వ్యాధి/ హిమోఫీలియా వ్యాధి/మస్కలర్ డైస్ట్రోఫీతో బాధపడుతూ మరియు చికిత్స తీసుకుంటూ తనపై ఆధారపడిన పిల్లలున్న ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయుడు.

వివరణ:
(ఏ) పై కేటగిరీ క్రింద బదిలీ కోసము దరఖాస్తు చేసుకొన్నటువంటి ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయుడు జిల్లా/రాష్ట్ర వైద్య మండలి ధృవీకరించిన అన్ని వైద్య నివేదికల/ధ్రువీకరణ పత్రాలను తాజాగా ఆన్లైన్ ద్వారా దాఖలు చేయవలెను మరియు పాత ధ్రువీకరణ పత్రాలు అనుమతించబడవు. 


(బీ) ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయుడు ప్రాధాన్యత కేటగిరీలను గాని లేదా ప్రత్యేక పాయింట్లను గాని 5/8 సంవత్సరములలో వరుసగా ఒకసారే ఉపయోగించుకోవలెను.

(2) పుట్టుకతోనే గుండె లోపము (గుండెలో రంధ్రాలు)తో జన్మించి, శస్త్ర చికిత్స జరిగి తమపై ఆధారపడిన పిల్లలున్న ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయునికి శస్త్రచికిత్స జరిగిన తేదీ నుండి (3) సంవత్సరాలలోపు ప్రాధాన్యత కేటగిరీ క్రింద పరిగణనలోనికి తీసుకొని ప్రాధాన్యత ఇవ్వవలెను.
(3) అయినప్పటికినీ, ఉప-పరిచ్ఛేదము (1) లో పేర్కొన్న కేటగిరీలకు -

(i)సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు - నిర్దిష్ట పాఠశాలలో 40 శాతము ఖాళీలను భర్తీ చేయడమవుతుంది.
(ii) స్కూల్ అసిస్టెంట్లు - నిర్దిష్ట పాఠశాలలో ప్రతి సబ్జెక్టులలో 50 శాతము ఖాళీలను భర్తీ చేయడమవుతుంది.
(ii) సబ్జెక్టుకు ఒకే ఉపాధ్యాయుడు ఉన్న ఉన్నత పాఠశాలలలోని స్కూల్ అసిస్టెంట్లు పరిగణనలోనికి తీసుకోబడరు.

 
ఉపాధ్యాయుల పనితీరు.
12. పనితీరుపై పాయింట్లకుగాను ప్రభుత్వము ఆయా సమయములలో ప్రత్యేకమైన మార్గదర్శకాలు జారీచేయును.
నెగెటివ్ పాయింట్లు 13. ఒకవేళ అనధికారికంగా గైరుహాజరైతే క్రమశిక్షణా చర్యల క్రింద శిక్ష విధించడంతో పాటు గైరుహాజరయిన ప్రతి నెలకు ఒక పాయింటు చొప్పున తగ్గించి, గరిష్ఠంగా 10 పాయింట్లకు పరిమితం చేయడమవుతుంది. ఈ చట్టము అమలులోనికి వచ్చిన తేదీ తరువాత అనధికార గైరుహాజరుకు నెగెటివ్ పాయింట్లు కేటాయిస్తారు.
ఉపాధ్యాయ సర్దుబాటు

14. మిగులు ఉపాధ్యాయులను అవసరమైన పాఠశాలలకు ప్రభుత్వ అనుమతితో మరియు పరిపాలన కారణాలపై సమర్థ ప్రాధికారి అవసరమైనప్పుడు సర్దుబాటు చేయును

అభ్యర్థన/పరస్పర/ఇంటర్ డిస్ట్రిక్ట్/ఇంటర్ స్టేట్ బదిలీ విషయంలో15. విన్నపము/పరస్పర/అంతర్ జిల్లా/అంతర్ రాష్ట్ర బదిలీలను పరిశీలించడానికి ప్రభుత్వము సమర్థ ప్రాధికారిగా ఉన్నది.

బదిలీలపై నిషేధము ఉన్న సమయములో విన్నపము లేదా పరస్పర ప్రాతిపదికపై ఎవరేని ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II లేదా ఉపాధ్యాయుడు బదిలీ అయినట్లయితే నిర్బంధ బదిలీ కోసము అర్హతను నిర్ధారించునప్పుడు గరిష్ఠ కాలాపధిని లెక్కించడానికి అప్పుడు రెండు ప్రాంతాలలో పనిచేసిన కాలావధిని పరిగణనలోనికి తీసుకోవలెను
బదిలీల క్యాలెండర్7వ పరిచ్ఛేదములో పేర్కొన్న టైమ్ షెడ్యూల్ ప్రకారము లేదా ఆయా సమయములలో ప్రభుత్వము అధిసూచన ద్వారా, సంవత్సరములో ఒకసారి మాత్రమే సాధారణ బదిలీలు చేయును.

(2) పరిపాలనాపరంగా అవసరము ఏర్పడిన సందర్భములలో సంవత్సరములో ఏ సమయములోనైనా ప్రభుత్వము బదిలీలను చేపట్టవచ్చును.
ఫిర్యాదు/విచారణ పరిష్కారం17. (1) జిల్లా విద్యాధికారి/పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు/ కమీషనర్/పాఠశాల విద్యా సంచాలకుల అధ్యక్షతన జిల్లా/జోనల్/రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వము వ్యధ నివారణ కమిటీలను ఏర్పాటు చేయును.

(2) సమస్యలను పరిష్కరించడానికి వ్యధ నివారణ కమిటీల కొరకు ప్రభుత్వము మార్గదర్శకాలు జారీచేయును.

(3) పైన తెలిపిన దానికి భిన్నంగా ఏమి ఉన్నప్పటికినీ, అన్ని స్థాయిలలోని వ్యధ నివారణ యంత్రాంగము విఫలమైన తరువాత మాత్రమే అతడు/ఆమె గౌరవ న్యాయస్థానములకు వెళ్ళవచ్చును.
ఇతరాలు 18. (1) బదిలీ చేయడానికి ముందే కౌన్సిలింగ్, పునర్ కేటాయింపు పూర్తి చేయవలెను. బదిలీలు పూర్తి అయిన తరువాత అప్పుడు, ఉపాధ్యాయుల సర్దుబాటు ఏదైనా ఉన్నట్లయితే వాటిని నిర్వహించడానికి సమర్థ ప్రాధికారి అనుమతించవచ్చును.

విహితపరచబడిన నియమములను పురస్కరించుకొని ప్రతి సంవత్సరము బదిలీ కౌన్సిలింగ్ను నిర్వహించడానికి ప్రభుత్వము విడిగా మార్గదర్శకాలు జారీచేయును. (3) ఒకవేళ మార్గదర్శకాలలో ఏమైనా పరస్పర విరుద్ధముగా ఉన్నట్లయితే, చట్టములో పేర్కొన్న నియమములు చెల్లుబాటులో ఉండును.

(4) ప్రభుత్వము బదిలీ మార్గదర్శకాలు జారీచేయు సమయములో, ప్రత్యేక/పునర్ కేటాయింపు క్రింద కేటాయించబోయే పాయింట్ల సంఖ్యను వివరముగా తెలియజేయును.

(5) ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తుదారులకు అర్హతగల పాయింట్లు సమానము అయిన సందర్భములో ఈ క్రింది విధంగా అనుక్రమము ప్రకారము పరిశీలనలోనికి తీసుకోవడమవుతుంది.

(i) ఆ క్యాడర్లో సీనియారిటీని పరిగణనలోనికి తీసుకోవలెను.
(ii)ఖండము (i)తో పాటు పుట్టిన తేదీ (సీనియర్) ఆధారముగా అభ్యర్థికి ప్రాధాన్యత.
(iii)మహిళలు.
(6) ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II ఉపాధ్యాయునిపై ఏవేని క్రమశిక్షణా అంశాలు ఉన్నట్లయితే, సమర్థ ప్రాధికారి జిల్లా కలెక్టర్ అనుమతితో ఏదేని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయవచ్చును.

(7) శాఖకు సంబంధము లేని విద్యాయేతర విధులపై ఆంక్ష
విద్యా హక్కు చట్టము, 2009లోని 25(2) మరియు 27వ పరిచ్ఛేదముల ప్రకారము, ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయునికి జనాభా లెక్కలు, విపత్తు ఉపశమన చర్యలు లేదా ఎన్నికల విధులు మినహా విద్యాయేతర విధులు కేటాయించరాదు. ఆ విధంగా ప్రధానోపాధ్యాయులు గ్రేడ్-II/ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖకు సంబంధము లేని శాఖలకు బదిలీ చేయరాదు/డిప్యూటేషన్) పంపరాదు.


19. ఈ చట్టపు నిబంధనలు లేదా తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనములో ఏమి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదము పొందిన తరువాత అప్పిలేట్ ప్రాధికారి, విద్యా ప్రయోజనమునకు లేదా పరిపాలనా కారణాలపై పబ్లిక్ సర్వీసు ప్రయోజనమునకు లేదా అధిక పబ్లిక్ ప్రయోజనము కొరకు ఎవరేని ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయుని సర్వీసులను ఏదేని ఇతర పాఠశాలకు బదిలీ చేయవచ్చును.
ప్రభుత్వ ఆమోదముతో బదిలీ
19. ఈ చట్టపు నిబంధనలు లేదా తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనములో ఏమి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదము పొందిన తరువాత అప్పిలేట్ ప్రాధికారి, విద్యా ప్రయోజనమునకు లేదా పరిపాలనా కారణాలపై పబ్లిక్ సర్వీసు ప్రయోజనమునకు లేదా అధిక పబ్లిక్ ప్రయోజనము కొరకు ఎవరేని ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయుని సర్వీసులను ఏదేని ఇతర పాఠశాలకు బదిలీ చేయవచ్చును. 
అపరాధములు మరియు పెనాల్టీలు20. (1) ఈ చట్టములోని ఏవేని నిబంధనలను ఉల్లంఘించినయెడల ఈ చట్టము క్రింద మరియు పెనాల్టీలు. శిక్షార్హమైన అపరాధం చేసినట్లుగా పరిగణించడమవుతుంది.

(2) ఎవరేని ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ఉపాధ్యాయుడు తప్పుడు సమాచారం/ తప్పుడు డాక్యుమెంట్లు/వైద్య నివేదికలను సమర్పించినట్లయితే ఎపిసియస్ (సిసి&ఎ) నియమములు 1991 ప్రకారం క్రమశిక్షణా చర్యకు పాత్రులగుదురు మరియు వారిని కేటగిరీ-IV పాఠశాలకు బదిలీ చేయడమపుతుంది మరియు 5/8 సంవత్సరాలు ఏ విధమైన బదిలీ లేకుండా తప్పనిసరిగా పనిచేయవలెను.

(3) తప్పుడు సమాచారం/తప్పుడు డాక్యుమెంట్లు/వైద్య నివేదికలపై ధ్రువీకరణ సంతకం చేసిన ఎవరేని అధికారిని నియమముల ప్రకారం దోషారోపణ అభియోగమునకు అదనముగా ఎపిసియస్ (సిసి&ఎ) నియమములు, 1991 ప్రకారం క్రమశిక్షణా చర్య తీసుకోవడమవుతుంది.

(4) ఈ చట్టములోని నిబంధనలు లేదా దాని క్రింద చేయబడిన నియమములకు విరుద్ధముగా ఎవరేని సమర్ధ ప్రాధికారి పోస్టింగ్ లేదా నియామకం లేదా బదిలీ ఉత్తర్వు జారీ చేసినట్లయితే అట్టి సమర్థ ప్రాధికారి లేదా సందర్భానుసారం అధికారిపై, ఎపిసియస్ (సిసి&ఎ) నియమములు, 1991 ప్రకారం క్రమశిక్షణా చర్య తీసుకోవడమవుతుంది.

(5) తప్పనిసరిగా బదిలీ చేయబడవలసి ఉండి మరియు కౌన్సిలింగ్కు దరఖాస్తు చేసుకోకుండా గైరుహాజరైన ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్-II/ ఉపాధ్యాయుని కేటగిరీ-IVలో మిగిలిపోయి అవసరమున్న ఖాళీలకు మాత్రమే పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వవలెను, కేటగిరీ-IVలో ఖాళీలు అందుబాటులో లేనట్లైతే అప్పుడు ఆ నిర్ణీత కేటగిరీ ఉపాధ్యాయుల యొక్క వెబ్ కౌన్సిలింగ్ చివరిలో కేటగిరీ -IIIలో కేటాయించవలెను.
నేరాల విచారణ21. అధికారిక గెజెట్లో దీని తరఫున ప్రచురించిన అధిసూచన ద్వారా ప్రభుత్వముచే ప్రాధికారమీయబడిన అధికారి లిఖితపూర్వకముగా ఫిర్యాదు చేసిననే తప్ప, ఈ చట్టము క్రింద ఏదేని అపరాధమును న్యాయస్థానము విచారణ చేపట్టరాదు.
ఇతర చట్టాలను అధిగమించే చట్టం22. తత్సమయమున అమలులో ఉన్న ఏదేని ఇతర శాసనములో ఉన్నదానికి అసంగతముగా ఏమి ఉన్నప్పటికీ, ఈ చట్టములోని నిబంధనలు అధిగమించే స్వభావమును కలిగి ఉండవలెను.
ఇబ్బందులను తొలగించే అధికారం

23. (1) ఈ చట్టపు నిబంధనలను అమలుచేయుటలో ఏదేని ఇబ్బంది ఏర్పడినచో, రాష్ట్ర ప్రభుత్వము, అధికారిక గెజెటులో ప్రచురించిన ఉత్తరువు ద్వారా, ఈ చట్టపు నిబంధనలకు అసంగతము కాకుండా అట్టి ఇబ్బందిని తొలగించుటకు అవసరమని లేదా ఉపయుక్తమని తోచునట్టి నిబంధనలను చేయవచ్చును.

అయితే, ఈ చట్టము అమలులోనికి వచ్చిన తేదీ నుండి రెండు సంవత్సరముల కాలావధి ముగిసిన తరువాత అట్టి ఉత్తరువు జారీచేయరాదు.

(2) ఈ పరిచ్ఛేదము క్రింద చేసిన ప్రతి ఉత్తర్వును అది చేసిన తర్వాత వీలైనంత త్వరగా శాసనమండలి ప్రతి సదనము సమక్షమున ఉంచవలెను.

సవరించే అధికారం24. రాష్ట్ర ప్రభుత్వము, అధిసూచన ద్వారా, అనుసూచీలో నిర్దిష్టపరచిన ఏవేని సమోదులను చేర్చవచ్చును, మార్చవచ్చును లేదా తొలగించవచ్చును.
మంచి విశ్వాసంతో తీసుకున్న చర్యకు రక్షణ25. ఈ చట్టము లేదా దాని క్రింద చేయబడిన నియమాల క్రింద సద్భావముతో చేసిన లేదా చేయడానికి ఉద్దేశించిన దేనికైనను ఎవరేని ప్రభుత్వ అధికారిపై ఏవిధమైన దావా, అభియోగము లేదా ఇతర శాసనిక చర్యలు చేపట్టరాదు.
నియమాలను చేయుటకు అధికారం26. (1) ఈ చట్టము యొక్క అన్ని లేదా ఏవేని ప్రయోజనాలను నెరవేర్చడానికి రాష్ట్ర చేయుటకు అధికారము. ప్రభుత్వము, అధిసూచన ద్వారా ఆంధ్రప్రదేశ్ గెజెట్లో నియమములను రూపొందించవచ్చును.

నియమములు
(2) ఈ చట్టము క్రింద చేసిన ప్రతి నియమము దానిని చేసిన వెంటనే అపుడు రాష్ట్ర శాసనమండలి సమావేశమునందున్నచో ఆ సమావేశములో, అది సమావేశములో లేనిచో వెనువెంటనే వచ్చు సమావేశములోను దాని సమక్షమున మొత్తము పదునాలుగు (14) దినముల కాలావధిపాటు ఉంచవలెను. అట్టి కాలావధి ఒకే సమావేశములో గాని రెండు (2) అనుక్రమ సమావేశములలో గాని చేరి ఉండవచ్చును మరియు అట్లు దానిని ఉంచిన సమావేశము లేదా దాని తరువాత సమావేశము ముగియులోపల రాష్ట్ర శాసనమండలి ఆ నియమములో లేదా ఆ నియమము రద్దులో ఏదేని మార్పు చేయుటకు అంగీకరించినచో ఆ మార్పు లేదా రద్దు ఆంధ్రప్రదేశ్ గెజెటులో అధిసూచించబడిన తేదీ నుండి ఆసియదును అట్ల మార్పు చేయబడిన రూపములో మాత్రమే అమలు కలిగివుండును లేదా సందర్భానుసారముగా రద్దగును. అయినప్పటికీ ఏడేని అట్టి మార్పు లేదా రద్దు ఆ నియమము క్రింద అంతకు పూర్వం చేయబడిన దేని శాససమాన్యతకైననూ భంగము కలిగించదు
చట్టం వర్తించకపోవడం ఈ చట్టము ఈ క్రింది వాటికి వర్తించదు:

(1) పాఠశాల విద్యాశాఖ క్రింద పనిచేయుచున్న మండల విద్యాధికారులు.
(2) సొసైటీలు అనగా ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలల సొసైటీ, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ మరియు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయముల (కెజిబివిలు) ద్వారా నిర్వహిస్తున్న పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు.

(3) సంబంధిత సొసైటీల క్రింద పనిచేసే ఉపాధ్యాయులకు, ఆయా సొసైటీల ఉప-నిబంధనావలి వర్తించును.

Download the AP Teachers Transfers 2025 Act Passed In Assembly